TSRTC: తెలంగాణ ఆర్టీసీకి ఫుల్ గిరాకీ.. ఆదాయంలో కొత్త రికార్డులు..
మహాలక్ష్మి పథకంతో మహిళలతోనే బస్సులు నిండిపోయి కనిపిస్తున్న పరిస్థితి. సీన్ ఇలా ఉంటే.. రికార్డు ఆదాయం ఎలా అనుకుంటున్నారా.. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. టీఎస్ ఆర్టీసీ ఆదాయం ఆల్‌టైమ్ గరిష్టానికి చేరుకుంది.
TSRTC: మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఫ్రీ బస్సు సేవలు అమలు చేయడం మొదలుపెట్టిన తర్వాత.. ఆర్టీసీ బస్సులో సీట్లు దొరకడం ఇబ్బందిగా మారింది చాలామందికి ! మహిళలతోనే బస్సులు నిండిపోయి కనిపిస్తున్న పరిస్థితి. సీన్ ఇలా ఉంటే.. రికార్డు ఆదాయం ఎలా అనుకుంటున్నారా.. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. టీఎస్ ఆర్టీసీ ఆదాయం ఆల్‌టైమ్ గరిష్టానికి చేరుకుంది.
THEFT PLAN: మీ తెలివి తగలెయ్య.. అనంతపురంలో చోరీ గ్యాంగ్.. వీళ్ల ప్లాన్ చూస్తే మతి పోవాల్సిందే..
ఐతే ఈ ఆదాయం టికెట్ల రూపంలో కనిపిస్తున్నా.. ప్రభుత్వం నుంచి నిధులు తిరిగి వస్తేనే ఆర్టీసీ ఆదాయం చూస్తుందన్నమాట. మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరగడంతో.. ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో భారీగా పెరిగినట్టు చెప్తున్నారు అధికారులు. గణాంకాలు కూడా విడుదల చేశారు. సోమవారం ఒక్కరోజే ఆర్టీసీకి 21 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. మహాలక్ష్మి పథకం.. ఆర్టీసీకి ధనలక్ష్మీగా మారింది. మహిళా ప్రయాణికులతో ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో కాలు పెట్టడానికి కూడా ప్లేస్ లేనంతగా జనాభా నిండిపోతున్నారు. ఈ నెల 9న పథకం ప్రారంభమైన తర్వాత ఈనెల 18న రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 51 లక్షల 74వేల మంది ఆర్టీసీ బస్సులెక్కారు.
వివిధ రకాల బస్ పాసులు ఉన్న వారిని మినహాయిస్తే.. 48లక్షల 50వేల మందికి ఆర్టీసీ టికెట్‌లు జారీ చేసింది. ఇందులో 30 లక్షల 16వేల మంది మహిళలు కాగా.. వారికి జీరో టికెట్‌లు జారీ చేశారు. తెలంగాణలో మహాలక్ష్మి పథకం ప్రారంభానికి ముందు.. మొత్తం ప్రయాణికుల్లో 40 శాతం మాత్రమే మహిళలు ఉండేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 60శాతానికి చేరింది. ఉచిత ప్రయాణాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే రీయింబర్స్‌మెంట్‌తో కలిపితే ఆర్టీసీ ఒకరోజు గరిష్ట ఆదాయం రూ.21 కోట్లకు చేరింది.