Tirumala Srivari Brahmotsavam 2023: నేటి నుంచే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. తొమ్మిది రోజుల సేవలివే..!
తొమ్మిది రోజులపాటు అంగరంగ వైభవంగా జరగనున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు శనివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించారు అర్చకులు. దీంతో ఈ రోజు నుంచి అక్టోబరు 23 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
Tirumala Srivari Brahmotsavam 2023: తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆదివారం (అక్టోబర్ 15) నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. తొమ్మిది రోజులపాటు అంగరంగ వైభవంగా జరగనున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు శనివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించారు అర్చకులు. దీంతో ఈ రోజు నుంచి అక్టోబరు 23 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. సాధారణంగా ఏడాదికోసారే బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
కానీ, ఈసారి రెండోసారి కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. దీనికి కారణం.. అధిక మాసం. చాంద్రమానం ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకోసారి అధికమాసం వస్తుంది. ఇలా అధికమాసం వచ్చినప్పుడు రెండుసార్లు బ్రహోత్సవాలు నిర్వహిస్తారు. కన్యామాసం(భాద్రపదం)లో వార్షిక బ్రహ్మోత్సవాలు, దసరా (ఆశ్వయుజం) నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, ధ్వజావరోహణం ఉండవు.
బ్రహ్మోత్సవాల విశేషాలివి..
* అక్టోబర్ 15న ఉదయం 9 గంటలకు బంగారు తిరుచ్చి ఉత్సవం.
* అక్టోబర్ 15న రాత్రి 7 గంటలకు పెద్ద శేషవాహన సేవ
* అక్టోబర్ 16న ఉదయం 8 గంటలకు చిన్నశేషవాహన సేవ
* అక్టోబర్ 16న రాత్రి 7 గంటలకు హంస వాహన సేవ
* అక్టోబర్ 17న ఉదయం 8 గంటలకు సింహ వాహన సేవ
* అక్టోబర్ 17న రాత్రి 7 గంటలకు ముత్యపుపందిరి వాహన సేవ
* అక్టోబర్ 18న ఉదయం 8 గంటలకు కల్పవృక్ష వాహన సేవ
* అక్టోబర్ 18న రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహన సేవ
* అక్టోబర్ 19న ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం
* అక్టోబర్ 19న రాత్రి 7 గంటలకు గరుడ వాహన సేవ
* అక్టోబర్ 20న ఉదయం 8 గంటలకు హనుమంత వాహన సేవ
* అక్టోబర్ 20న సాయంత్రం 4 గంటలకు పుష్పకవిమాన సేవ
* అక్టోబర్ 20న రాత్రి 7 గంటలకు గజవాహన సేవ
* అక్టోబర్ 21న ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహన సేవ
* అక్టోబర్ 21న రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహన సేవ
* అక్టోబర్ 22న ఉదయం 7.15 గంటలకు స్వర్ణరథం
* అక్టోబర్ 22న రాత్రి 7 గంటలకు అశ్వవాహన సేవ
* అక్టోబర్ 23న ఉదయం 6 గంటలకు చక్రస్నానం