Zero-Plastic : జీరో-ప్లాస్టిక్ వ్యర్థ లక్ష్యంగా.. సూక్ష్మ ప్రయత్నం..
ప్రపంచవ్యాప్తంగా, ఏటా 400 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతుంది. 40% ఒక్కసారి మాత్రమే వినియోగించబడుతుంది, దాన్ని ఫలితంగా గణనీయమైన వ్యర్థాలు ఏర్పడుతున్నాయి. ప్రతి సంవత్సరం, కెనడా పర్యావరణంలోకి 29,000 టన్నుల ప్లాస్టిక్ విడుదల చేయబడుతోంది. దీని వల్ల ప్రతి సంవత్సరం వ్యర్థ ప్లాస్టిక్‌తో మత్స్య సంపద, తిమింగలాలు, డాల్ఫిన్లు, సీల్స్ , సముద్ర సింహాలతో సహా అనేక సముద్ర జంతువులు ఘటణియంగా వాటి ఉనికి తగ్గిపోతుంది.
ప్రపంచవ్యాప్తంగా, ఏటా 400 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతుంది. 40% ఒక్కసారి మాత్రమే వినియోగించబడుతుంది, దాన్ని ఫలితంగా గణనీయమైన వ్యర్థాలు ఏర్పడుతున్నాయి. ప్రతి సంవత్సరం, కెనడా పర్యావరణంలోకి 29,000 టన్నుల ప్లాస్టిక్ విడుదల చేయబడుతోంది. దీని వలన తీవ్రమైన పర్యావరణ సమస్యలు ఏర్పడుతున్నాయి. దీన్ని ప్రభావం భూమి, నీటి పర్యావరణ వ్యవస్థలలో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోవడం, పర్యావరణంలోకి హానికరమైన సూక్ష్మజీవుల లీకేజ్, మొక్కలు, జంతువులకు ముప్పు. ప్రతి సంవత్సరం వ్యర్థ ప్లాస్టిక్‌తో మత్స్య సంపద, తిమింగలాలు, డాల్ఫిన్లు, సీల్స్ , సముద్ర సింహాలతో సహా అనేక సముద్ర జంతువులు ఘటణియంగా వాటి ఉనికి తగ్గిపోతుంది. ఇదీ ఇలానే కొనసాగితే భవిష్యత్ తరాలకు దీర్ఘకాలిక ప్రమాదాన్ని కలిగిస్తుంది.
జీరో-ప్లాస్టిక్ వ్యర్థ.. భవిష్యత్..
జీరో-ప్లాస్టిక్ వ్యర్థ భవిష్యత్తును సాధించే లక్ష్యంతో ప్రస్తుత ప్లాస్టిక్ నిర్వహణ వ్యవస్థలకు అనుబంధంగా ప్లాస్టిక్‌ను రీసైక్లింగ్ చేసే కొత్త పద్ధతులు కొనగోంటున్నారు శాస్ర్తవేతలు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి, రీసైకిల్, బయోడిగ్రేడబుల్ భాగాలను ఉపయోగించి ప్లాస్టిక్‌లు రూపొందిస్తున్నారు. ఇవి సరళ నుండి వృత్తాకార వినియోగ నమూనాలకు మారడానికి అధిక శాతం అవకాశం ఉంది. ఎంజైమ్‌లతో ప్లాస్టిక్‌లను రీసైక్లింగ్ చేయడం అనేది ప్రపంచ సమస్యకు స్థిరమైన విధానం. మనం ఇప్పుడు ఎదురుకొంటు పరిష్కరించాల్సిన ప్రధమ సమస్య.. సూక్ష్మజీవులు ఉత్పత్తి చేసే ఎంజైమ్‌లతో వ్యర్థ ప్లాస్టిక్‌లను విచ్ఛిన్నం చేయడం సాధ్యమవుతుందని ఇటీవలి పరిశోధనలు చెబుతున్నాయి. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా దానిని కమర్షియల్ రియాలిటీగా మార్చడమే.
ప్లాస్టిక్-డిగ్రేడింగ్ ఎంజైమ్‌లను ఏ జీవులు ఉత్పత్తి చేస్తాయి?
