Ayodhya Ramaiah : దేశవ్యాప్తంగా అయోధ్య రామయ్యకు వెల్లువెత్తిన కానుకలు..
ఇప్పటి వరకు అయోధ్య రామ మందిరం కు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి అయోధ్యకు చేరుకున్న కానుకలు ఎంటో ఇప్పుడు చూద్దాం రండి..

సీతమ్మ జన్మస్థలం నేపాల్ లోని జనక్ పూర్ ధామ్ నుంచి ఆభరణాలు, వస్త్రాలతో పాటు 3 వేలకు పైగా బహుమతులు కాన్వాయ్ గా అయోధ్యకు వచ్చాయి.

అయోధ్య రామయ్యకు నేపాల్ అత్తారిల్లు అయిన జనక్ పూర్ ధామ్ నుంచి వెండి బాణం, ఆభరణాలు.

ఇక గుజరాత్ నుంచి 108 అడుగుల అగరుబత్తీ, 2,100 కిలోల గంట, 1,100 కిలోల భారీ దీపం,

మహారాష్ట్రంలోని నాగ్ పూర్.. అమరావతి నుంచి 500 కిలోల కుంకుమ వచ్చాయి.

హైదరాబాద్ లోని సికింద్రాబాద్ నుంచి శ్రీరామ్ క్యాటరన్స్ 1265 కిలోల భారీ లడ్డును తయారుచేసి రాముడికి కానుకగా పంపించారు.

శ్రీలంక ప్రతినిధి బృందం అశోకవాటిక నుంచి ప్రత్యేక కానుక తీసుకొచ్చింది.

ఏకకాలంలో 8 దేశాల సమయాన్ని సూచించే గడియారం ట్రస్టుకు అందాయి.

అయోధ్య భక్తుల కోసం 7వేల కిలోల రామ్ హల్వాను తయారు చేయనున్నట్లు నాగపూర్ కు చెందిన చెఫ్ విష్ణు మనోహర్ ప్రకటించారు.

అయోధ్య రామయ్యకు 21.6 అడుగుల పొడువున్న వేణువును ఫిలిబిత్ కు చెందిన ఓ ముస్లిం కుటుంబం కానుకగా పంపింది.

రాముడికి బంగారు పూతపూసిన పాదరక్షలను సమర్పించడానికి హైదరాబాద్ కు చెందిన 64 ఏళ్ల చల్లా శ్రీనివాస శాస్త్రి 8వేల కిలోమీటర్లు నడిచి అయోధ్యకు చేరుకున్నారు.

తెలంగాణ నుంచి సిరిసిల్ల నేత కార్మికుడు హరిప్రసాద్ అయోధ్య రామయ్యకు బంగారు చీరను నేసి రామయ్యకు పంపిస్తున్నారు.

ఇక తెలుగు రాష్ట్రం నుంచి తిరుమల శ్రీవారి ఆలయం నుంచి లక్ష లడ్డూలు ఇప్పటికే అయోధ్యకు చేరుకున్నాయి.

హైదరాబాద్ నుంచి ప్రవళ జువెలర్స్ అండ్ జేమ్స్ వారు మూడు కిలోల 600 గ్రాముల ముత్యాల హారం వెల్లనుంది. ఇందులో మూడు కిలోల ముత్యాలు, అరకిలో పచ్చల మణులతో హారం ను ప్రవళ జువెలర్స్ అండ్ జేమ్స్ తయారు చేసి పంపించారు.

అయోధ్య రామయ్యకు.. కనౌజ్ నుంచి వివిధ రకాల అత్తరులు వచ్చాయి.

ప్రపంచంలోనే అతి పెద్ద తాళం.. 10 అడుగుల తాళం అయోధ్యకు చేరుకున్నాయి.

ఉజ్జయిని మహాకాలేశ్వర్ ఆలయం నుంచి 5 లక్షల లడ్డూలతో కూడిన ట్రక్ అయోధ్యకు చేరుకోనుంది.