Kerala: అనంతపద్మనాభ స్వామి ఆరో గదిలో ఏముంది

ఇండియాలోనే అత్యంత సంపన్నమైన దేవాలయం అనంతపద్మనాభ స్వామి దేవాలయం. కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉన్న ఈ గుడి.. శ్రీ మహావిష్ణువు 108 దివ్య ప్రదేశాల్లో ఒకటి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 19, 2023 | 12:25 PMLast Updated on: Apr 19, 2023 | 12:25 PM

Tiruvanantapuram Padmanabha Swamy

ఈ గుడిలో పాలసముద్రంలోని శేషపాన్పుపై పవళిస్తున్న శ్రీహరి విగ్రహం ఉంది. కొన్నేళ్ల క్రితం ఈ గుడిలోని నేలమాళిగల్లో బయటపడిన బంగారం వల్ల దేశవ్యాప్తంగా ఈ గుడి హాట్‌ టాపిక్‌గా మారింది. గుడి కింద ఉన్న నేలమాళిగల్లో లక్షల కోట్లు విలువ బంగారం దొరికింది. వాటిని కాపాడే బాధ్యతను ట్రావెన్ కోర్‌ రాజకుటుంబానికి తిరిగి అప్పగిస్తున్నట్లు సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.

2011లో ఆలయ పాలకమండలి గుడి నేలమాళిగల్లో ఆరు సీక్రెట్‌ గదులను గుర్తించింది. ఆ గదులను తెరవాలని సుప్రీంకోర్టు తీర్పుతో ఐదు గదులను తెరిచారు. ఆ గదుల్లో అపారమైన సంపద ఉన్నట్లు గుర్తించారు. మొత్తం ఆరు గదలకు ABCDEFతో ఇండికేట్‌ చేస్తారు. ఫస్ట్‌ ఓపెన్‌ చేసిన A,B,C గదుల్లో భారీగా బంగారం దొరికింది. ఇంట్లో ఉపయోగించే వస్తువులు బంగారంతో చేసినవి దొరికాయి. వెండి దీపాలు, శివుడి విగ్రహాన్ని కూడా ఆలయ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ గుర్తించింది.

ఇలా వెతుకుతున్న కొద్దీ బంగారం బయటికి వస్తూనే కనిపించింది. ఆలయానికి ఉత్తరం వైపు ఉన్న D,F రూంలలో.. బంగారంతో పాటు వజ్రాలు కూడా దొరికాయి. 5 గదుల్లో దొరికిన మొత్తం సంపద విలువ 5 లక్షల కోట్లుకు పైగా ఉంది. దీంతో ఇప్పటివరకూ ఇండియాలో సంపన్న ఆలయంగా పేరున్న తిరుమల శ్రీవారి ఆలయాన్ని అనంతపద్మనాభ స్వామి దేవాలయం బీట్‌ చేసింది. అన్ని గదులు ఓపెన్‌ చేసినప్పటికీ ఆరో గదిని మాత్రం ఇప్పటికీ ఓపెన్‌ చేయలేదు. దీనికి కారణం ఆ గదికి నాగబంధం వేసి ఉంటడం. నాగబంధం వేసి ఉండటంతో గదిని తెవరడం సాధ్యం కాదని ఆలయ పండితులు చెప్తున్నారు.

ఆ గదిలో మిగిలిన ఐదు గదుల్లో ఉన్నదానికంటే ఎక్కువ సంపద ఉందని అంతా అనుకుంటున్నారు. కానీ కొంత మంది మాత్రం ఆ గదిలో బంగారం, వజ్రాలను మించిన ఏదో రహస్యం ఉందని భావిస్తున్నారు. విలువైన సంపద ఉన్న గదికి కూడా నాగబంధం వేయకుండా కేవలం ఆ గదికి మాత్రమే నాగబంధం వేశారంటే అక్కడ ఉన్న విషయమేంటనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.