Wedding Card: సిద్దిపేటలో వెరైటీ పెళ్లి శుభలేఖ.. సోషల్ మీడియాలో వైరల్..
పెళ్లిని ప్రతి ఒక్కరూ ఎంతో ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటారు. మధుర జ్ఞాపకంగా మలచుకోవాలనుకుంటారు. అందుకోసమే కొందరు తమ క్రియేటివిటీ చూపిస్తుంటారు. ముఖ్యంగా వెడ్డింగ్ కార్డు డిజైనింగ్‌లో తమ ప్రత్యేకత చాటుకుంటారు.

Wedding Card: పెళ్లి అంటే ఎవరి జీవితంలోనైనా జీవితాంతం గుర్తుంచుకోవాల్సిన వేడుక. అందుకే తమ పెళ్లిని ప్రతి ఒక్కరూ ఎంతో ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటారు. మధుర జ్ఞాపకంగా మలచుకోవాలనుకుంటారు. అందుకోసమే కొందరు తమ క్రియేటివిటీ చూపిస్తుంటారు. ముఖ్యంగా వెడ్డింగ్ కార్డు డిజైనింగ్‌లో తమ ప్రత్యేకత చాటుకుంటారు. తాజాగా సిద్దిపేట జిల్లాలో ఒక పెళ్లి కొడుకు తన పెళ్లి శుభలేఖను ఇలా వెరైటీగా రూపొందించుకున్నాడు.
MLC KAVITHA: బీసీల సీట్లు అగ్రవర్ణాలకు అమ్ముకున్న కాంగ్రెస్: ఎమ్మెల్సీ కవిత
వృత్తిరీత్యా టీచర్ అయిన పెళ్లికొడుకు.. ప్రశ్న పత్రం తరహాలో శుభలేఖ ముద్రించాడు. అతడి పేరు అనిల్. ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా పని చేస్తున్నాడు. ఆబ్జెక్టివ్ పేపర్‌లా పెళ్లి కార్డుపై ప్రశ్నలు ఇచ్చి, ఆప్షన్స్ పెట్టాడు. సంప్రదాయ శుభలేఖలకు భిన్నంగా ఈ వెడ్డింగ్ కార్డు డిజైన్ చేయించుకున్నాడు. అతడి పెళ్లి ఈ నెల 19న సిద్దిపేటలో జరగనుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పెళ్లి కార్డు వైరల్ అవుతోంది.