YouTuber Nani : విశాఖ ఫైర్ యాక్సిడెంట్ లో ట్విస్ట్ ..! పోలీసులపై కోర్టుకెక్కిన యూట్యూబర్ నాని
విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్రమాదం ఘటనలో తనకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు యూట్యూబర్, లోకల్‌బాయ్ నాని. పైగా పోలీసులపైనే హైకోర్టులో పిటిషన్ వేశాడు. అగ్నిప్రమాదం, బోట్లు తగలబడిన ఘటనలో ఏపీ పోలీసులు అనుమానితుడిగా భావించి నానిపై కేసు నమోదు చేశారు. అయితే విశాఖపట్నం పోలీసులు తనను మూడు రోజులు అక్రమంగా నిర్బంధించారంటూ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ ఫైల్ చేశాడు నాని. ఈ పిటిషన్‌పై హైకోర్టులో వచ్చే సోమవారం విచారణ జరగనుంది.

ఈ నెల 19న అర్ధరాత్రి విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 49 బోట్లు తగలబడ్డాయి. ఈ ఫైర్ యాక్సిడెంట్ లో యూట్యూబర్ లోకల్ బాయ్ నానిని విశాఖ వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి నానియే కారణమని జోరుగా ప్రచారం జరిగింది. అతను మూడు రోజుల పాటు పోలీసుల అదుపులోనే ఉన్నాడు. అయితే నానిని అక్రమంగా పోలీసులు నిర్భంధించారని అతని ఫ్రెండ్స్ హైకోర్టులో పిటిషన్ వేశారు. తర్వాత పోలీసులు నానిని రిలీజ్ చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేశారని అంటున్నాడు యూట్యూబర్. విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాదంలో తాను ఏ తప్పూ చేయలేదనీ.. ఆ టైమ్ లో వేరే ప్లేస్ లో ఉన్నాను.. నా ఫ్రెండ్స్ కు పార్టీ ఇస్తున్నాని చెప్పాడు. రాత్రి 11.45కి బోట్లు తగలబడుతున్నట్టు ఫోన్ కాల్ వచ్చింది. వెంటనే వన్ టౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా హార్బర్ కు వెళ్లాను.. నేను వెళ్ళే సమయానికి బోట్లు తగలబడుతున్నాయి
అప్పటికే మద్యం తాగే ఉన్నా. ప్రభుత్వానికి విషయం చెప్పడానికే ప్రమాదాన్ని వీడియో తీశానని అంటున్నాడు యూట్యూబర్ నాని. తాను హార్బర్ కు వెళ్ళేదంతా సీసీ టీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయిందని తెలిపాడు. తనను అక్రమంగా నిర్బంధించారని హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడంతో.. విశాఖ పోలీసులు చిక్కుల్లో పడ్డారు. ఈ ప్రమాదంలో 49 బోట్లు తగలబడ్డాయి. ఇప్పటికే బోట్ల యజమానులకు పరిహారం పంపిణీ చేసింది ఏపీ ప్రభుత్వం.. 49 బోట్లకు రూ.7.11 కోట్ల ప్రత్యేక ఆర్థిక సాయాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. మత్స్యకారులకు మంత్రులు సీదిరి అప్పలరాజు, గుడివాడ అమర్నాథ్.. పరిహారాన్ని బాధితులకు అందించారు.