శ్రీకృష్ణుడి గురించి ఎవరికీ తెలియని సమాచారం.. చూసినా చాలు.. వేయేళ్ల పుణ్యం..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 26, 2024 | 06:44 PMLast Updated on: Aug 26, 2024 | 6:44 PM

Unknown Information About Lord Krishna

ఎలా బతకాలో.. ఎందుకు బతకాలో.. బతుకు కోసం అయినా, భవిష్యత్ కోసం అయినా.. పోరాటం ఏంటో చెప్పిన దేవుడు కృష్ణుడు. ఇద్దరు తల్లులు గర్వించే కొడుకు.. ఓ అన్నకు మంచి తమ్ముడు.. పాండవులను దిశానిర్దేశం చేసిన మురళీధరుడు. కృష్ణుడి జీవితం.. మానవాళికి ఓ పాఠం. అలాంటి శ్రీకృష్ణుడి మహిమలు.. ఎన్ని విన్నా.. ఎన్నిసార్లు విన్నా.. వేయి జన్మల పుణ్యమే! మథురలో కన్నయ్యలా.. ఒడిశాలో జగన్నాథుడిలా.. మహారాష్ట్రలో విఠలుడిగా.. రాజస్థాన్‌లో శ్రీనాధుడిగా.. గుజరాత్‌లో ద్వారకాదీసుడిగా.. ఉడిపిలో కృష్ణుడిగా.. పేరు ఏదైనా ఆ దైవం… సమస్త మానవాళికి ధైర్యం. 5వేల 252 సంవత్సరాల కింద శ్రీకృష్ణుడు జన్మించాడు. ప్రస్తుత కాలమానం ప్రకారం 3228 BC సంవత్సరం.. 7వ నెల 18వ తేదీన.. శ్రావణమాసం, అష్టమి తిధి, రోహిణీ నక్షత్రం.. బుధవారం రాత్రి సరిగ్గా 12 గంటలకు కన్నయ్య పుట్టాడు. 125 ఏళ్ల 8నెలల 7రోజులు శ్రీకృష్ణుడు ఈ భూమి మీద ఉన్నాడు. 3వేల 102 BC.. రెండవ నెల.. 18వ తేదీన శ్రీకృష్ణ ప్రభు నిర్యాణం చెందారు. శ్రీకృష్ణుని 89వ యేట కురుక్షేత్ర యుద్ధం జరిగింది. కురుక్షేత్ర యుద్ధం జరిగిన 36 సంవత్సరాల తర్వాత.. కన్నయ్య తన అవతారం చాలించాడు. శ్రీకృష్ణుడికి జన్మనిచ్చిన దేవకీ వసుదేవులు జన్మనిచ్చారు. యశోదా, నందుడు.. శ్రీకృష్ణుడిని పెంచిన తల్లిదండ్రులు. సోదరుడు బలరాముడు, సోదరి సుభద్ర. కన్నయ్య జన్మ స్థలం మథుర. శ్రీకృష్ణుడుకి రుక్మిణీ, సత్యభామ, జాంబవతీ, కాళింది, మిత్రవింద, నగ్నజితి, భద్ర, లక్ష్మణ.. అని ఏడుగురు భార్యలు. శ్రీకృష్ణుడు తన పూర్తి అవతారంలో కేవలం నలుగురిని మాత్రమే చంపేశాడు. చాణుర, కంసుడు, శిశుపాలుడు, దంతవక్ర మాత్రమే కృష్ణయ్య చేతిలో ప్రాణాలు విడిచారు. శ్రీకృష్ణుడి జీవితమంతా కష్టాలమయమే. కష్టంలో ఎలా ఉండాలో.. నిజమైన సుఖం అంటే ఏంటో.. కన్నయ్య జీవితం ప్రతీ ఒక్కరికి పాఠం అయింది అందుకే. శ్రీ కృష్ణుడు దట్టమైన నీలపు రంగు శరీరముతో పుట్టాడు. గోకులమంతా నల్లనయ్య, కన్నయ్య అని పిలిచేవారు. నల్లగా పొట్టిగా ఉన్నాడని.. పెంచుకున్నారని ఆటపట్టిస్తూ.. శ్రీకృష్ణుడిని అవమానిస్తూ ఉండేవారు. తన బాల్యమంతా జీవన్మరణ పోరాటాలతో సాగింది. కరువు, అడవి తోడేళ్లు ముప్పుతో 9ఏళ్ల వయసులో… శ్రీకృష్ణుడు గోకులం నుంచి బృందావనంకి మారాల్సి వచ్చింది. 