Nipah Virus: నిఫా వైరస్‌ విజృంభణ.. మరోసారి లాక్‌డౌన్ విధిస్తారా..?

ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటే మరొకసారి దేశంలో లాక్ డౌన్ విధించే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయ్. ఐతే ఈసారి అందుకు కారణం మాత్రం కరోనా వైరస్ కాదు. అంతకుమించిన ప్రాణాంతకమైన వైరస్ నిఫా వైరస్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 17, 2023 | 04:21 PMLast Updated on: Sep 17, 2023 | 4:21 PM

Schools Colleges Closed In Kerala Indefinitely Due To Nipah Virus

Nipah Virus: 2020-21లో యావత్ ప్రపంచాన్ని కరోనా ఒక్కసారిగా అతలాకుతలం చేసింది. ఈతరం వాళ్లు ఈ కరోనా లాక్‌డౌన్‌ కాలాన్ని ఎప్పటికీ మర్చిపోలేరని కూడా చెప్పొచ్చు. విస్తృతంగా కరోనా కేసులు, మరణాలు సంభవించడం వల్ల ప్రపంచ దేశాలతో పాటు ఇండియా కూడా లాక్‌డౌన్‌ విధించింది. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు దేశంలో రెండుసార్లు లాక్‌డౌన్‌ అమలు చేయడం జరిగింది. ఐతే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటే మరొకసారి దేశంలో లాక్ డౌన్ విధించే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయ్.

ఐతే ఈసారి అందుకు కారణం మాత్రం కరోనా వైరస్ కాదు. అంతకుమించిన ప్రాణాంతకమైన వైరస్ నిఫా వైరస్. ప్రస్తుతం ఎక్కడ చూసినా నిఫా వైరస్ ఎక్కువగా వినిపిస్తోంది. కేరళలో కలకలం సృష్టించిన ఈ వైరస్ కారణంగా ఇద్దరు చనిపోగా.. మరికొంతమంది దీని బారిన పడినట్లు సమాచారం. అయితే ఈ నిఫా వైరస్‌కి వ్యాక్సిన్ లేకపోవడంతో పాటు.. ఎలాంటి చికిత్స కూడా అందుబాటులో లేకపోవడంతో ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకట్టు వేయలేకపోతోందట కేరళ ప్రభుత్వం. అందుకే కేరళలో అప్పుడే ఆంక్షలు విధించారని తెలుస్తోంది. వారం రోజులపాటు విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలను కూడా మూసివేశారు. అంతే కాకుండా రద్దీగా ఉండే ప్రాంతాలలో షాపింగ్ మాల్స్, థియేటర్ల పైనా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

చాలా చోట్ల లాక్డౌన్ కూడా విధించడంతోపాటు ఈ నెల 24వ తేదీ వరకు స్కూల్స్ మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. నిఫా వైరస్.. కోవిడ్ కన్నా చాలా ప్రమాదమని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సంస్థ హెచ్చరిస్తోంది. కోవిడ్ సోకిన వారిలో మరణాల రేటు 3 పర్సెంట్ మాత్రమే ఉంటే నిఫా వైరస్ సోకిన వారిలో 40-70 శాతం వరకు ఎక్కువగా ఉంటుందని రీసెర్చ్‌లో తేలింది. ఒకవేళ ఇది ఎక్కువగా వ్యాపిస్తే లాక్‌డౌన్‌ తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.