Teachers Federation building : పుస్తకాల రూపంలో టీచర్స్ ఫెడరేషన్ భవనం..
ఓ నాలుగు పుస్తకాలు తీసి ఒకదానిపై ఒకటి పెడితే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఆ భవనం. చూడ్డానికి చాలా కొత్తగా ఉంది కదూ. మీరే కాదు ఈ బిల్డింగ్ చూసిన ప్రతీ ఒక్కరి ఫీలింగ్ ఇదే.
ఓ నాలుగు పుస్తకాలు తీసి ఒకదానిపై ఒకటి పెడితే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఆ భవనం. చూడ్డానికి చాలా కొత్తగా ఉంది కదూ. మీరే కాదు ఈ బిల్డింగ్ చూసిన ప్రతీ ఒక్కరి ఫీలింగ్ ఇదే. ఇంత డిఫరెంట్‌గా ప్లాన్ చేశారు అంటే ఇదేదో రెస్టారెంట్, కాఫీ షాప్ అనుకుంటారమో.. అస్సలు కాదు. విజయవాడలోని సూర్యారావుపేట విష్ణువర్ధన్ వీధిలో ఉన్న ఏపీ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యాలయం ఇది. గ్రౌండ్ ఫ్లోర్‌తో కలిపి నాలుగు అంతస్థుల్లో ఉండే ఈ భవనాన్ని డిఫరెంట్‌గా ఉండేందుకు ఇలా బుక్స్ మోడల్‌లో డిజైన్ చేశారు. బిల్డింగ్ గోడలు కూడా పేపర్స్ మాదిరిగానే డిజైన్ చేశారు.
ఇప్పుడున్న జనరేషన్‌లో పుస్తకాలు చదివేవాళ్లు చాలా తక్కువ. అందరి చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఒకవేళ పుస్తకాలు చదవాలి అనుకున్నా.. అంతా డిజిటల్ బుక్స్‌లోనే చదివేస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్‌లో పుస్తకాల ప్రాముఖ్యతను అందరికీ తెలియజేయడానికే ఇలా బిల్డింగ్‌ను పుస్తకం రూపంలో తీర్చిదిద్దామంటున్నారు ఏపీ టీచర్స్ ఫెడరేషన్ స్టేట్ కమిటీ సభ్యులు. 1947లో ఏపీ టీచర్స్ ఫెడరేషన్ స్థాపించారు. గతంలో ఇదే బిల్డింగ్ స్థానంలో మరో పాత బిల్డింగ్ ఉండేది. 2018లో ఆ బిల్డింగ్‌ను పడగొట్టి ఈ కొత్త బిల్డింగ్‌ను నిర్మించారు. దాదాపు కోటి రూపాయల దీనికి ఖర్చైందట. ఏది ఏమైనా డిఫరెంట్ డిజైన్‌తో భలే ఆకట్టుకున్నారు.