Sarojini Naidu 144th Birthday Special Story: సమాజంలోని మహిళలకు సరోజినీ నాయుడు స్పూర్తి సందేశం..!
సరోజినీ నాయుడు అనగానే భారత దేశపు గానకోకిలగా మనకు జ్ఞప్తికి వస్తుంది. కేవలం ఆ ఒక్కటి మాత్రమే కాదు. ఆవిడ చేసిన మహోత్తర ఘట్టాలు మనకు ఉన్న వేళ్లలో లెక్కపెట్టలేనన్ని ఉన్నాయి. కొద్దిగా సామాజిక అంశాలపట్ల పట్టు ఉన్న వారికైతే ఈవిడ గురించి అవగాహన ఉంటుంది. కానీ నేటి తరానికి ఇలాంటి సాంఘీక సంస్కర్తల గురించిన అవగాహన పిసరంత కూడా లేదని చెప్పాలి. వారందరి కోసమే ఈ కథనం.
సరోజినీ నాయుడు అనగానే భారత దేశపు గానకోకిలగా మనకు జ్ఞప్తికి వస్తుంది. కేవలం ఆ ఒక్కటి మాత్రమే కాదు. ఆవిడ చేసిన మహోత్తర ఘట్టాలు మనకు ఉన్న వేళ్లలో లెక్కపెట్టలేనన్ని ఉన్నాయి. కొద్దిగా సామాజిక అంశాలపట్ల పట్టు ఉన్న వారికైతే ఈవిడ గురించి అవగాహన ఉంటుంది. కానీ నేటి తరానికి ఇలాంటి సాంఘీక సంస్కర్తల గురించిన అవగాహన పిసరంత కూడా లేదని చెప్పాలి. వారందరి కోసం ఈమె జీవిత ముఖ చిత్రాన్ని అందమైన సారాంశంలో సందేశాత్మకంగా అందిస్తున్నాం.
బాల్యంలోనే సాహిత్య గుమాళింపు:
ఈమె ఫిబ్రవరి 13న 1879లో జన్మించారు. ఈమె స్వస్థలం హైదరాబాద్. బాల్యం కొంత వరకూ హైదరాబాద్ లో సాగింది.12వ ఏట ఈమెకు సాహిత్యం పట్ల ఆసక్తి పెరిగి మంచి పట్టు సాధించి మహర్ మున్నీర్ అనే పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకానికి హైదరాద్ నిజాం వారి నుంచి బహుమానం లభించింది. ఈ బహుమానాన్ని స్కాలర్ షిప్ రూపంలో ఆమెకు అందించి సత్కరించారు. ఆ డబ్బుతో ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లి అక్కడి కింగ్స్ కాలేజీలో చేరారు. అక్కడ ఈమెను నోబల్ సాహితీవేత్తలైన ఆథర్ సైమన్, యడ్మోండ్ గాసే అనే ఇరువురు భారతీయ నేపథ్యం రచనలపై దృష్టి సారించమని సలహాలిచ్చారు. సరిగ్గా ఇదే సమయంలో పడిపాటి గోవిందరాజులు అనే అతనితో ఈమె ప్రేమలో పడ్డారు. ఆమెకు 19వ ఏట ప్రేమించిన అతనితోనే 1898లో వివాహం జరిగింది. వీరికి జయసూర్య, పద్మజ, రణ్‌ధీర్, లైలామాన్ అనే నలుగురు పిల్లలు ఉన్నారు.
పాతికేళ్లకే ప్రపంచస్థాయి గుర్తింపు:
మొట్టమొదటి మహిళా స్వాతంత్య్ర సమరయోధుల్లో సరోజినీ నాయుడు ప్రధములు. 1905 భారత జాతీయ సంస్కరణల్లో భాగమైయ్యారు. ఈ ఏడాది ది గోల్డెన్ థ్రెషోల్డ్ అనే పేరుతో మహిళ తిరిగి అభివృద్ది చెందుతున్న సాంస్కృతిని వివరిస్తూ పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా బహు ప్రాశస్థ్యం పోందింది. దీంతో ఆమె రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. ఇందుకుగానూ 1915 -18 మధ్య దేశ విదేశాలలోని పలు ప్రాంతాలను సందర్శించారు. ఇందులో మహిళా సాధికారత, సామాజిక సంక్షేమంతో పాటూ జాతీయవాదం గురించి పలు ప్రసంగాలు చేసి మహిళల్లో ప్రేరణ కలిగించారు. 1917లో భారతీయ మహిళా సంఘాన్ని నెలకొల్పారు. బాల్యవివాహాలు,స్త్రీ విద్య, దేవదాసీ విధానాలపట్ల పోరాటాలు చేశారు.
భారత తొలి మహిళా గవర్నర్‌గా బాధ్యతలు:
దీనికంటే ముందు మహిళా హక్కులపై ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కలకత్తలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో పాల్గొన్నారు. అక్కడ తనదైన స్వరాన్ని వినిపించారు. అప్పుడే మహాత్మాగాంధీ, ముత్త లక్ష్మీ రెడ్డితలో సత్సంబంధాలు ఏర్పడ్డాయి. దీంతో జాతీయోద్యమంలో అందరూ కలిసి భాగస్వామ్యమయ్యారు.1925లో ఇండయన్ నేషనల్ కాంగ్రెస్‌కు మెదటి మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. 1930లో గాంధీ చేపట్టిన ఉప్పుసత్యాగ్రహ ఉద్యమంలో మహిళలు పాల్గోనడానికి ఆయన అంగీకరించలేదు. అయినప్పటికీ సరోజినీ నాయుడు పాల్గొన్నారు. అప్పటికే గాంధీని అరెస్ట్ చేయడంతో చేపట్టిన ఉద్యమం గాడి తప్పకూడదనే ముఖ్య ఉద్దేశ్యంతో సరోజినీ నాయుడునే ముందుండి నడిపించమని గాంధీ తెలిపారు. ఉద్యమాన్ని చురుగ్గా నిర్వహిస్తూనే పలు రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొన్నారు. అందుకు గానూ 1932లో జైల్లో వేశారు. మళ్లీ 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు 21 నెలలపాటూ జైలు జీవితం అనుభవించారు. 1947లో మనకు స్వాతంత్యం వచ్చిన తరువాత ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్‌గా నియమించారు. ఈవిడే తొలి మహిళా గవర్నర్ గా సేవలందించారని చెప్పాలి.1949లో గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ లక్నో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. జాతీయోద్యమంలో గాంధీజీకి సలహాలు, సూచనలతో పాటూ బ్రిటీష్ వారిని మనదేశం నుంచి తరిమికొట్టేందుకు పలు కీలకమైన వ్యూహాలను కూడా అందించారు. అందుకే ఆమెను మహాత్మాగాంధీకా మిక్కీమౌస్ అని సంభోదించేవారు.
నేటి తరానికి ప్రేరణాత్మక సందేశం:
నేటికి ఆమె జన్మించి 144 సంవత్సరాలు అవుతుంది. అదేదో సామెతను ఇక్కడ మనం సరిగ్గా అన్వయించుకోవల్సి వస్తుంది. ఏమీ లేని ఆకు ఎగిరి ఎగిరి పడుతుంది. అన్నీ ఉన్న ఆకు అణిగి మనిగి ఉంటుంది అని గొప్పగా చెప్పేందుకు వాడుతూ ఉంటారు. ఇక్కడ మనం దీనిని ద్వందార్థంలో వాడాల్సి వస్తుంది. రమారమీ 145 సంవత్సరాల క్రితం సరైన విద్య, వైద్యం, సాంకేతికత, ఆర్థిక, సామాజిక పరిస్థితులు లేనప్పటికీ ఆమె అంతగా పోరాడి గెలిచారు. దేశాన్ని గెలిపించారు. అదికూడా ఒకే ఒక్క మహిళ ఎవరి మద్దతూ లేకుండా స్వయం కృషితో ఎదిగారు. శతాబ్ధాల క్రితం కందుకూరి, గురజాడలు స్త్రీ విద్యను ప్రోత్సహించినా.. దశాబ్ధాల క్రిందటే శ్రీపాద, చలంలు స్త్రీ అభ్యుదయాన్ని వివరించినా..ప్రస్తుతం సతీష్ చందర్, కొప్పిలి పద్మలతో పాటూ పలువురు వారి రచనల్లో స్త్రీవాదాన్ని ప్రోత్సహిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం మహిళలకు పైన చెప్పిన అన్ని పరిస్థితులు పుష్కలంగా ఉన్నప్పటికీ అంతగా ఎదగలేక పోతున్నారు. దీనికి కారణం పురుషాహంకారమా.? పితృస్వామ్య భావజాలమా.? కుటుంబ వారసత్వ రాజకీయమా.? ఒక్కసారి ఆలోచించాలి. సరోజినీ నాయుడు సామాన్య బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినాకూడా ఆనాటి బ్రిటీష్ వారితో ధీటుగా పోరాడినట్లు.. నేటి తరం మహిళలు సమాజంలోని రుగ్మతల మీద పోరాడి గెలిచి తమకు కావల్సిన హక్కులను సాధించాలి. అప్పుడే ఈ స్వాతంత్య్రానికి ఒక విలువ ఉంటుంది. ఆవిడ చేసిన సంస్కరణలకు అర్థం ఉంటుంది. సరోజినీ నాయుడుకి 144వ జన్మదినం సందర్భంగా ఇదే మనం ఇచ్చే సరైన గౌరవం అని చెప్పాలి.
T.V.SRIKAR