Vijay Antony: మనసు బాగోలేదా.. వీళ్లకు కాల్ చేసి మీ బాధ చెప్పుకోండి..
ఉదయం లేవగానే తాను మీరా మరణ వార్తే విన్నానని.. విజయ్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నాని చెప్పింది. ఆత్మహత్య లాంటి ఆలోచనలు ఎవరూ చేయొద్దని, అలాంటి ఆలోచనలు వస్తే కాల్ చేసి మీ బాధ చెప్పేందుకు ఓ టోల్ ఫ్రీ నెంబర్ ఉందంటూ చెప్పింది.

Vijay Antony: తమిళ హీరో విజయ్ ఆంటోనీ కూతురు మీరా ఆంటోని మరణం సినీ ఇండస్ట్రీలో అందరినీ షాక్‌కు గురి చేసింది. చదువులో వెనకబడి ఉన్నానన్న బెంగతో, డిప్రెషన్‌కు గురైన మీరా ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మీరా కొంతకాలంగా డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. కాగా, మీరా మృతిపై తెలుగు యాంకర్ సుమ స్పందించింది.
మీరా మరణం తనను ఎంతగానో కలచివేసిందని చెప్పింది సుమ. ఉదయం లేవగానే తాను మీరా మరణ వార్తే విన్నానని.. విజయ్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నాని చెప్పింది. ఆత్మహత్య లాంటి ఆలోచనలు ఎవరూ చేయొద్దని, అలాంటి ఆలోచనలు వస్తే కాల్ చేసి మీ బాధ చెప్పేందుకు ఓ టోల్ ఫ్రీ నెంబర్ ఉందంటూ చెప్పింది. 1800891114416 టోల్‌ఫ్రీ నెంబర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఎంతటి బాధైనా పక్కవాళ్లతో షేర్ చేసుకుంటే తగ్గుతుందని.. అలా బాధను షేర్ చేసుకునేందుకే ఈ టోల్‌ఫ్రీ నెంబర్ అంటూ చెప్పుకొచ్చింది.
జీవితంలో పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కాస్త ఓపిక పడితే అంతా మారిపోతుంది. ప్రతీ కష్టాన్ని ఎదుర్కోవాలి. కానీ చిన్న చిన్న విషయాలకు ఆశ కోల్పోయి ఆత్మహత్యలు చేసుకోవద్దంటూ చెప్పింది సుమ.