Traffic Challans: పెండింగ్ చలాన్లపై ప్రభుత్వం బంపర్ ఆఫర్.. 90 శాతం డిస్కౌంట్
చలాన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా చలాన్ల విషయంలో భారీ ఆఫర్ ప్రకటించారు పోలీసులు. ఆర్టీసీ బస్సులు, తోపుడుబళ్లపై ఏకంగా 90 శాతం రాయితీ ప్రకటించారు.
Traffic Challans: తెలంగాణ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ ఫేస్ చేస్తున్న సమస్యల్లో పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల సమస్య చాలా పెద్దది. కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నప్పటికీ వాహనదారులతో చలాన్లు కట్టించేందుకు పోలీసులు నానా తంటాలు పడుతుంటారు. అలాంటి చలాన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా చలాన్ల విషయంలో భారీ ఆఫర్ ప్రకటించారు పోలీసులు.
COVID 19: కరోనా నుంచి తప్పించుకోవాలంటే మరో బూస్టర్ డోస్ తప్పదా
ఆర్టీసీ బస్సులు, తోపుడుబళ్లపై ఏకంగా 90 శాతం రాయితీ ప్రకటించారు. టూ వీలర్ వాహనాలకు 80 శాతం రాయితీ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక కార్లు, ఆటోలకు 60 శాతం ఆఫర్ ఇస్తూ ప్రకటన విడుదల చేశారు. ప్రైవేట్ బస్సులు, భారీ వాహనాలకు చలాన్స్‌లో 50 శాతం రాయితీ ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈ నెల 30 నుంచి అంతా చలాన్లు రీపే చేయాలంటూ సూచించారు. 2024 జనవరి 10 వరకూ ఈ ఆఫర్ ఉంటుందని తెలిపారు. చలాన్లు కట్టాలనకున్న ప్రతీ ఒక్కరూ లోక్ అదాలత్ ద్వారా చలాన్లు కట్టుకోవచ్చని సూచించారు. లోక్ అదాలత్‌లో పాటు.. ఆన్‌లైన్ పేమెంట్, మీసేవాల ద్వారా కూడా చలాన్లు కట్టే వెసులుబాటు ఇస్తున్నట్టు తెలిపారు.
గతంలో కూడా రెండు సార్లు ఇదే తరహాలో పెండింగ్ చలాన్లపై ఆఫర్లు ఇచ్చారు ట్రాఫిక్ పోలీసులు. పెడింగ్ బకాయిలు వసూలు చేసేందుకు రాయితీలు ప్రకటించారు. రాయితీలు ప్రకటించిన వెంటనే చాలా వరకూ మొండి బకాయిలు చెల్లించారు వాహనదారులు. దీంతో ఇప్పుడు మరోసారి అదే ట్రిక్ ఫాలో అవుతున్నారు పోలీసులు. కానీ ఈ స్థాయిలో గతంలో ఎప్పుడు రాయితీలు ఇవ్వలేదు. దీంతో వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.