Cases on Kovishield : కోవీషీల్డ్ పై సుప్రీంకోర్టుకు… హైదరాబాద్, ఢిల్లీలో బాధితులు
కోవిషీల్డ్ టీకా (Covishield vaccine) వేయించుకున్న కొందరిలో సైడ్ ఎఫెక్ట్స్ (side effects) వస్తాయన్న ఆస్ట్రాజెనెకా ప్రకటనతో భారత్ లోనూ బెంబేలెత్తుతున్నారు. ఇప్పటి బ్రిటన్ (Britain) లో ఆస్ట్రాజెనెకా కంపెనీపై కోర్టుకు ఎక్కారు బాధితులు. ఇప్పుడు ఇండియాలోనూ ఆ కంపెనీతో పాటు సీరమ్ పైనా కేసులు వేయాలని నిర్ణయించారు.

To the Supreme Court on Kovishield... Hyderabad and Delhi victims
కోవిషీల్డ్ టీకా (Covishield vaccine) వేయించుకున్న కొందరిలో సైడ్ ఎఫెక్ట్స్ (side effects) వస్తాయన్న ఆస్ట్రాజెనెకా ప్రకటనతో భారత్ లోనూ బెంబేలెత్తుతున్నారు. ఇప్పటి బ్రిటన్ (Britain) లో ఆస్ట్రాజెనెకా కంపెనీపై కోర్టుకు ఎక్కారు బాధితులు. ఇప్పుడు ఇండియాలోనూ ఆ కంపెనీతో పాటు సీరమ్ పైనా కేసులు వేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో బాధితుల ఉద్యమం మొదలైంది. 2021 జూన్ లో ఢిల్లీకి చెందిన డేటా సైన్స్ స్టూడెంట్ కారుణ్య(20) చనిపోయింది. ఆమె టీకా తీసుకున్న 8 రోజులకే అనారోగ్యం పాలైంది.
ఆ తర్వాత నెల రోజుల తర్వాత 2021 జులైలో కారుణ్య మరణించింది. టీకా తీసుకోకముందు ఎలాంటి అనారోగ్య సమస్య లేదు. పూర్తిగా ఆరోగ్యంగా ఉన్న నా కూతురు కేవలం కోవిషీల్డ్ టీకా తీసుకోవడం వల్లే చనిపోయింది అంటూ కారుణ్య తండ్రి వేణుగోపాలన్ గోవిందన్ వాదిస్తున్నారు. తన కూతురు చనిపోయినప్పటి నుంచీ ఆయన సోషల్ మీడియాలో కోవీ షీల్డ్ అనర్థాలపై ప్రచారం చేస్తున్నారు. అప్పట్లోనే ఆయన సుప్రీంకోర్టు దాకా న్యాయపోరాటం చేసినా ఎలాంటి రిలీఫ్ దక్కలేదు.
కోవీ షీల్డ్ బాధితుల్లో హైదరాబాద్ కు చెందిన ఓ అమ్మాయి కూడా ఉంది. 2021మేలో కోవీషీల్డ్ మొదటి డోసు తీసుకుంది హైదరాబాద్ కు చెందిన రితైకా శ్రీ ఓంత్రీ (18). ఆ తర్వాత ఐదు రోజులకి జ్వరం వచ్చింది. MRI స్కానింగ్ తీయించగా… ఆమె మెదడులో రక్తం గడ్డకట్టినట్టు డాక్టర్లు తెలిపారు. రితైకా కూడా చనిపోయింది. దాంతో 2021లో గోవిందన్ తో కలసి రితైకా తల్లి రచనా గంగు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టుకు..
ఇప్పుడు కోవీ షీల్డ్ లో లోపాలు ఉన్నట్టు ఆస్ట్రాజెనికా స్వయంగా ఒప్పుకోవడంతో… ఆ కంపెనీతో పాటు భారత్ కు చెందిన సీరమ్ సంస్థపైనా మళ్ళీ కోర్టుకు ఎక్కాలని నిర్ణయించారు. మళ్ళీ న్యాయపోరాటం చేయాలని ఏడు కుటుంబాలు డిసైడ్ అయ్యాయి. సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని గుర్తించినప్పుడే కోవిషీల్డ్ జనానికి ఇవ్వడం బంద్ చేస్తే బాగుండేదని అంటున్నారు బాధితులు. ప్రజారోగ్యం పేరుతో మళ్ళీ ఏ కంపెనీ కూడా ఇలాంటి దారుణాలకు పాల్పడకుండా ఉండాలంటే తమకు న్యాయం చేయాలని బాధితులు కోర్టును కోరబోతున్నారు.