H1B VISAS: యూఎస్ 20 వేల వీసాల జాతర.. భారతీయులకు ఇక పండగే
అమెరికాలో ఇప్పటికే H1B వర్క్ వీసా మీద పనిచేస్తూ దాన్ని పొడిగించుకోవాలని అనుకునేవారికి అమెరికా విదేశాంగ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. దాదాపు 20 వేల వర్క్ వీసాల గడువును 2024 జనవరిలో పొడిగిస్తామంటోంది. అందుకోసం వీసాదారులు విదేశాంగ శాఖకు మెయిల్ ద్వారా అప్లయ్ చేయాలని సూచించింది.
H1B VISAS: అమెరికాలో మరోసారి వీసాల జాతర మొదలవుతోంది. వచ్చే ఏడాది జనవరిలో దాదాపు 20 వేల H1B వీసాలను రెన్యువల్ చేయాలని అమెరికా విదేశాంగ శాఖ నిర్ణయించింది. ఇందులో భారతీయ నిపుణులకే ఎక్కువ దక్కే ఛాన్సుందని యూఎస్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే అమెరికాలో నివసిస్తున్న ఇండియన్ ఐటీ నిపుణులు తమ H1B వీసాలను పొడిగించుకునే అవకాశం కలుగుతుంది. అమెరికాలో ఇప్పటికే H1B వర్క్ వీసా మీద పనిచేస్తూ దాన్ని పొడిగించుకోవాలని అనుకునేవారికి అమెరికా విదేశాంగ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది.
Koushik Reddy : కౌశిక్ రెడ్డి బ్లాక్ మెయిల్ పై ఈసీ విచారణ:
దాదాపు 20 వేల వర్క్ వీసాల గడువును 2024 జనవరిలో పొడిగిస్తామంటోంది. అందుకోసం వీసాదారులు విదేశాంగ శాఖకు మెయిల్ ద్వారా అప్లయ్ చేయాలని సూచించింది. అప్పటి వరకూ వాళ్ళు అమెరికా దాటి వెళ్ళకూడదని షరతు పెట్టింది. ఈ 20వేల H1B వీసాలను ఎలా రెన్యువల్ చేస్తారు.. ఎవరివి పొడిగిస్తారు.. లాంటి విధి విధానాలను వచ్చే డిసెంబర్ లో అమెరికా విదేశాంగశాఖ ప్రకటించనుంది. గత ఏడాది జూన్‌లో ప్రధాని నరేంద్రమోడీ అమెరికాలో పర్యటించారు. ఈ సందర్భంగా భారతీయులకు వీసాల జారీపై అధ్యక్షుడు జో బైడెన్ తో మాట్లాడారు. అందువల్ల ఇండియన్ ఐటీ పీపుల్ కే ఎక్కువ ప్రయోజనం కలిగే అవకాశాలు ఉన్నాయి. అమెరికాలో నివసిస్తున్న విదేశీ ఐటీ నిపుణుల్లో భారతీయులే ఎక్కువమంది ఉన్నారని అక్కడి అధికారులు చెబుతున్నారు.
ఈ వీసాల రెన్యువల్స్ వల్ల.. ఇప్పటికే యూఎస్‌లో పనిచేస్తున్న భారతీయులకు గడువులోగా రెన్యువల్స్ అయితే వాళళు తిరిగి ఇండియాకి వచ్చే అవకాశం తప్పుతుంది. పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఈ 20 వేల వీసాల రెన్యువల్ ప్రోగ్రామ్ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి దాకా కొనసాగే అవకాశముంది. బైడెన్ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తున్నాయి అక్కడి అమెరికా బిజినెస్ ఫోరమ్స్. ఈ కార్యక్రమంతో మరింతమంది నిపుణులు అందుబాటులోకి వస్తారని చెబుతున్నారు.