Chikoti Praveen: గ్యాంబ్లర్ చికోటి ప్రవీణ్ కాదు.. డాక్టర్ చికోటి ప్రవీణ్..
చికోటి ప్రవీణ్ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. జూఫిలిస్ట్, ఎన్విరాన్మెంటలిస్ట్ విభాగంలో అమెరికాకు చెందిన యునైటెడ్ థియోలాజికల్ రీసెర్చ్ ఇన్సిట్యూట్ యూనివర్సిటీ.. ప్రవీణ్‌కు డాక్టరేట్ పట్టా అందించింది. డాక్టరేట్ అందుకోవటంపై చికోటి ప్రవీణ్ ఆనందం వ్యక్తం చేశారు.
Chikoti Praveen: చికోటి ప్రవీణ్ అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. ఆ మధ్య ఈడీ దాడుల తర్వాత.. ప్రవీణ్ ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. చికోటి ప్రవీణ్ బిజినెస్‌లు ఇవే.. చీకోటి బాగోతం ఇదే అంటూ జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. చికోటి ప్రవీణ్ పెద్ద గ్యాంబ్లర్. ఆయనే ఈ విషయాన్ని అంగీకరించాడు అనుకోండి. ప్రవీణ్ గురించి బయటకొచ్చిన ఒక్కో విషయం.. ప్రతీ ఒక్కరిని అవాక్కయ్యేలా చేసింది. సిటీ శివార్లలో ఆయనకు చిన్నపాటి జూనే ఉంది. పాములు, పక్షులు.. రకరకాల జంతువులు, అరుదైన జీవులు ఎన్నో ఉన్నాయ్ ఆ జూలో. ఐతే ఇప్పుడిదంతా ఎందుకు అనుకుంటున్నారా.. ఆ జూనే.. గ్యాంబ్లర్ చికోటి ప్రవీణ్‌ను డాక్టర్ చికోటి ప్రవీణ్‌గా మార్చింది. చికోటి ప్రవీణ్ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు.
JANASENA: జనసేనకు మరో దెబ్బ.. జాతీయ జనసేన పార్టీతో ఓట్ల చీలిక..?
జూఫిలిస్ట్, ఎన్విరాన్మెంటలిస్ట్ విభాగంలో అమెరికాకు చెందిన యునైటెడ్ థియోలాజికల్ రీసెర్చ్ ఇన్సిట్యూట్ యూనివర్సిటీ.. ప్రవీణ్‌కు డాక్టరేట్ పట్టా అందించింది. డాక్టరేట్ అందుకోవటంపై చికోటి ప్రవీణ్ ఆనందం వ్యక్తం చేశారు. క్యాసినో కింగ్‌గా ఫేమస్ అయిన బీజేపీ నేత చికోటి ప్రవీణ్ కుమార్.. అమెరికాలోని, కాలిఫోర్నియాకు చెందిన యునైటెడ్ థియోలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ నుంటి ఈ డాక్టరేట్ అందుకున్నారు. హైదరాబాద్‌లోని తాజ్ డెక్కన్ హోటల్‌లో ఈ డాక్టరేట్ ప్రదానం చేశారు. తనకు పర్యావరణం మీద, మూగజీవాల మీద ఉన్న ప్రేమను.. డాక్టరేట్ అందుకున్న తర్వాత ప్రవీణ్ చెప్పారు. పంచభూతాలను రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయని.. ప్రపంచంలో మానవులకు జీవించే హక్కు ఎంత ఉందో.. జంతువులు, పక్షులకు కూడా అంతే హక్కు ఉందని ప్రవీణ్ చెప్పుకొచ్చారు. తనకు చిన్ననాటి నుంచే జంతువులు, పక్షులంటే అమితమైన ప్రేమ అని.. ఆ ఇష్టంతోనే.. ప్రపంచంలోని అరుదైన జీవజాతులను కన్నబిడ్డల్లా పెంచుకుంటున్నానని వివరించారు.
వీధుల్లో ఉండే కుక్కలను చూస్తే తనకు జాలేస్తుందని.. వాటికి తాను ఆహారం అందిస్తుంటానని.. దత్తత తీసుకుని మరీ సంరక్షణ చూస్తుంటానని చెప్పారు. పాములపై రీసెర్చ్ నిర్వహించానని, వ్యవసాయం, జీవన సంపదను కాపాడటంలో పాములు పెద్ద పాత్ర పోషిస్తాయని వివరించారు. చికోటికి డాక్టరేట్ ఇచ్చిన వ్యవహారం.. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది.