Shirdi Saibaba Temple: మే 1నుంచి షిర్డీ ఆలయం బంద్.. ఎందుకంటే..?
షిర్డీ ఆలయం మే ఒకటి నుంచి నిరవధికంగా బంద్ కాబోతోంది. షిర్డీ ఆలయంలో.. సీఐఎస్ఎఫ్ అధికారులతో భద్రత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐతే ఈ నిర్ణయాన్ని షిర్డీ గ్రామస్థులు వ్యతిరేకిస్తున్నారు. ఈ నిర్ణయంపై ఇప్పటికే గ్రామస్థులు తమ కార్యాచరణను ప్రకటించారు.

Shirdi Saibaba Temple: మహారాష్ట్రలోని షిర్డీ ఆలయానికి ఎంతో ప్రసిద్ది ఉంది. కొన్నేళ్ల క్రితం సాయిబాబా సామాన్య మానవునిలాగా అవతరించి.. అనేక మహిమలు చూపించారని భక్తులు నమ్ముతుంటారు. ఆయన శ్రద్ధ, సబూరీ అనే నినాదాలను తన భక్తులకు ఇచ్చారు. జనాలంతా.. విశ్వాసం, సహనంతో కూడి ఉండాలని, అన్ని మతాల అంతిమ సారం ఒక్కటే అని బోధించేవారు. ఈ క్రమంలో ఆయన కొన్నేళ్ల తర్వాత సమాధి చెందారు. అనతరం షిర్డీలో స్థానికులు సాయిబాబాకు ప్రత్యేకంగా ఆలయాన్ని నిర్మించారు.
ఐతే ఇప్పుడా ఆలయం మే ఒకటి నుంచి నిరవధికంగా బంద్ కాబోతోంది. షిర్డీ ఆలయంలో.. సీఐఎస్ఎఫ్ అధికారులతో భద్రత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐతే ఈ నిర్ణయాన్ని షిర్డీ గ్రామస్థులు వ్యతిరేకిస్తున్నారు. ఈ నిర్ణయంపై ఇప్పటికే గ్రామస్థులు తమ కార్యాచరణను ప్రకటించారు. మే 1న మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నుంచి తమ కార్యాచరణను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. దీంతో మే ఒకటి నుంచి ఆలయం క్లోజ్ కాబోతోంది. ప్రధానంగా నాలుగు డిమాండ్లను.. షిర్డీ గ్రామస్థులు ప్రభుత్వం ముందు ఉంచుతున్నారు. షిర్డీ ఆలయానికి సీఐఎస్ఎఫ్ భద్రత నిర్ణయం వెనక్కు తీసుకోవడంతోపాటు.. సాయి ట్రస్ట్‌లో 50శాతం స్థానికులకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
ఐఏఎస్ అధికారిగా కాకుండా, సీఈవోగా మహారాష్ట్ర స్టేట్ సర్వీస్ నుంచి ఎస్డీఎమ్ పదవికి అధికారిగా ఉండాలని అంటున్నారు. ఈ డిమాండ్‌కు సంబంధించి షిర్డీలోని అన్ని పార్టీల తరపున నిరవధిక కాలానికి షిర్డీ బంద్‌ను ప్రకటించారు. గ్రామస్తులు బంద్ పాటిస్తున్నప్పటికీ సాయిబాబా ఆలయం తెరిచి ఉంటుంది. షిర్డీ సాయి ఆలయంపై బంద్ ప్రభావం ఉండదు. సాయి సంస్థాన్‌లోని అన్ని నివాసాలు, ధర్మశాల, రెస్టారెంట్, రవాణా, ఆసుపత్రి మొదలైనవి తెరిచి ఉంటాయని సమాచారం. అక్కడ ఆలయానికి వెళ్లే బస్సులు యథాతథంగా నడుస్తాయి. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
సాయి దేవాలయానికి చెందిన సమీర్ మార్కెట్ క్లోజ్ చేస్తారు. స్థానిక దుకాణాలు, సంస్థలు మూసివేస్తారు. సాయి మందిరంపై బంద్ ప్రభావం ఉండదు. షిరిడీ సాయిని దర్శించుకునేందుకు మహారాష్ట్ర నుంచే కాకుండా కర్ణాటక, తెలంగాణ, ఏపీ, గుజరాత్ వంటి అనేక చోట్ల నుంచి రోజూ వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు.