Japan Navy Helicopter crash : జపాన్ సముద్రంలో కుప్పకూలిన ట్రెనీ నేవీ హెలికాప్టర్లు.. ఒకరు మృతి, ఏడుగురు గల్లంతు
అత్యాధునిక టెక్నాలజీతో... ముందున్న జపాన్ (Japan) దేశ సముద్ర తీరంలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం జపాన్ లోని దక్షిణ తీరంలో జలాంతర్గామి వ్యాయామాలు నిర్వహిస్తున్న సమయంలో.. పసిఫిక్‌లోని ఇజు దీవుల (Izu Islands) వద్ద శనివారం రాత్రి హెలికాప్టర్లు కూలిపోయినట్లు బ్రాడ్‌కాస్టర్ NHK నివేదించింది.

Trainee Navy helicopters crash in Sea of Japan.. One dead, seven missing
అత్యాధునిక టెక్నాలజీతో… ముందున్న జపాన్ (Japan) దేశ సముద్ర తీరంలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం జపాన్ లోని దక్షిణ తీరంలో జలాంతర్గామి వ్యాయామాలు నిర్వహిస్తున్న సమయంలో.. పసిఫిక్‌లోని ఇజు దీవుల (Izu Islands) వద్ద శనివారం రాత్రి హెలికాప్టర్లు కూలిపోయినట్లు బ్రాడ్‌కాస్టర్ NHK నివేదించింది. తోరిషిమా ద్వీపం నుండి రాత్రి 10.38 గంటలకు ఒక ఛాపర్‌తో కమ్యూనికేషన్ పోయింది. ఆ తర్వాత ఒకటి రెండు నిమాషాల వ్యవధుల్లో ఆ విమానం నుండి అత్యవసర సిగ్నల్ వచ్చినట్లు నేషనల్ బ్రాడ్‌కాస్టర్ NHK మరియు క్యోడో నివేదించాయి. ఆ విమానానికి దాదాపు 25 నిమిషాల తర్వాత.. అదే ప్రాంతంలో ఇతర విమానాలతో కమ్యూనికేషన్ పోయిందని మిలటరీ గుర్తించింది.
దీంతో ట్రెనీ హెలికాప్టర్లు (Trainee Helicopters) శనివారం 10: 38 గం. నిమిషాల మంధ్య నుంచి 11:00 గంటల సమయంలో ఒకదానికొకటి ఢీకొని ప్రమాదం జరిగిందని.. జపాన్ దేశ రక్షణ మంత్రి కిహారా మినోరు ఆదివారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ఎడుగురు గల్లంతయినట్లు సమాచారు. దీంతో గంలంతైన వారికోసం నేవి సిబ్బంది రెస్క్యూ ఆపరేష్ చేస్తున్నారు.
గతంలో కూడా ఇదే నెలలో (ఏప్రిల్ 2023) లో 10 మందితో ప్రయాణిస్తున్న జపాన్ ఆర్మీ హెలికాప్టర్ దక్షిణ ఒకినావాలోని మియాకో ద్వీపంలో కూలిపోయింది.
SSM