Top Story : సింహలని ఉంచుకుంది.! అడ్డొచ్చిన 130 సింహాలను లేపేసింది…!

ఒక్కడే భయంకరమైన విలన్.. వాడి చుట్టూ వందల మంది రౌడీలు, ఇది సినిమాల్లో ఉండే కథ.. ఒక్కడే డాన్.. వాడి కింద వందల గ్యాంగ్ లు.. ఇది రియల్ లైఫ్.. సినిమాల్లో రోలెక్స్ లాంటి క్యారెక్టర్లు

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 26, 2025 | 11:00 AMLast Updated on: Mar 26, 2025 | 11:00 AM

She Kept The Lions She Woke Up 130 Lions That Were In The Way

ఒక్కడే భయంకరమైన విలన్.. వాడి చుట్టూ వందల మంది రౌడీలు, ఇది సినిమాల్లో ఉండే కథ.. ఒక్కడే డాన్.. వాడి కింద వందల గ్యాంగ్ లు.. ఇది రియల్ లైఫ్.. సినిమాల్లో రోలెక్స్ లాంటి క్యారెక్టర్లు.. రియల్ లైఫ్ లో దావూద్ ఇబ్రహీం లాంటి క్యారెక్టర్లు, లారెన్స్ బిష్ణోయ్ లాంటి క్యారెక్టర్లు చూసాం.. ఇవన్నీ కూడా మనుషులు రచించి, దర్శకత్వం వహించిన జీవితాలు, కథలు..

“కాని ఓ క్రూర మృగమే డాన్ అయితే..? దాని చుట్టూ వందల సంఖ్యలో క్రూర మృగాలు ఉంటే..? భయంకరమైన అడవిలో రారాజుగా గర్జిస్తే..? ఆ గర్జనకు ప్రపంచమే ఫిదా అయిపోతే…? ఆ రాజసం ముందు రాజ్యాలు రాజులు తేలిపోతే…? అదే “స్కార్ ఫేస్ లయన్” ఆఫ్రికాలోని మాసాయి మారా గడ్డి భూముల్లో తిరిగితే ఈ స్కార్ ఫేస్ లయన్.. న్యాచురల్ హీరో.. దాని రాజ్యంలో ఎవడు అడుగు పెట్టినా జీవితమే లేకుండా చేస్తూ.. 14 ఏళ్ళ పాటు అడవినే ఏలిన రారాజు ఈ సింహం.

దీనెమ్మ జీవితం.. దాని జీవితం చూస్తే మనిషిగా పుట్టినందుకు సిగ్గు పడతాం.. అలా ఎందుకు బతకలేదని కుమిలిపోతాం.. ఎప్పుడు పుట్టిందో ఎవడికి తెలియదు.. దాని పుట్టుక చరిత్రలో లేదు.. కాని చావును మాత్రం చరిత్ర ఘనంగా రాసింది. 90ల చివర్లో పుట్టిందని ఒకడు అంటాడు.. కాదు 2007లో పుట్టిందని ఒకడు అంటాడు.. కాని 2021లో తుది శ్వాస విడవడం మాత్రం ప్రపంచం చూసింది. ఎంతో గొప్పగా బతికిన ఈ సింహం లుక్ ముందు.. ఏ హీరో, విలన్, డాన్ ల లుక్ లు కాలి గోటికీ కూడా సరిపడవు..

యుద్ధంలో పోరాడి వచ్చిన రాజు ముఖంపై కత్తి గాటు ఎంత బలంగా గొప్పగా ఉంటుందో.. ఈ సింహం ముఖంపై ఉన్న గాయం అంతకు మించి ఉంటుంది. అందుకే దానికి “స్కార్ ఫేస్ లయన్” అనే పేరు వచ్చింది. మాసాయి మారా అడవిలోకి కెమెరాతో అడుగు పెట్టిన ఎవరైనా ఆ ఫోటో లేకుండా తిరిగి రారు. దాని ట్రాక్ రికార్డ్ చూస్తే మైండ్ బ్లోయింగ్ కాదు అంతకు మించి.. దానికి అడ్డు వచ్చిన 140 మగ సింహాలను నామ రూపాలు లేకుండా చంపింది.. గుంపులుగా వచ్చి.. తన పిల్లలను, తన కుటుంబాన్ని చంపాలనుకునే 400లను చీల్చి చెండాడింది.

