Singareni Elections: సింగరేణి ఎన్నికలకు హైకోర్టు అంగీకారం..

సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలు వాయిదా వేయాలంటూ రాష్ట్ర ఇంధన శాఖ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఈ మధ్యంతర పిటిషన్‌ను కొట్టేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 21, 2023 | 02:26 PMLast Updated on: Dec 21, 2023 | 2:26 PM

Telangana High Court Give Green Signal To Conduct Singareni Elections

Singareni Elections: సింగరేణి ఎన్నికల నిర్వహణపై కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. ఎన్నికల నిర్వహణకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల నిర్వహణకు తెలంగాణ హైకోర్టు గురువారం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 27న ఎన్నికలు నిర్వహించేందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలు వాయిదా వేయాలంటూ రాష్ట్ర ఇంధన శాఖ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది.

YSRCP: అలీకి వైసీపీ టిక్కెట్.. ఎక్కడినుంచంటే..

దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఈ మధ్యంతర పిటిషన్‌ను కొట్టేసింది. సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికలు సాధారణంగా నాలుగేళ్లకోసారి జరుగుతాయి. దీని ప్రకారం ఈ ఏడాది డిసెంబర్‌లో ఎన్నికలు జరగాలి. కానీ, ఈ ఎన్నికలపై తెలంగాణ హైకోర్ట్‌లో ఏడాది కాలంగా వివాదం నడుస్తోంది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణపై పలుమార్లు గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత అక్టోబర్‌లోనే ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ ఎన్నికలను వాయిదా వేసింది. తర్వాత డిసెంబర్‌లో ఎన్నికలు జరగాల్సి ఉంది. దీని ప్రకారం సింగరేణి ఎన్నికల కోసం కార్మిక సంఘాలు ప్రచారం ప్రారంభించాయి. అయితే, తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైనందున మరోసారి ఎన్నికలు వాయిదా వేయాలంటూ కార్మిక సంఘం హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. కానీ, యాజమాన్యం దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ నెల 27న ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది.

Ayodhya Ram Mandir Inauguration : అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి విపక్ష నాయకులకు ఆహ్వానం..

దీంతో కేంద్ర కార్మిక శాఖ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. ఇదే సమయంలో ఎన్నికల వాయిదా కోరుతూ రాష్ట్ర ఇంధన శాఖ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. కౌంటర్‌ దాఖలుకు ఆదేశించింది. తర్వాత విచారణ జరిపిన న్యాయస్థానం ఎన్నికలను వాయిదా వేయడానికి సరైన కారణాలు లేవని అభిప్రాయపడింది. అయితే, ఎన్నికల వాయిదా యత్నాలను పసిగట్టిన కార్మిక సంఘాలు ముందే కేవియట్ పిటిషన్ దాఖలు చేశాయి. దీంతో ఇంధన, వనరుల శాఖ కార్యదర్శి పిటిషన్‌పై స్టే ఇవ్వకుండా విచారణ జరిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. సింగరేణి ఎన్నికల నిర్వహణకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు.