Temple Shadow on Earth: ఈ ఆలయం నీడ భూమిపై పడదు.. అసలు రహస్యం ఏంటంటే..

తమిళనాడు అంటేనే ముందుగా గుర్తొచ్చేది పురాతన కట్టాడాలు, దేవాలయాలు. ఎన్నో వందల ఏళ్ల క్రితం నిర్మించిన పురాతన దేవాలయాలు కట్టాడాలు ఆ రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి. చాలా దేవాలయాల్లో ఎవరూ కనిపెట్టలేని రహస్యాలు, సైన్స్‌కు కూడా అందని సన్నివేశాలు ఎన్నో కనిపిస్తాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 17, 2023 | 01:22 PMLast Updated on: Jun 17, 2023 | 1:22 PM

Temple Shadow Not Shown On Earth At Tamilnadu

అలాంటి దేవాలయాల్లో బృహదీశ్వరాలయం ఒకటి. ఈ పురాతన శివాలయం తమిళనాడులోని తంజావూరులో ఉంది. ఈ బృహదీశ్వర ఆలయాన్ని సుమారు 1000 సంవత్సరాల క్రితం నిర్మించినట్లు తెలుస్తోంది. మొదటి రాజరాజ చోళ హయాంలో దీన్ని నిర్మించారు. ఆలయ కట్టడంలో చోళ రాజవంశం శిల్పకళా వైభవం ఉట్టిపడుతుంది. ద్రవిడ నిర్మాణ శైలిలో.. ఆలయ సముదాయంలో ఎత్తైన గోపురాలు, భారీ బురుజులతో సహా అనేక దేవాలయాలు ఉంటాయి. ఇందులో శివుడు, పార్వతి, గణేషుడు, కార్తీకేయ దేవాలయాలు ఉంటాయి. తమిళనాడులోని మిగిలిన దేవాలయాలతో పోలిస్తే ఈ ఆలయం చాలా ప్రత్యేకం. ఎందుకంటే మధ్యాహ్నం అయ్యిందంటే ఈ దేవాలయం నీడ మాయమైపోతుంది.

భూమి మీద పడదు, అసలు కనిపించదు. ఇదేదో కేవలం జీరో షాడో డేలో జరుగుతుంది అనుకుంటే పొరపాటు. ఏడాది పొడుగునా కాలం ఏదైనా మధ్యాహ్నం అయ్యిందంటే చాలు బృహదీశ్వరాలయం నీడ మాయమైపోతుంది. అదే ఈ ఆలయం ప్రత్యేక. అందుకే ప్రతీ ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా ఈ దేవాలయాన్ని దర్శించాలని అనుకుంటారు. పురాతన ఆలయాన్ని దర్శించడంతో పాటు.. ఈ ఇంజనీరింగ్‌ వండర్‌ను చూసి త్రిల్‌ అవుటుంతారు. ఇప్పటి ఇంజనీర్లు కూడా ఆశ్చర్యపోయే అధునాతన ఇంజనీరింగ్ సాంకేతికతతో ఆకాలంలోనే దీన్ని నిర్మించారు. దీని నీడ కనిపించకపోవడం నిపుణులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎన్నో ఏళ్ల నుంచి ఈ రహస్యాన్ని కనిపెంట్టేందుకు నిపుణులు ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ మిస్టరీ ఏంటో ఇప్పటి వరకూ తేలలేదు. కేవలం ఇండియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ గుడి చాలా ఫేమస్‌. అందుకే బృహదీశ్వర ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల్లో చేర్చింది.