Summer Job: సమ్మర్ జాబ్ కాన్సెప్ట్.. యూత్ కొత్త కల్చర్.!
ప్రస్తుతం ఎటు చూసినా జనసంద్రమే దర్శనమిస్తుంది. దీనికి కారణం వేసవి సెలవులు. స్కూల్లో ఉద్యోగాలు చేసేవారు సమ్మర్ హాలిడేస్ కారణంగా తమ బంధువుల ఇండ్లకు ప్రయాణం అవుతారు. దీంతో ప్రయాణీకుల రద్దీ పెరిగింది. రైల్వే స్టేషన్, బస్టాండ్ ఎటు చూసినా వీరే కనపడుతున్నారు. మరికొందరైతే ఉన్న ఊళ్లోనే పార్కులు, షాపింగ్ మాల్స్, సినిమాలు ఇలా తిరిగేస్తూ సరదాగా సమ్మర్ ని గడిపేస్తున్నారు. అలా కాకుండా హైస్కూల్ అయిపోయిన వెంటనే ఎదిగే పిల్లల కోసం వచ్చేసింది సరికొత్త సమ్మర్ జాబ్స్. సమ్మర్ జాబ్స్ ప్రయోజనాలేంటో.. అవి ఎవరెవరు చేవయచ్చు.. దీని వల్ల కలిగే ఉపయోగాల గురించి తెలుసుకుందాం.
సాధారణంగా వేసవి కాలం వచ్చిందంటే చిన్న పిల్లలను డ్యాన్స్, పెయింటింగ్, ఆర్ట్, సంగీతం, స్పోర్ట్స్ అంటూ రకరకాల వేదికలపైకి పంపించి శిక్షణ ఇప్పించేందుకు ప్రోత్సహిస్తూ ఉంటారు కొందరు పేరెంట్స్. ఇవి 15 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు అయితే సెట్ అవుతుంది. దీనికి కారణం అది శారీరకంగా ఎదిగే వయసు. అప్పుడే పిల్లలకు శారీరక వ్యాయామం, సమాజ అవగాహన అవసరం అవుతుంది. వ్యక్తిత్వ వికాసం, మైండ్ మెర్చూరిటీ విచ్చుకోవడానికి దోహద పడుతుంది. అదే 15 సంవత్సరాలు దాటిని పిల్లలకు మానసిక పరిపక్వత కొంత వరకూ పెరిగి ఉంటుంది. దీని కారణంగా ఏది మంచి, ఏది చెడు అని కనీస అవగాహన వారిలో ఉంటుంది. అలాంటి వారు శారీరకంగా కూడా ధృఢంగా ఉంటారు కాబట్టి వీరికి సమ్మర్ జాబ్స్ సరైన వేదిక అని చెప్పాలి.
అటు అకాడమిక్ ఇయర్ – ఇటు లైఫ్ కెరియర్
సమ్మర్ జాబ్స్ వల్ల ప్రయోజనాలు చాలా ఉన్నాయి. 15 సంవత్సరాల వయసు పైబడిన వారు అంటే దాదాపు 10వ తరగతి పూర్తిచేసిన వారే ఉంటారు. కొందరైతే ఇంటర్ మధ్యలో ఉండవచ్చు. వీరు ఈ వయసు నుంచే కెరీర్ పై శ్రద్ద చూపించడం వల్ల అటు అకాడమిక్ ఇయర్, ఇటు సోషల్ లైఫ్ అలవాటు అవుతుంది. సమాజంపై అవగాహన పెరుగుతుంది. దీంతో ఇంటర్ అయిపోయేలోపూ ఏదో ఒక సంస్ధలో ఉద్యోగిగా ఇంటెన్ షిప్ చేసిన అనుభవం వస్తుంది. దీని ద్వారా భవిష్యత్తులో ఏ పని చేయాలి, ఏ పని మనకు సెట్ అవుతుంది. దీనికి ఏ చదువు చదవాలి, రెగ్యూలర్ డిగ్రీ బెటరా.. లేక ఓపెన్ డిగ్రీ బెటరా అనే ఇంకితం బోధపడుతుంది.
కొత్త పరిచయాలు ఉపాధి మార్గాలు
ఏ పనిలో అయినా ఒకే చోట స్థిరంగా ఉంటే అక్కడ అభివృద్ది ఉండదు. ఇది లైఫ్ స్టైల్ ధీయోరీ. అందుకే కాసేపు చదువు, చదువుతో పాటూ జీవన విధానానికి అవసరమైన బాటలు వెతుకుతూ పోతే లైఫ్ అడ్వెంచర్ అతి సులువుగా మారుతుంది.అలాగే మన వయసు వారే కాకుండా పెద్ద పెద్ద వారు కూడా పరిచయం అవుతారు. దీనివల్ల పీఆర్ పెరుగుతుంది. రేపు మన చేతికి డిగ్రీ పట్టా పొందిన వెంటనే గతంలో పనిచేసిన సంస్థలోని అనుభవంతో పాటూ అక్కడ ఉద్యోగితో కూడా మనకు సత్సంబంధాలు ఉండటంతో ఉద్యోగం సులువుగా లభిస్తుంది.
ఆలోచనలు పెరిగి.. నమ్మకం కలుగుతుంది
ఇలా పనిమీద ఫోకస్ చేయడం వల్ల మనకు మనమే కొత్తగా పరిచయం అవుతాం. కొత్త కొత్త అంశాలు, సృజనాత్మక ఆలోచనలపై మెదడు పరుగులు తీస్తుంది. జీవితంలో వచ్చే ఎలాంటి కష్టాలనైనా అధిగమించేలా ధైర్యం ఏర్పడుతుంది. అంతేకాకుండా మీ పర్సనాలిటీ గురించి కొత్తగా మాట్లాడుకునేలా ట్రెండ్ సెట్ చేయగలరు. ఇలా చదువుతో పాటూ ఉపాధిని సమాంతరంగా బ్యాలెన్స్ చేసినప్పుడు ఇంటర్వూలలో హెచ్ ఆర్ వద్ద వింత అనుభవాన్ని చూడవల్సి వస్తుంది. పనికి మీరు బద్దకస్తులు కాదు అనే బలమైన అభిప్రాయాన్ని వారిలో నాటగలరు. తద్వారా మీకు అతి సులువుగా ఉపాధి దొరికే అవకాశం ఉంది. పారాడే వయసు నుంచే పోరాడటం నా లైఫ్ స్టైల్ అని ఒక సినిమాలో చిరంజీవి అన్నట్లు.. చదుకునే రోజుల్లోనే ఉపాధి అన్వేషణ నా కెరీయర్ స్టైల్ అనేలా హీరోయిజం చూపించేందుకు దోహదపడుతుంది.
పనిలో అవగాహన – ఉద్యోగంలో స్థిరత్వం
ఈ సమ్మర్ జాబ్ కాన్సెప్ట్ వల్ల మీరు ఏ రంగంలో రాణించగలరు అనే అవగాహన చదువుకునే సమయంలోనే కలుగుతుంది. తద్వారా మీకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకొని నచ్చని పని జోలికి పోకుండా జాగ్రత్తగా కెరీయర్ ని లీడ్ చేయవచ్చు. చదువుకొని.. సర్టిఫికేట్ పొంది.. ఇంటర్వూలకు తిరిగి.. అక్కడ పని ఏవిధంగా ఉంటుందో తెలియక.. కొంత కాలం పని చేసిన తరువాత క్లారిటీ వచ్చి.. అది నచ్చక మానివేయడంకన్నా ఇలా చేయడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
T.V.SRIKAR