బ్యాక్టీరియా, శిలీంధ్రాల వంటి సూక్ష్మజీవుల ద్వారా ప్లాస్టిక్-డిగ్రేడింగ్ ఎంజైమ్‌లను ఉత్పత్తి చేయవచ్చు అని తాజాగా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. నీటిపై తేలియాడే చెత్తా చెదారం, చెత్త నేల, బల్లపరుపు నేత.. ప్రదేశాలు, కలుషితమైన నీటి నుండి ప్లాస్టిక్-డిగ్రేడింగ్ సామర్ధ్యాలు కలిగిన అనేక బ్యాక్టీరియా వేరుచేయబడింది. వీటిలో సూడోమోనాస్, బాసిల్లస్, స్టెఫిలోకాకస్, స్ట్రెప్టోమైసెస్ మొదలైనవి ఉంటాయి. పల్లపు మట్టి నుండి వేరుచేయబడిన ఫిలమెంటస్ శిలీంధ్రాలు పాలిథిలిన్ వంటి ప్లాస్టిక్‌లను క్షీణింపజేస్తాయి. వీటిలో ఫ్యూసేరియం ఆక్సిస్పోరమ్, ఫ్యూసేరియం ఫాల్సిఫార్మ్/పర్పురియోసిల్లమ్ లిలాసినం ఉన్నాయి.
ప్లాస్టిక్ రీసైక్లింగ్ కోసం.. సూక్ష్మజీవులను కనుగొనడం..
ప్లాస్టిక్ రీసైక్లింగ్ లేదా ప్లాస్టిక్ విచ్ఛిన్నం చేసేందుకు అనుగుణంగా డాక్టర్ యాంగ్ మల్టీడిసిప్లినరీ బృందం ప్లాస్టిక్ లను పునర్వియోగపరచదగిన లేదా విలువైన చక్కటి రసాయనాలుగా విభజించడానికి సూక్ష్మజీవుల సరికొత్త ప్లాట్ ఫారమ్ ను అన్వేషిస్తున్నారు. యాంగ్ అతని బృందం ప్లాస్టిక్-డిగ్రేడింగ్ ఎంజైమ్‌ల కోసం కోడ్ చేసే జన్యువులను కనుగొనడానికి మెటాజెనోమిక్స్, మెటాట్రాన్స్‌క్రిప్టోమిక్స్, పూర్తి-జీనోమ్ సీక్వెన్సింగ్, ఫంక్షనల్ జెనోమిక్స్ వంటి జన్యు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. అదేకాకూండా పర్యావరణం, ఆర్థిక వ్యవస్థ మొత్తంను సమాజంపై కొత్తగా అభివృద్ధి చేయబడిన ఈ ప్లాస్టిక్ బయోటెక్నాలజీల ప్రభావాన్ని కూడా వీరు పరిశోదన చేస్తున్నారు. ఈ బయోటెక్నాలజీ ప్రాజెక్ట అంటానియో జెనోమిక్స్ చేత మద్దతు ఇవ్వబడిన ఎనిమిదోవ అతి పెద్ద ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం ఒకటి, సహజ వనరులను సంరక్షించడానికి, పర్యవరణాన్ని రక్షించడానికి, దీర్ఘకాలిక స్థిరత్వాన్ని నిర్ధారించడానికి జన్యుశాస్త్ర పరిశోధన, సాంకేతికతను ఉపయోగించడం పై పరిశోదనలు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ క్వీన్స్ యూనివర్శిటీలో ఎమర్జింగ్ కన్సర్న్ – రీసెర్చ్ ఎక్సలెన్స్ నెట్‌వర్క్ (CEC-REN) యొక్క కాలుష్య కారకాలతో అనుబంధించబడింది.
ఎంజైమ్‌లు ప్లాస్టిక్ రీసైక్లింగ్ యొక్క భవిష్యత్తు..ఏంటి ? ఉపయోగం ఏంటి..?
ప్లాస్టిక్‌ల కోసం వృత్తాకార ఆర్థిక వ్యవస్థను సృష్టించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్‌ల తయారీ వినియోగాన్ని మార్చే అవకాశం పుష్కలంగా ఉంది. ప్లాస్టిక్‌ను రీసైకిల్ చేయడానికి ఎంజైమ్‌లను ఉపయోగించడం వల్ల ప్లాస్టిక్ విచ్ఛిన్నానికి తీవ్రమైన పరిస్థితులు అవసరం లేదు. పెద్ద మొత్తంలో ఎంజైమ్‌లను తయారు చేయడం చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న పని.. ఈ ప్రక్రియ ద్వారా ఉత్పత్తి చేయబడిన మోనోమర్‌లను కొత్త పాలిమర్‌లకు ముడి పదార్థంగా ఉపయోగించవచ్చు / కొత్త రసాయనాలుగా రీసైకిల్ చేయవచ్చు. ఈ ప్రాజెక్టు విజయవంతం అవుతే గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలలో CO2 సమానమైన వాటిని 1.8 మిలియన్ టన్నులు తగ్గించవచ్చు, ఈ కొత్త పరిశ్రమల ద్వారా 42,000 ఉద్యోగాలను అదనంగా సృష్టించవచ్చు.
S.SURESH