Home » Social » Today On The Occasion Of World Dance Day On 29th April Did You Know The Details Of Telanganas Historical Dance Called Ayokka Visheshala
Dialtelugu Desk
Posted on: April 29, 2024 | 06:02 PM ⚊ Last Updated on: Apr 29, 2024 | 6:02 PM
నృత్యం భారతదేశ ప్రాచుర్యంలో ఉన్న ఓ అద్భుత కళ
భారతీయ నాట్యం, భారతీయ నృత్యం అని పిలుస్తారు.
దేశ వ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోనూ సాంస్కృతిక నృత్యాలు ఉన్నాయి.
అందులో తెలంగాణ రాష్ట్రానికి ఓ నృత్యం ఉంది.
అదే తెలంగాణ పేరిణి నృత్యం
తెలంగాణలో ఈ నృత్యాన్ని.. పేరిణి శివతాండవం అని అంటారు.
పేరిణి శివ తాండవం అనేది సాధారణంగా కాకతీయ కాలం కనుగొనబడిన అద్భుత కళాఖండం..
కాకతీయ కాలంలో ఎక్కువగా ఈ నృత్యాన్ని మగవారు చేసేవారు అని చరిత్ర చెబుతుంది.
ఈ శివతాండవం ను డాన్స్ ఆఫ్ వారియర్స్ అని కూడా అంటారు.
అంటే యుద్దభూమిలో యుద్ధం ముందు మరియు యుద్ధం తర్వాత శత్రువులతో పోరాడి అలిసిపోయిన సైన్యంకు.. ప్రేరణ.. వీరత్వం.. నింపే నృత్యం.
ఈ నృత్యం ఈ సృష్టికర్త అయిన ఆ మహాదేవుడి విగ్రహం ముందు ఉంచి ఈ పేరణి నాట్యం చేస్తారు.
ఈ నృత్యం ఉద్దేశం ఏమిటంటే.. ఈ నృత్య 'ప్రేరణ' ని ప్రేరేపిస్తుందని అర్థం..
ఈ నృత్యం గురించి వరంగంలోని రామప్ప దేవాలయం గర్భ గుడి కూడా పేరిణి నృత్యం కు సంభందించి 13-14 శతాబ్ధాలోనే చెక్కబడిన శిల్పాల ఉన్నాయి.
పేరిణి నృత్యం చేసేటప్పుడు.. వారికి అనుగుణంగా వాయించే దరువులు మనిషి యొక్క వీరత్వాన్ని పేరేపిస్తాయి.
ఎంతో చరిత్ర ఉన్న ఈ పేరిణి నృత్యం.. కాకతీయ రాజవంశం క్షీణించిన తర్వాత దాదాపు కనుమరుగైంది.
ఆ తర్వాత పేరిణి నృత్యానికి "డాక్టర్ నటరాజ రామకృష్ణ" పునరుజ్జీవం పోశారు.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో అద్భుతమైన ప్రదర్శనలు నిర్వహించారు.
తెలంగాణ గడ్డపై పుట్టిన పేరిణి కళ.. ఇటీవలే వివిధ ఖండాలు, సప్త సముద్రాలు , ఎల్లలు దాటి అమెరికాలో అడుగు పెట్టంది.
న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ (నైట) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం 2024, మార్చి 23 అద్భుతంగా ప్రదర్శన ఇచ్చారు.
ప్రెసిడెంట్ వాణి సింగిరికొండ దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. న్యూయార్క్ నగరంలో హిందూ టెంపుల్ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికా వారి పర్యవేక్షణలోని గణేష్ టెంపుల్ ఆడిటోరియంలో అద్భుతమైన ప్రదర్శన నిర్వహించనున్నారు.
ఈ కళపై శిక్షణ ఇచ్చేందుకు శ్రీ మణిద్వీప ఆర్ట్స్ అకాడమీ నిర్వాహకులు, గురువు పేరణి సందీప్ ఎంతో కాలంగా విశేష సేవలు అందిస్తున్నారు.
ఈ అకాడమీలో శిక్షణ పొందిన పేరిణి కిరణ్, పేరిణి రోహిత్, పేరిణి ఇంద్రజ, పేరిణి అభినయ అద్భుతమైన ప్రదర్శించారు.
ఒకానొక క్షణంలో కనుమరుగైన పేరణి.. నాడు "డాక్టర్ నటరాజ రామకృష్ణ" నేడు గురువు పేరణి సందీప్ వీరి నిరంతర కృషితో నేడు ప్రపంచ దేశాల్లో ప్రదర్శించేలా చేసింది.
మొట్ట మొదటిసారిగా USAలోని New York లో ప్రదర్శించిన బ్యాచ్ గా హైదరాబాద్ నుంచి "గురువు పేరణి సందీప్" రికార్డులో నిలిచారు.