Stone Temple : ఆ గుడికి వెళ్తే రాయిగా మారిపోతారు.. సైన్స్‌కు కూడా అందని రహస్యం..!
తెలియని విషయం లేదు అనుకున్న ప్రతీసారి.. ఓ రహస్యం సైంటిస్టులకు సవాల్ విసురుతుంది. ఏళ్లుగా, యుగాలుగా జరగుతోంది అదే ! ప్రతీ దానికి లాజిక్ ఉండదు.. కొన్నిసార్లు మ్యాజిక్కులనే నమ్మాల్సి ఉంటుంది ! సైన్స్ కూడా సమాధానం చెప్పలేని ఎన్నో ప్రశ్నలు.. మన చుట్టే కనిపిస్తుంటాయ్.. వినిపిస్తుంటాయ్ కూడా ! అలాంటి రహస్యమే.. రాజస్థాన్‌లోని ఈ ఆలయం.
ఈ గుడిలోకి ఎవరు వెళ్లినా రాళ్లుగా మారిపోతారనే నమ్మకం ఉంది. అందుకే చీకటి పడ్డాక అందులోకి వెళ్లడానికి కూడా భయపడుతుంటారు చాలామంది ! రాజస్థాన్‌లోని బర్మెర్ జిల్లాలో ఉందీ గుడి. కిరడు అని పిలుస్తుంటారు ఈ ఆలయాన్ని ! రాత్రి సమయంలో ఈ గుడిలోకి వెళ్తే.. వాళ్లంతా రాళ్లలా మారిపోతుంటారని ఇక్కడి జనాలు నమ్ముతుంటారు. ఎగ్జాంపుల్స్ కూడా చెప్తుంటారు. అసలు విషయం తేలుద్దామంటే.. ఎవరినీ చీకటిపడ్డాక ఆ ఆలయంలోకి వెళ్లనివ్వకుండా.. గ్రామస్థులు కాపలా కాస్తుంటారు.
సినిమాల్లో మాత్రమే కనిపించే ఇలాంటి కథలు.. ఇక్కడ కళ్లముందు జరుగుతుంటాయ్. రాత్రి సమయంలో ఆ ఆలయం వైపు వెళ్లేందుకు కూడా జనాలు భయపడుతుంటారు. ఐతే ఈ నమ్మకం వెనక పెద్ద కథే ఉంది. కొన్ని వేల ఏళ్ల కిందట.. తన శిష్యులతో కలిసి ఒక బుుషి ఈ దేవాలయాన్ని సందర్శించారు. ఆ తర్వాత తన శిష్యులను ఇక్కడే వదిలి.. ఆ రుషి అడవుల్లోకి వెళ్లిపోయారట. గురువు కోసం ఎదురుచూస్తూ ఆ శిష్యులంతా గుడిలోనే ఉన్నారని.. ఎదురుచూసే క్రమంలో ఆకలి వేసి అర్థించినా.. ఇక్కడి జనాలు పట్టించుకోలేదని.. దీంతో ఆకలితోనే ఆ శిష్యులు అంతనా చనిపోయారట. రుషికి విషయం తెలిసి.. తన శిష్యుల మరణానికి కారణం అయిన జనాలంతా రాళ్లలా మారిపోవాలని శాపం పెట్టారు.
ఐతే శిష్యులకు సాయం చేసిన ఒక మహిళకు మాత్రం శాపం వర్తించదని హామీ ఇచ్చారని.. కాకపోతే ఓ నిబంధన విధించారని ఇక్కడ కథలుగా చెప్పుకుంటారు. వెనక్కి చూడకుండా వెళ్లమని మహిళకు చెప్తే.. ఆమె నడుస్తూ వెళ్లి వెనక్కి చూసిందని.. దీంతో ఆమె కూడా రాయిగా మారిందట. ఆ మహిళ విగ్రహం ఇంకా ఆ దేవాలయం సమీపంలో ఉందని అక్కడి జనాలు నమ్ముతుంటారు. అప్పటి నుంచి సాయంత్రం అయితే చాలు.. ఆ గుడి తలుపులు మూసేస్తారు. తలుపులు మూసిన తర్వాత.. అక్కడ ఉండేందుకు కూడా జనాలు భయపడుతుంటారు. ఈ విషయం తెలుసుకునేందుకు స్థానిక సైంటిస్టులు కూడా భయపడిపోతున్నారు.