Sperm Donation: ఇక చాలు ఆపరా బాబూ.. నీ వీర్య దానం..!

ఒరేయ్ బాబు.. ఏందిరా నువ్వు.. ఉంది కదా అని.. నీ దగ్గర పుష్కలంగా ఉత్పత్తి అవుతుంది కదా అని అలా దానం చేసుకుంటూ పోతూనే ఉంటావా.. అదేమన్నా అన్నదానం అనుకున్నావా..లేక రక్తదానం అనుకున్నావా.. వీర్యం రా బాబూ. వీర్యం.. ఇక చాలించు నీ ప్రతాపం..!

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 29, 2023 | 04:30 PMLast Updated on: Apr 29, 2023 | 5:11 PM

Sperm Donation In Netherlands

ఒరేయ్ బాబు.. ఏందిరా నువ్వు.. ఉంది కదా అని.. నీ దగ్గర పుష్కలంగా ఉత్పత్తి అవుతుంది కదా అని అలా దానం చేసుకుంటూ పోతూనే ఉంటావా.. అదేమన్నా అన్నదానం అనుకున్నావా..లేక రక్తదానం అనుకున్నావా.. వీర్యం రా బాబూ. వీర్యం.. ఇక చాలించు నీ ప్రతాపం.. ఇంకొక్కసారి నువ్వు వీర్యం దానం చేశావా.. నీ సంగతి చూస్తా. ఏంటి ఈ వీర్యం కథ అనుకుంటున్నారా.. చాలా మంది చాలా రకాల దానాలు చేసి వార్తల్లో వ్యక్తులుగా మారుతూ ఉంటారు. కానీ ఓ మహానుభావుడు మాత్రం విచ్చలవిడిగా వీర్యదానం చేసి టాక్ ఆఫ్ ది వరల్డ్ గా మారాడు.

ఇదిగోండి ఇతని పేరు జానథన్ జాకోబ్.. వయస్సు 41.. ఇతని వృత్తి మ్యుజీషియన్.. లేచామా.. తిన్నామా.. మ్యూజిక్ వాయించామా.. పడుకున్నామా..ఇలా రెగ్యులర్‌గా ఇతని లైఫ్ స్టైల్ ఉండదు. ఇవన్నీ చేసినా చేయకపోయినా.. ఇతనికొక హాబీ ఉంది.. అడిగినవాళ్లకు అడగని వాళ్లకు ఈయన తన వీర్యాన్ని దానం చేస్తూ ఉంటాడు.. వీర్యదానంలో కొత్తేముంది. స్పెర్మ్ డొనేషన్ కాన్సెప్ట్ ఎప్పటి నుంచో ఉంది కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ జాకోబ్ మహాశయుడు ఏం చేశాడో తెలుసా.. ఏకంగా తన వీర్యాన్ని దానం చేసి 550 నుంచి 600 మంది పిల్లలకు పరోక్షంగా తండ్రిగా మారాడు. విషయం తెలుసుకున్న ఓ పిల్లాడి తల్లి.. నెదర్లండ్స్ లో కోర్టుకెక్కింది.

ఇతగాడి వీర్యదాన దాతృత్వం గురించి తెలుసుకున్న జడ్జి గారు.. అవాక్కయ్యారు.. నీ వృత్తేంటి.. నువ్వు చేస్తున్న పనేంటి.. ఈ వీర్య దానం ఏంటి అంటూ జాకోబ్‌పై న్యాయమూర్తి సీరియస్ అయ్యారు. ఇకపై వీర్య దానం చేయకుండా అతనిపై నిషేధం విధించారు. గుట్టుచప్పుడు కాకుండా వీర్యాన్ని దానం చేసినట్టు తెలిస్తే… లక్ష యూరోలు.. అంటే.. దాదాపు 90 లక్షల రూపాయల ఫైన్ విధిస్తానని హెచ్చరించారు.

నెదర్లాండ్స్ లో వీర్యదానం చట్టబద్దమే. అయితే దానికో పరిమితి ఉంది. ఏ వ్యక్తి అయినా 12 మంది మహిళలకు మాత్రమే స్పెర్మ్‌ను డొనేట్ చేయాలి. లేదా 25 మందికి మించి పిల్లలకు వీర్యదానం ద్వారా తండ్రిగా మారకూడదు. కానీ జాకోబ్ మాత్రం స్పెర్మ్ డొనేషన్‌ను మరో ప్రొఫెషన్‌గా మార్చుకున్నాడు. ఒక్క నెదర్లండ్స్ లోనే 13 క్లినిక్స్ కు వీర్యాన్ని దానం చేశాడు. ఇందులో మరో ట్విస్ట్ కూడా ఉంది. ఈ క్లినిక్స్ నుంచి వీర్యాన్ని పొంది తల్లులైన మహిళలలో దగ్గర దగ్గర కుటుంబానికి చెందిన వ్యక్తులు కూడా ఉన్నారు. అంటే ఈ పిల్లలు పెరిగి పెద్దైన తర్వాత ఎవరు ఎవరికి ఏమవుతారో తెలియని పరిస్థితి. వావి వరసలనే లేకుండా చేసేశాడు.

2007 నుంచి వీర్యదానం చేస్తూనే ఉన్నాడు. నెదర్లాండ్స్ లోని ఫెర్టిలిటీ క్లినిక్స్ కు వీర్యదానం చేయకుండా ఇతనిపై అక్కడి ప్రభుత్వం నిషేధం విధించింది. అయినా మనవాడి వీర్యదానోత్సవం ఆగలేదు.. విదేశాల నుంచి ఆన్‌లైన్ లో ఆర్డర్స్ తీసుకుని తన వీర్యాన్ని పంపించేవాడు. జాకోబ్ వీర్యదానాన్ని న్యాయస్థానం ఇప్పటికైనా ఆపకపోతే.. దావానలంలా ఇతర దేశాలకు కూడా ఇది విస్తరిస్తుందంటూ బాధిత మహిళ కోర్టులో జడ్డిగారి ముందు కన్నీరు పెట్టుకుంది.

అతనిపై నిషేధం విధించి ఇక పై వీర్యదానం చేయకుండా చేయాలని కోరింది. దీనికి కోర్టు అంగీకరించింది. అయితే జాకోబ్ న్యాయవాది మాత్రం ఇందులో ఎలాంటి దురుద్దేశాలు గానీ డబ్బులు సంపాదించాలన్న ఆలోచన గానీ లేదంటూ వాదించాడు. కేవలం పిల్లలు లేని వారికి పిల్లలను ప్రసాదించేందుకే జాకోబ్ ప్రయత్నించాడని వాదించాడు.. ప్రస్తుతం కెన్యాలో నివసిస్తున్న జాకోబ్ ఇకనైనా వీర్యదానానికి ఫుల్ స్టాప్ పెడతాడా..లేక డోనరుడిగా కొత్త చరిత్ర సృష్టిస్తాడో చూడాలి.