Bell Sound: గుడిలో గంట ఎందుకు కొడతారో తెలుసా..
మతం ఏదైనా సరే ప్రార్థనకు ఉండే ప్రధాన్యత వేరు. దీన్నే ముస్లింలు నమాజ్ అంటారు, హిందువులు పూజ అంటారు. హిందూ సనాతన ధర్మంలో పూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. హిందువులు పూజకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో పూజలో కొట్టే గంటకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు.
ఇంట్లో పూజ చేసి హారతి ఇస్తున్న సమయంలో ఖచ్చితంగా గంట కొడతారు. గుడికి వెళ్లినప్పుడు కూడా ముందుగా అంతా ఖచ్చితంగా గంట కొడతారు. ఇలా గంట కొట్టడం వెనక శతాబ్ధాల నాటి మత విశ్వాసం ఉంది. ఇలా గుడిలో గంటలు మోగించే సంప్రదాయం ఈనాటిది కాదు. కొన్ని శతాబ్దాల నాటిది. హిందూ మత విశ్వాసం ప్రకారం ఆలయంలో అడుగు పెట్టిన వెంటనే గంట మోగించడం వల్ల దేవుని విగ్రహంలో చైతన్యం వస్తుంది. ఈ సమయంలో పూజలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయనేది నమ్మకం.
అందుకే గుడికి వెళ్లగానే ముందుగా గంట కొడతారు. మన పురాణాల ప్రకారం.. గుడిలో గంట మోగించడం వల్ల అనేక జన్మల పాపాలు నశిస్తాయట. గంట కొట్టడం వెనుక మతపరమైన ప్రాముఖ్యతతో పాటు సైంటిఫిక్ యాంగిల్ కూడా ఉంది. గంట కొట్టడం ద్వారా శరీరంలో నిస్పృహతో ఉన్న స్టేజ్ యాక్టివేట్ అవుతుందనేది పెద్దల నమ్మకం. గంటలను ఖచ్చితంగా ఇత్తడి లేదా పంచలోహాలతో తయారు చేస్తారు.
వీటి నుంచి సౌండ్ ఎక్కువగా వస్తుంది. గంట నుంచి వచ్చే సౌండ్ వేవ్స్ వల్ల ఆ చుట్టుపక్కల ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది. దీంతో ఆ సౌండ్ వేవ్స్ వెళ్లిన ప్లేస్ మొత్తం క్లీన్ అవుతుంది. గంట నుంచి వచ్చే వైబ్రేషన్స్ నెగటివ్ ఎనర్జీని కూడా అంతమొందిస్తాయి. లయబద్ధంగా వచ్చే సౌండ్ వల్ల మైండ్ రిలాక్స్ అవుతుంది. అందుకే గుడిలో, ఇంట్లో పూజా సమయంలో ఖచ్చితంగా గంటను మోగిస్తుంటారు.