BRS, Theinmar Mallanna : బీఆర్‌ఎస్‌లో చేరిన తీన్మార్ మల్లన్న.. వైరల్ ఫొటోల వెనక అసలు నిజం..
తెలంగాణ సమాజానికి తీన్మార్ మల్లన్న పరిచయం అవసరం లేని వ్యక్తి. ఓ జర్నలిస్ట్‌గా జీవితాన్ని ప్రారంభించి.. ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఓ శక్తిగా ప్రజల బలంతో ఎదిగాడు మల్లన్న. ప్రభుత్వంలో జరిగే ప్రతీ తప్పును ప్రజల ముందు పెడుతూ ప్రజల్లో విశ్వాసాన్ని కూడగట్టుకున్నాడు. కేవలం జర్నలిస్ట్ గానే కాకుండా రాజకీయాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎన్నికల్లో పోటీ కూడా చేశాడు. గతంలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేశాడు.
తెలంగాణ సమాజానికి తీన్మార్ మల్లన్న పరిచయం అవసరం లేని వ్యక్తి. ఓ జర్నలిస్ట్‌గా జీవితాన్ని ప్రారంభించి.. ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఓ శక్తిగా ప్రజల బలంతో ఎదిగాడు మల్లన్న. ప్రభుత్వంలో జరిగే ప్రతీ తప్పును ప్రజల ముందు పెడుతూ ప్రజల్లో విశ్వాసాన్ని కూడగట్టుకున్నాడు. కేవలం జర్నలిస్ట్ గానే కాకుండా రాజకీయాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎన్నికల్లో పోటీ కూడా చేశాడు. గతంలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేశాడు. తరువాత ఇండిపెండెంట్‌గా కూడా పోటీ చేశాడు. తరువాత బీజేపీలో చేరాడు. రీసెంట్‌గా ఆ పార్టీ విధానాలు నచ్చకపోవడంతో కాంగ్రెస్‌లో చేరాడు. ఏ పార్టీలో ఉన్నా తీన్మార్ మల్లన్న ఎజెండా ఒక్కటే.. బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలి. కేసీఆర్‌కు అధికారం లేకుండా చేయాలి. బీఆర్‌ఎస్ పార్టీ అంటే ఇంత ద్వేషించే మల్లన్న బీఆర్ఎస్‌లో చేరాడంటూ రెండు రోజలు నుంచి ఇంటర్నెట్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
KCRను ఎన్నికల్లో ఓడించిన ఏకైక వ్యక్తి ఇతనే..
కేటీఆర్‌ను ఓ ఆట ఆడుకునే మల్లన్న కేటీఆర్ చేతులమీదుగానే బీఆర్ఎస్‌లో చేరినట్టు ఫొటోలు మార్ఫింగ్ చేసి ఇంటర్నెట్‌లో పోస్ట్ చేశారు కొందరు వ్యక్తులు. కొన్ని నిమిషాల్లోనే ఫొటో వైరల్‌గా మారిపోయింది. చూసేందుకు నిజంగానే మల్లన్నకు కేటీఆర్ కండువా కప్పి బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించినట్టు ఉన్నాయి ఈ ఫొటోలు. ఇదే విషయంలో మల్లన్న క్లారిటీ ఇచ్చాడు. ఈ ఫేక్ ఫొటో కాళేశ్వరం రీ డిజైన్ లాగే దరిద్రంగా ఉందంటూ.. ఫేక్ ఫొటోను, ఒరిజినల్ ఫొటోను తన ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. ఇలాంటి ప్రచారాలు నమ్మొద్దంటూ తన ఫాలోవర్స్‌కు చెప్పాడు. మల్లన్న ఈ క్లారిటీ ఇచ్చేవరకూ చాలా మంది నిజంగానే ఆయన బీఆర్‌ఎస్‌లో చేరాడని చాలా మంది అనుకున్నారు. మల్లన్నకు మద్దతుగా ఈ ఫొటోకు ఆయన ఫాలోవర్స్ తెగ కామెంట్లు పెడుతున్నారు. మల్లన్నపై బురద జల్లేందుకు బీఆర్ఎస్ నాయకులు ఇలాంటి చిల్లర పనులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.