14 నుంచి 16 ఏళ్ల వయసు వరకు బృందావనంలోనే ఉన్నాడు. ఆ వయసులోనే తన సొంత మేనమామ కంసుడిని మధురలో చంపి.. కన్న తల్లిదండ్రులకు చెరసాల నుంచి విముక్తి కలిగించాడు. ఆ తర్వాత ఎప్పుడూ మళ్లీ బృందావనానికి తిరిగి రాలేదు. కాలయవన అనే సింధు రాజు నుంచి ఉన్న ముప్పుతో.. మధుర నుంచి ద్వారకకి వలస వెళ్లాల్సి వచ్చింది. వైనతేయ తెగకు చెందిన ఆటవికుల సాయంతో.. జరాసంధుడిని గోమంతక కొండ అంటే ఇప్పటి గోవా దగ్గర ఓడించాడు. శ్రీకృష్ణుడు ద్వారకాను పునర్ నిర్మించాడు. విద్యాభ్యాసం కొరకు 16, 18 ఏళ్ల వయసులో ఉజ్జయినిలోని సాందీపని అశ్రమంకు వెళ్లాడు. గుజరాత్‌లో ప్రభాస అను సముద్రతీరం దగ్గర.. ఆఫ్రికా సముద్రపు దొంగలతో యుద్ధం చేసి అపహరణకు గురైన తన ఆచార్యుని కుమారుడగు పునర్దత్తను కాపాడాడు. తన విద్యాభ్యాసం తర్వాత.. పాండవుల వనవాసం గురించి తెలుసుకొని.. వారిని లక్క ఇంటి నుంచి కాపాడి… ఆ తర్వాత తన సోదరి ద్రౌపదిని పాండవులకు ఇచ్చి పెళ్లి చేశాడు. ద్రౌపది స్వయంవరంలో కృష్ణుడు క్రీయాశీలకంగా వ్యవహరించాడు. ఆ తర్వాత కౌరవులతో జూదంలో పాండవులు ఓడిపోయినప్పుడు.. ద్రౌపదిని వస్త్రాపహరణం నుంచి కాపాడాడు కన్నయ్య. ఆ తర్వాతం పాండవులను రాజ్యం నుంచి వెళ్లగొట్టినప్పుడు.. వారికి తోడుగా నిలిచాడు. పాండవుల పక్షపాతిగా ఉండి.. కురుక్షేత్రంలో విజయం దక్కేలా చేశాడు. ప్రత్యక్షంగా యుద్ధం చేయకపోయినా.. అర్జునుడికి రథసారధిగా ఉండి.. పాండవుల విజయంలో కీలక పాత్ర పోషించాడు కృష్ణయ్య. ఆ తర్వాత తాను ఎంతో ముచ్చటగా నిర్మించుకున్న ద్వారకా నగరం నీట మునిగిపోవుట స్వయంగా చూశాడు. అడవిలో జర అను వేటగాడి చేతిలో అవతారం చాలించాడు. ఒక్కటి చెప్పాలంటే.. శ్రీకృష్ణుడి జీవితం విజయవంతం ఏమీ కాదు. జీవితములో ఒక్క క్షణం కూడా.. ఎలాంటి సంఘర్షణ లేకుండా ప్రశాంతముగా గడిపినది లేదు ఆయన. జీవితపు ప్రతీ మలుపులో కష్టాలే. ప్రతీ వ్యక్తిని, ప్రతీ విషయాన్ని బాధ్యతతో ఎదుర్కొని… చివరకు దేనికి, ఎవరికీ అంకితమవ్వలేదు.
అతను గతాన్ని, భవిష్యత్తును కూడా తెలుసుకోగల సమర్థుడు. అయినా ఎప్పుడూ వర్తమానములోనే బ్రతికాడు. శ్రీకృష్ణుడు ఇంకా అతని జీవితము మానవాళికి ఒక నిజమైన ఉదాహరణ.