హిప్పోతో కూడా యుద్ధం చేసి గెలిచిన ఒకే ఒక్క సింహం ఇది. ఎన్ని మొసళ్ళను చంపిందో లెక్కే లేదు. సాధారణంగా సింహాలు 12 ఏళ్ళు మాత్రమే బ్రతుకుతాయి. కాని ఈ సింహం 14 ఏళ్ళు బ్రతికింది. అడవిలో ఎన్నో మార్పులను ఈ 14 ఏళ్ళ పాటు చూసింది. దీని ధైర్యం దీని గుర్తింపు అయితే.. దీని గ్యాంగ్ కూడా వేరే లెవెల్ లో ఉంటుంది. వాస్తవానికి సింహాల గ్రూప్ లో 15 నుంచి 20 మాత్రమే ఉంటాయి. కాని దీని గ్యాంగ్ లో 120కి పైగా సింహాలు ఉంటాయి. ఇది ఎక్కడికి వెళ్ళినా ఆ గ్యాంగ్ మొత్తం దానితోనే వస్తుంది.

రాజులు, రాజ్యాల కథలు వినే వాళ్ళం కదా.. ఆ కథల్లో ఓ రాజు మరో రాజ్యంపై దాడి చేసి ఆ రాజ్యాన్ని సొంతం చేసుకోవడం గురించి ఎన్నో కథలు, సినిమాల్లో చూసాం. సింహాల గుంపులు కూడా ఇలాగే ఉంటాయి. మగ సింహాలు.. ఆడ సింహాల కోసం మరో గుంపుపై దాడి చేసి.. అక్కడ ఉన్న మగ సింహాలను చంపేసి.. ఆ గ్యాంగ్ ను సొంతం చేసుకుంటాయి. ఇది అలా 140కి పైగా గ్యాంగ్ లను సొంతం చేసుకోవడానికి 140 మగ సింహాలను చంపేసింది. డాన్ సినిమాలో విలన్ మాదిరి.. ఆ మగ సింహాలను పెళ్ళాలను కూడా ఇదే సొంతం చేసుకుంది.

2012 లో మగ సింహం.. అంటే ఆల్ఫా లయన్ తో జరిగిన పోరాటంలో దీని కంటిపై గాయం అయింది. అక్కడి నుంచి స్కార్ ఫేస్ లయన్ గా ఫేమస్ అయిపొయింది ఈ సింహం. 5 ఏళ్ళ క్రితం.. గడ్డి భూముల్లో ఓ సింహం గర్జిస్తూ చనిపోయింది. అప్పుడు ఆ వీడియో బయటకు వచ్చింది. అది ఏ సింహం అని ఆరా తీయగా ఇదే అని అర్ధమైంది. స్కార్‌ ఫేస్ లయన్.. వృద్ధాప్యం, ఆకలి కారణంగా జూన్ 11, 2021న మధ్యాహ్నం 1:00 గంటలకు ప్రాణాలు విడిచింది. ఇంతటి ఘన చరిత్ర ఉన్న ఈ మృగ రాజు గురించి ఇప్పుడు ప్రపంచానికి చూపించేందుకు కెన్యా ప్రభుత్వం సిద్దమైంది. ఈ సింహం బ్రతికి ఉన్నప్పుడు తీసిన వీడియోలతో ఓ డాక్యుమెంటరి రెడీ చేసింది. అందులోని కొన్ని వీడియోలు ఇప్పుడు ఆన్లైన్ లో వచ్చేసాయి. ఆ వీడియోలు చూసి.. సింహం గొప్పతనం ఏంటో తెలుసుకోండి.