Sri Chakram: అమెరికాలో శ్రీచక్రం కలకలం యుగాంతానికి ఇది చిహ్నమా?

 శ్రీచక్రం.. ఇంట్లో ఉంటే శుభం కలుగుతుందని చాలామంది నమ్మకం. హిందులు పవిత్రంగా భావించే ఈ యంత్రం.. ఒకప్పుడు అమెరికా జనాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. 1990లో ఆ దేశంలోని ఓ ఏడారిలో ఎండిపోయిన సరస్సులో సుమారు 22కిలోమీటర్ల వైశాల్యంలో అతిపెద్ద శ్రీచక్రం ప్రత్యక్షం కావడమే కారణం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 12, 2023 | 05:33 PMLast Updated on: Mar 12, 2023 | 5:33 PM

Sri Chakram What Indicates To America

అమెరికా వైమానిక దళం ఎప్పుడూ నిఘా ఉండే ఈ ప్రాంతంలో.. శ్రీచక్రం ఎలా ఏర్పడిందనేది ఇప్పటికీ మిస్టరీనే! దీని గుట్టు తేల్చేందుకు అమెరికా పరిశోధకులు కూడా చేతులెత్తేశారు. శ్రీచక్రాన్ని కాగితంపై గీయాలంటేనే ఎంతో కష్టం. భూమిపై ఎలాంటి తప్పులు, వంకరులు లేకుండా ఖచ్చితంగా గీయడం అంటే మాములు విషయం కాదు. 1990లో డ్రోన్స్ కూడా అందుబాటులో లేవు. మరి శ్రీచక్రం ఎలా ప్రత్యక్షమైందన్నది ఇప్పటికీ మిస్టరీనే ! అమెరికాలోని ఓరెగాన్ రాష్ట్రంలో బర్న్స్ ప్రాంతంలో ఈ శ్రీచక్రం ఉంటుంది. భూమి మీద నుంచి చూస్తే.. ఎవరికీ అది కనిపించదు. విమానాల్లో వెళ్లేవారికే కనిపిస్తుంది. అలా బిల్ అనే అమెరికా వైమానిక అధికారి ఇది తెలుసుకొని ఫొటోలు.. పై అధికారులకు పంపగా.. ప్రత్యేక బృందం అక్కడికి చేరుకుంది.

శ్రీచక్రంలోని గీతలను పరిశీలిస్తే.. అధికారులకు మతి పోయినంత పని అయింది. 3 అంగుళాల లోతు, 9 అంగుళాల వెడల్పుతో నాగలితో తవ్వినట్లుగా గీతలు ఉన్నాయ్. మనుషులతో ఇది సాధ్యం కాదని.. గ్రహాంతర వాసులు శ్రీచక్రం గీసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. అసలు ఏలియన్స్.. హిందూ ధర్మానికి చెందిన శ్రీచక్రాన్నే ఎందుకు గీస్తారన్నది మరో ప్రధాన ప్రశ్న. ఐతే అప్పుడు మొదలైన చర్చ ఇప్పటికీ సాగుతూనే ఉంది. ఐతే ఆన్సర్ మాత్రం దొరకండం లేదు. భూమికి ఏదో సందేశం పంపాలన్న ఉద్దేశంతోనే.. ఈ శ్రీచక్రాన్ని గీశారన్నది మరికొందరి వాదన. ఐతే కాలక్రమంలో శ్రీ చక్రం కనిపించకుండా పోయింది. ఇసుక కమ్మేయడం వల్ల ఆ ప్రాంతంలో అది కమమరుగు అయింది. యుగాంతానికి ఇది చిహ్నమని కొందరు అంటుంటే.. శ్రీచక్రం అంటే అకాల మరణాలను ఆపుతుందని.. భూమికి ఏదో మంచి చేయడానికే.. భగవంతుడు ఈ శ్రీచక్రాన్ని గీశాడని మరికొందరి వాదన. అమెరికాలాంటి దేశంలో హిందువులకు పవిత్రమే శ్రీచక్రం ఏర్పడడం.. దాని మిస్టరీ ఇప్పటికీ వీడకపోవడం.. ఇంట్రస్టింగ్‌గా మారింది.