ప్రేయసి కోసం దొంగగా మారిన మాజీ ఎమ్మెల్యే కొడుకు

రోబో సినిమాలో చిట్టి రోబో చెప్పింది కరెక్టే. లవ్‌లో పడితే చాలా మందికి స్క్రూ ఊడిపోతుంది. ఏం చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో చేస్తున్నారో కూడా తెలియకుండా కొన్ని తప్పులు చేస్తుంటారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 3, 2025 | 12:02 PMLast Updated on: Feb 03, 2025 | 12:02 PM

The Son Of A Former Mla Who Became A Thief For His Girlfriend

రోబో సినిమాలో చిట్టి రోబో చెప్పింది కరెక్టే. లవ్‌లో పడితే చాలా మందికి స్క్రూ ఊడిపోతుంది. ఏం చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో చేస్తున్నారో కూడా తెలియకుండా కొన్ని తప్పులు చేస్తుంటారు. ఒక్కోసారి ఆ తప్పులు వాళ్ల జీవితాలను, పక్కవాళ్ల జీవితాలను కూడా బలి తీసుకుంటాయి. ఇలా లవర్‌ కోసం హత్యలు చేసి జైలుకు వెళ్లినవాళ్లు కూడా ఉన్నారు. ఇప్పుడు మీరు వినబోయే ఈ స్టోరీ కూడా దాదాపు అలాంటిదే.

ఈ ఇన్సిడెంట్‌ అహ్మదాబాద్‌లో జరిగింది. నైట్‌ టైంలో ఒంటరిగా వెళ్తున్న ఓ మహిళ నుంచి ఓ వ్యక్తి ఇలా చైన్‌ లాక్కుని పారిపోయాడు. ఇలా చైన్‌ స్నాచింగ్‌లు చాలా ప్రాంతాల్లో జరుగుతూనే ఉంటాయి.. ఇదే ఎందుకు ఇంత స్పెషల్‌ అనుకుంటున్నారా. దీని వెనకే ఓ కథ ఉంది. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా ఈ దొంగను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అరెస్ట్‌ చేశాక తెలిసింది. ఇతను నార్మల్‌ వ్యక్తి కాదు. బాగా చదువుకున్నవాడు. ఇతని తండ్రి మాజీ ఎమ్మెల్యే కూడా. మానస నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే విజేంద్రసింగ్‌ చంద్రావత్‌ కొడుకే ఈ వ్యక్తి. ఇతని పేరు ప్రద్యూమన్‌. చాలా కాలం నుంచి కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు.

ఫ్యామిలీలో ఉన్న విభేదాల కారణంగా తండ్రి కూడా ప్రద్యూమన్‌ను వెనక్కి తీసుకువెళ్లే ప్రయత్నం చేయలేదు. తండ్రి మాజీ ఎమ్మెల్యే అయినా.. తన ఐశ్వర్యాన్ని వదిలేసి అహ్మదాబాద్‌కు వచ్చి సింపుల్‌గా బతుకుతున్నాడు ప్రద్యూమన్‌. అక్కడే 15 వేల జీతానికి చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు. ప్రద్యూమన్‌కు ఓ గర్ల్‌ఫ్రెండ్ ఉంది. వచ్చే 15 వేల జీతంతో ఇంటి రెంట్‌, ఖర్చులు, గర్ల్‌ఫ్రెండ్‌తో షికార్లు… ఇవన్నీ మెయిన్‌టేన్‌ చేయలేకపోయాడు. దీంతో ఈజీగా డబ్బు సంపాదించేందుకు చోరీలు చేయాలని ఫిక్స్‌ అయ్యాడు. చేస్తున్నది తప్పా ఒప్పా అనేది పక్కన పెడితే.. తన ప్రేయసిని సంతోష పెట్టాలి అనుకున్నాడు. అంతే చైన్‌ స్నాచింగ్‌ చేయాలని డిసైడ్‌ అయ్యాడు. ఇలా ఓ మహిళ ఒంటరిగా వెళ్తున్న సమయంలో ఎటాక్‌ చేసి చైన్‌ ఎత్తుకెళ్లాడు. పాపం పెద్దగా ఎక్స్‌పీరియన్స్‌ లేకపోవడంతో వెంటనే దొరికిపోయాడు. ప్రేమసి కోసం దొంగగా మారిన ఈ మాజీ ఎమ్మెల్యే కొడుకు కథ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది.