Jammu -Kashmir, Snowfall : ఉత్తరాదిని వణికిస్తున్న మంచు వర్షం.. కాశ్మీర్ లో కురుస్తున్న హిమపాతం
ఉత్తరాదిని గత 4 నెలల ముందు వరకు వర్షాలు.. వరదలతో వణికిపోయాయి. సిమ్లా, హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh), ఉత్తరాఖండ్(Uttarakhand), వంటి రాష్ట్రాల్లో భారీ వరదలకు.. కొండచరియలు విరిగిపడటం వంటివి చూశాం.. ఇక డిసెంబర్ 30 నాటికి కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో మంచు కురవక పోవడం.. వాతావరణంలో మార్పులు రావడం.. వంటివి అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళన రేకెత్తించింది.
ఉత్తరాదిని గత 4 నెలల ముందు వరకు వర్షాలు.. వరదలతో వణికిపోయాయి. సిమ్లా, హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh), ఉత్తరాఖండ్(Uttarakhand), వంటి రాష్ట్రాల్లో భారీ వరదలకు.. కొండచరియలు విరిగిపడటం వంటివి చూశాం.. ఇక డిసెంబర్ 30 నాటికి కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో మంచు కురవక పోవడం.. వాతావరణంలో మార్పులు రావడం.. వంటివి అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళన రేకెత్తించింది. కాగా గత నెల (జనవరి) నుంచి కాశ్మీర్, శ్రీనగర్(Srinagar), సిమ్లా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, లఢక్(Ladakh), సోన్ మార్గ్(Sonmarg), వంటి ప్రదేశాల్లో భారీగా మంచు కురుస్తుంది. క్రమంగా అది హిమపాతంగా మారి మూడు రాష్ట్రాల ప్రజలను వణికించేస్తుంది.
శ్వేత వర్ణాన్ని తలపిస్తున్న.. జమ్మూ కశ్మీర్
రోజురోజుకు జమ్మూ-కశ్మీర్ (Jammu Kashmir) లో ఉష్ణోగ్రతలు కనిష్ఠస్థాయికి పడిపోవడంతో అక్కడ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఎడతెరిపిలేకుండా మంచు వర్షం కురుస్తూనే ఉంది. కశ్మీర్ వ్యాలీ (Kashmir Valley) లో ఎక్కడ చూసినా మంచు దిబ్బలే దర్శనమిస్తున్నాయి. కనుచూపుమేర శ్వేత వర్ణం అలుముకుంది. అక్కడ రోడ్లన్నీ శ్వేతవర్ణాన్ని తలపిస్తున్నాయి. కాశ్మీర్ లోయలోని ఏ ప్రాంతంలో చూసినా హిమపాతమే కనిపిస్తోంది. శ్రీనగర్, రాజౌరి, సోన్‌మార్గ్(Sonmarg), బందీపురాతో పాటూ చాలా ప్రాంతాల్లో రోడ్లపై మంచు పేరుకుపోయింది. భారీగా కురుస్తున్న మంచు కారణంగా కశ్మీర్ ప్రజలు గజగజ వణికిపోతున్నారు. రానున్న రెండురోజుల్లో హిమపాతం తీవ్రత మరింత పెరగనుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. చాలాచోట్ల పగటి ఉష్ణోగ్రతలు 0-3 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంటుందన్నారు. పర్వత ప్రాంతాల్లో మంచు చరియలు విరిగిపడే ముప్పు ఉంటుందని హెచ్చరించారు. రహదారులపై భారీగా మంచు పేరుకుపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. భారీగా హిమపాతం అవ్వడంతో శ్రీనగర్ ఎయిర్ పోర్ట్ కు విమానాలు కాస్త ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో శ్రీనగర్‌లోని ప్రధాన రహదారులను అధికారులు స్వల్ప కాలం పాటు మూసివేశారు. జమ్మూ-శ్రీనగర్, శ్రీనగర్-లెహ్ జాతీయ రహదారులతోపాటు వ్యాలీలోని పలు ప్రధాన రోడ్లను అధికారులు మూసివేశారు. ఇక మనాలికి వెళ్లే అటల్ టన్నెల్ లోకి కార్లను.. యాత్రికులు బస్సులను తప్ప.. ద్విచక్ర వాహన దారులను అధికారులు అనుమతించడం లేదు.
ఉత్తరాది లో కురుస్తున్న మంచు వర్షాన్ని చూసేందుకు దేశా నలుముల నుంచి పర్యటకులు కాశ్మీర్ చేరుకుంటున్నారు. అక్కడి హోటల్స్ అన్ని కూడా గుకింగ్ అయిపోతున్నాయి. శ్రీనగర్, రాజౌరి, సోన్‌మార్గ్, మనాలి, ఔలి, సిమ్లా హిల్ స్టేషన్, బందీపురా, గుల్‌మార్గ్, పహల్‌గావ్, సోన్ మార్గ్, సిమ్లా, పర్యాటక రిసార్ట్‌లు మంచుతో నిండిపోయాయి.