TSPSC: గ్రూప్‌ 2 పరీక్ష మూడోసారి వాయిదా.. మళ్లీ ఈసారి ఎగ్జామ్‌ ఎప్పుడంటే..

జనవరి 6, 7 తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. పరీక్ష తేదీలను తర్వాత వెల్లడిస్తామని టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 28, 2023 | 02:00 PMLast Updated on: Dec 28, 2023 | 2:00 PM

Tspsc Group 2 Exam Postponed Again

TSPSC: తెలంగాణలో గ్రూప్‌ 2 పరీక్ష మరోసారి వాయిదా పడింది. జనవరి 6, 7 తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. పరీక్ష తేదీలను తర్వాత వెల్లడిస్తామని టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసింది. మొత్తం 783 గ్రూప్ 2 పోస్టులకు రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల 51వేల మందికి పైగా అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. నిజానికి గ్రూప్‌ 2 పరీక్ష వాయిదా పడడం ముచ్చటగా మూడోసారి.

Congress Party : కాంగ్రెస్‌లో చేరిక.. మల్కాజ్‌గిరి నుంచి పోటీ ఈటల

ఫస్ట్ రిలీజ్ చేసిన షెడ్యూల్ ప్రకారం.. ఆగస్టు 29, 30 తేదీల్లో పరీక్ష జగరాల్సి ఉండగా.. అప్పుడు వరుసగా ఇతర పోటీ పరీక్షలు ఉండటంతో వాయిదా వేయాలంటూ అభ్యర్థులు, రాజకీయ పార్టీల నేతలు ఆందోళనలకు దిగారు. దీంతో మొదటిసారి వాయిదా పడింది. ఆ తర్వాత నవంబర్ 2, 3 తేదీల్లో పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. దీంతో రెండోసారి కూడా పోస్ట్‌పోన్‌ అయింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డితోపాటు సభ్యులు తమ పదవులకు రాజీనామాలు చేయడం.. వారి రాజీనామాలు గవర్నర్ దగ్గర పెండింగ్ ఉండటం వంటి పరిణామాలతో మరోసారి వాయిదా వేశారు.

ఇక అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా గ్రూప్ 2 పరీక్ష నిర్వహణపై రియాక్ట్ అయ్యారు. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల రాజీనామాలు గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉన్నాయని.. రెండు మూడు రోజుల్లో వాటిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. ఆయన ఆ మాట అన్న రాత్రే.. టీఎస్పీఎస్పీ నుంచి ప్రకటన వచ్చింది. ఐతే ఈసారి మాత్రం మళ్లీ తేదీ ప్రకటించలేదు. బోర్డులో ప్రస్తుతం ఉన్న పరిస్థితులతో.. పరీక్ష మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు మాత్రం క్లియర్‌గా కనిపిస్తున్నాయ్.