China unemployment: సాంకేతికతలోనే కాదు.. యువ నిరుద్యోగుల రేటు లోనూ అగ్రస్థానంలో చైనా..

చైనా అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఎలక్ట్రానిక్ వస్తువులు, కానీ కోవిడ్ గా ఆ నానుడి కాస్త మారిపోయింది. చైనా అంటే కరోనా అనేలా ప్రసిద్ధికెక్కింది. దీనికి కారణం ప్రపంచదేశాలన్నింటినీ వణికించిన వైరస్ అని చెప్పాలి. ఇదిలా ఉంటే గతంలో యువకుల సంఖ్య బాగా తగ్గిందనే వార్తలు విన్నాం. అలాగే వృద్దుల రేటు విపరీతంగా పెరిగిందని తెలుసుకున్నాం. కానీ తాజాగా వీటన్నింటికీ భిన్నంగా యువ నిరుద్యోగుల రేటు కూడా పెరిగిపోయింది. జనాభా నుంచి ఉత్పత్తి రంగం వరకూ అన్నింటా అగ్రగామిగా నిలిచిన దేశం చైనా. ఇది ఒకప్పటి మాట. కానీ ఇప్పడు తన లైప్ స్టైల్ ను మార్చుకుంటుంది అని చెప్పాలి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 30, 2023 | 08:08 PMLast Updated on: May 30, 2023 | 8:08 PM

Un Employeement Rate Top In China

సాధారణంగా డ్రాగన్ దేశానికి ఎదురేలేదని ప్రపంచ దేశాలన్నింటిలో తన పాత్ర ఉంటుందని చెప్తూ ఉంటారు. ఈ మాటలు నిరుద్యోగం విన్నట్లుంది. నేను కూడా దూసుకుపోవాలనుకుందేమో. అందుకే యువ నిరుద్యోగం రేటులో రికార్డ్ స్థాయిలో దూసుకెళ్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా యంగ్ అన్ ఎంప్లాయిమెంట్ రేటు పెరిగిపోయింది. తాజాగా 20.4 శాతంగా నమోదైనట్లు అక్కడి ప్రదాన స్రవంతి మీడియా సంస్థలు తెలుపుతున్నాయి.

ఇప్పుడున్న చైనా జనాభాలో ఎక్కువ శాతం ముసలి వాళ్లు ఉన్నారు. వీరు కాకుండా కొంతో గొప్పో చదువుతున్న యువకులు, విద్య పూర్తి చేసి పట్టభద్రులు అయిన వారు కూడా అక్కడక్కడా కనిపిస్తారు. ఇక్కడ గమనించాల్సిన ముఖ్య అంశం ఏమిటంటే అర కొరగా ఉన్న యువకులకే ఉద్యోగాలు అందని పరిస్థితి ఈ దేశంలో తలెత్తిందని చెప్పాలి. తాజాగా చైనా అకాడమీ ఆఫ్ లేబర్ అండ్ సోషల్ సెక్యూరిటీ అనే సంస్ధ ఒక నివేదికను వెల్లడించింది. అందులో కీలకమైన పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2018లో నిరుద్యోగ యువత రేటు 11.2 శాతంగా ఉండేదట. తాజాగా మార్చిలో నిర్వహించిన సర్వేలో 19.6గా నమోదు కాగా.. ప్రస్తుతం దీని రేటు 20.4 గరిష్ట స్థాయికి చేరుకుంది.

ఇది గత మూడు నెలల క్రితం చేసిన సర్వే రిపోర్టు మాత్రమే. రానున్న నెల రోజుల్లో విద్యా సంవత్సరం పూర్తి చేసుకొని డిగ్రీ పట్టా పొందేవారిని లెక్కలోకి తీసుకోలేదు. ఇక వీరు తమ గ్రాడ్యుయేషన్ తరువాత ఉద్యోగ నిమిత్తం ఉపాధి కోసం మార్కెట్లోకి వస్తే దీని రేటు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇలా నిరుద్యోగ యువత పెరిపోవడానికి కారణాలు మన్నటి వరకూ కోవిడ్ ఆంక్షలతో అడుగు బయటపెట్టలేదు. అలాగే చదువుకున్నచదువుకు ఇచ్చే జీతానికి పొంతన కుదరక కొందరు పని చేయడానికి మక్కువ చూపడం లేదు. పోనీ తక్కువ చదుకు ఉన్న వారిని పనిలోకి తీసుకునేందుకు సంస్థలు అంగీకరించడం లేదు. దీనికి  గల కారణం వీరిలో పని నైపుణ్యం తక్కువగా ఉండటమే అంటున్నారు కొందరు నిపుణులు.

ప్రపంచ దేశాలన్నింటిలో పోలిస్తే చైనాలో నిరుద్యోగ యువత రేటు అధికంగా ఉన్నట్లు తెలుస్తుంది. మన దేశంలో 2023 ఏప్రిల్ నాటికి 8.11 శాతం ఉన్నట్లు సెంటర్ ఆఫ్ మానిటరింగ్ ఇండియా ఎకానమీ అనే సంస్థ వెల్లడించింది. అమెరికాలో 2020 కరోనా సమయంలో 27.4 శాతం ఉండగా 2021 నాటికి 9.95 శాతానికి చేరుకుంది. అలాగే 2022 కు వచ్చే సరికి నిరుద్యోగ రేటు 8.1 కాగా 2023 ఏప్రిల్ నాటికి 6.5 శాతంగా కొనసాగుతోంది. ఇదే విధంగా హాంకాంగ్, జర్మనీ, దక్షిణ కొరియా, జపాన్ దేశాల్లో యువకుల నిరుద్యోగ రేటు సగటున 7 శాతంగా ఉన్నట్లు తెలుస్తుంది.

ఏది ఏమైనా చైనా లో ఇటీవలె కాలంలో జనాభా మాత్రమే తగ్గింది. మిగిలిన సమస్యలన్నీ పెరుగుతూనే ఉన్నాయని నివేదికల ఆధారంగా చెప్పవచ్చు.

T.V.SRIKAR