Whatsapp: వావ్… వాట్సాప్‌లో మరో ఇంట్రస్టింగ్ ఫీచర్

వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా ఇందులో.. యాప్ నిర్వాహకులు ఎప్పటికప్పుడు మార్పులు చేస్తున్నారు. ప్రైవసీ నుంచి.. మెసేజింగ్ ఆప్షన్స్ వరకు కీలక అప్‌డేట్‌లు తెస్తున్నారు. అలాంటి వాట్సాప్‌లో ఇప్పుడు అదిరిపోయే ఆప్షన్ రాబోతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 24, 2023 | 01:39 PMLast Updated on: Feb 24, 2023 | 1:39 PM

Text Edit Option In Whatsapp Coming Soon

ఆ యాప్ లేకుండా ఒక్క క్షణం కూడా గడవలేని స్థాయికి ప్రతీ మనిషి జీవితాల్లోకి వచ్చేసింది వాట్సాప్ ! వీడియో కాల్, ఆడియో కాల్, మెసేజ్.. ఇలా ప్రతీదానికి ఇన్‌స్టంట్ ఆలోచన వాట్సాప్. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా ఇందులో.. యాప్ నిర్వాహకులు ఎప్పటికప్పుడు మార్పులు చేస్తున్నారు. ప్రైవసీ నుంచి.. మెసేజింగ్ ఆప్షన్స్ వరకు కీలక అప్‌డేట్‌లు తెస్తున్నారు. అలాంటి వాట్సాప్‌లో ఇప్పుడు అదిరిపోయే ఆప్షన్ రాబోతోంది.

ఇన్నాళ్లు తప్పుగా టైప్ చేసినా.. టైప్ చేసిన దాంట్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా.. మెసేజ్ అంతా డిలీట్ చేయాల్సి వచ్చేది. వాట్సాప్‌లో లేటెస్ట్ అప్‌డేట్‌తో ఇప్పుడా అవసరం లేదు. మెసేజ్ పంపించిన 15 నిమిషాల వరకు.. ఆ టెక్ట్స్ ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ బీటా వర్షన్ రిలీజ్ అయింది. ఐఫోన్‌లో అది పనిచేస్తోంది. టెలిగ్రామ్‌లోనూ ఇప్పటికే ఇలాంటి ఆప్షన్ ఉంది. ఐతే అంతకుమించి అప్‌డేట్ ఉండేలా.. ఈ ఫీచర్‌ను డెవలప్ చేస్తున్నారు. టెలిగ్రామ్‌లో కంపేర్ చేస్తే.. టెక్ట్స్ ఎడిటింగ్ సమయాన్ని 15 నిమిషాలకు పెంచారు.

ఇంకేముంది.. స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తాయని ఆలోచించకండి.. ఏదో పంపబోయి.. ఇంకేదో పంపామని బాధపడకండి.. ప్రతీది ఎడిట్ చేసుకునే అవకాశం రాబోతోంది.. ఏమైనా హే వాట్సప్ అనే లోపు.. వాట్సాప్ నుంచి అప్‌డేట్ వచ్చేస్తోంది. అందుకే నంబర్ వన్ యాప్‌గా టెక్నాలజీ రంగాన్ని ఏలుతోంది.. టెక్ట్స్ ఎడిట్ ఆప్షన్ పై నెటిజన్లు తెగ ఖుషీ అవుతున్నారు.