TRAIN ACCIDENT : అసలేం జరిగింది? విజయనగరం రైలు ప్రమాదం.. అసలు కారణం ఇదేనా..?
తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడేలా చేసిన విజయనగరం రైలు ప్రమాద ఘటనపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ ప్రమాదానికి సిగ్నలింగ్ వ్యవస్థ ఫెయిల్ అవ్వడం కారణమా.. లేక మానవ తప్పిదం ఉందా అనేది అంతుచిక్కని పరిస్థితి నెలకొంది.

Two trains can travel on the same track. If the loco pilots had been vigilant in observing the signals, wouldn't there have been any accident?
తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడేలా చేసిన విజయనగరం రైలు ప్రమాద ఘటనపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ ప్రమాదానికి సిగ్నలింగ్ వ్యవస్థ ఫెయిల్ అవ్వడం కారణమా.. లేక మానవ తప్పిదం ఉందా అనేది అంతుచిక్కని పరిస్థితి నెలకొంది. రాయగడ ప్యాసింజర్ లోకో పైలెట్, అసిస్టెంట్ లోకో పైలెట్ ఇద్దరూ ప్రమాదంలో చనిపోవడంతో.. అసలు ప్రమాద సమయంలో ఏం జరిగింది అనేది పెద్ద క్వశ్చన్‌గా మారింది. నిజానికి ప్రమాదం జరిగిన కంటకాపల్లి-అలమండ మార్గంలో ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ ఉంది.
దీని కారణంగా ఒకే ట్రాక్‌లో రెండు రైళ్లు ప్రయాణం చేసే వీలుంటుంది. సిగ్నల్స్‌ను గమనిస్తూ లోకో పైలెట్లు అప్రమత్తంగా ఉంటే ఎలాంటి ప్రమాదం జరిగేది కాదనే అభిప్రయాలు వినిపిస్తున్నాయి. కానీ పలాస ప్యాసింజర్ కంటకాపల్లి దాటిన వెంటనే టెక్నికల్ లోపంతో మధ్యలోనే ఆగిపోయింది. అప్పటికే గ్రీన్ సిగ్నల్ రావడంతో వెనకే వచ్చిన రాయగడ ప్యాసింజర్ ఆగి ఉన్న ట్రైన్ ఢీ కొట్టి ప్రమాదం జరిగింది. నిజానికి ముందు ట్రైన్ ఆగి ఉంటే మధ్యలో ఉన్న సిగ్నల్స్ రెడ్ లైట్స్ చూపించాలి. కానీ ఇక్కడ అలా జరగలేదు. సిగ్నల్‌లో తప్పిదాలు కనిపిస్తే ట్రైన్ స్పీడ్‌ను లోకో పైలట్ తగ్గించాలి. కానీ రాయగడ ట్రైన్ లోకో పైలట్ ఆ పని చేయలేదు. ప్రమాద సమయంలో ట్రైన్ స్పీడ్ 80 కిలోమీటర్లు ఉన్నట్టు రికార్డ్స్ చెప్తున్నాయి. దీంతో ఇది ఎవరి తప్పో తేల్చలేకపోతున్నారు నిపుణులు. ఆటోమేటిక్ బ్లాకింగ్ సిస్టం ఉన్నా అది ఎందుకు పని చేయలేదు.. ప్రమాదం ఎలా జరిగింది అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.