Hepatitis Viral : ప్రపంచంలో ఈ వ్యాధి డేంజర్… రోజుకి 3500 మంది మృతి !
ప్రపంచం దేశాలను మరో మహమ్మారి వణికిస్తోంది. హెపటైటిస్ ఇన్‌ఫెక్షన్లు (Hepatitis infections) అంతకంతకూ పెరుగుతున్నాయి. వైరల్ హెపటైటిస్ వల్ల ప్రాణాలు పోతున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది.

This disease is dangerous in the world... 3500 people die every day!
ప్రపంచం దేశాలను మరో మహమ్మారి వణికిస్తోంది. హెపటైటిస్ ఇన్‌ఫెక్షన్లు (Hepatitis infections) అంతకంతకూ పెరుగుతున్నాయి. వైరల్ హెపటైటిస్ వల్ల ప్రాణాలు పోతున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది.
వైరల్ హెపటైటిస్ వల్ల ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య పెరుగుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వార్నింగ్ ఇస్తోంది. ప్రపంచంలో రోజుకి కనీసం 3,500 మంది చనిపోతున్నట్టు లెక్కలు బయటపెట్టింది. టీబీ(క్షయ వ్యాధి) మరణాలతో సమానంగా ఉన్నట్టు WHO అధికారులు చెబుతున్నారు. వైరల్ హెపటైటిస్‌తో 2019లో 11 లక్షల మంది చనిపోయారు. 2022లో అది 13 లక్షలకు చేరినట్టు WHO చెబుతోంది.

క్షయ వ్యాధి…
ఇందులో హెపటైటిస్ బి (Hepatitis B) వల్ల 83 శాతం, హెపటైటిస్ సి (Hepatitis C) వల్ల 17 శాతం మంది చనిపోయారు. హెపటైటిస్ వ్యాధికి సంబంధించి మూడింట రెండొంతుల కేసులు బంగ్లాదేశ్, చైనా, ఇథియోపియా, భారత్, ఇండోనేసియా, నైజీరియా, పాకిస్థాన్, ఫిలిప్పీన్స్, రష్యా, వియత్నాంలో నమోదవుతున్నాయని అంటున్నారు WHO అధికారులు. ఈ దేశాల్లో వ్యాధి నివారణ, నిర్ధారణ, చికిత్సకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) సూచించింది.