వర్జినిటీ ఫర్ సేల్ డబ్బు ఉన్నవాళ్లు తీసుకోవచ్చు…
ప్రతీ మహిళ జీవితంలో కన్యత్వానికి ఎలాంటి ప్రధాన్యత ఉంటుందో సపరేట్‌గా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా స్త్రీలకు కన్యత్వం విలువైనదిగా పరిగణించబడింది.

ప్రతీ మహిళ జీవితంలో కన్యత్వానికి ఎలాంటి ప్రధాన్యత ఉంటుందో సపరేట్‌గా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా స్త్రీలకు కన్యత్వం విలువైనదిగా పరిగణించబడింది. ఇది స్వచ్ఛత , గౌరవానికి చిహ్నంగా సమాజంలో చూడబడుతోంది. అయితే, ఆధునిక సమాజంలో, కన్యత్వం గురించిన అభిప్రాయాలు మారుతున్నాయి. ఇది వ్యక్తిగత ఎంపిక, స్వీయ నిర్ణయాధికారానికి సంబంధించిన విషయంగా ఎక్కువగా పరిగణించబడుతుంది. కన్యత్వం అనేది కేవలం సెక్స్‌కి సంబంధించిన విషయం మాత్రమే కాదని, ఇతర లైంగిక కార్యకలాపాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని ఆధునిక భావనలు తెలియచేస్తున్నాయి. మారుతున్న సమాజంతో పాటు, అమ్మాయిల అభిరుచులు కూడా మారుతున్నాయి. నేటి సమాజంలో కన్యత్వానికి పెద్దగా ప్రాధాన్యత లేదనేది అంతా ఒప్పుకుని తీరాల్సిన నమ్మలేని నిజం. ఇలాంటి సమయంలో ఓ యువతి చేసిన పని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
ఓ యువతి ఏకంగా తన కన్యత్వాన్ని ఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టింది. యూకేలోని మాంచెస్టర్ కు చెందిన 22 ఏళ్ల లారా.. తన కన్యత్వాన్ని ఆన్ లైన్ వేలానికి ఉంచింది. ఆమెను దక్కించుకోవడానికి కోటీశ్వరులు పోటీ పడ్డారు. చివరకు ఓ హాలీవుడ్ స్టార్ 1.7 మిలియన్స్ అంటే మన కరెన్సీలో దాదాపు 18 కోట్లకు ఆ అమ్మాయి కన్యాత్వాన్ని దక్కించుకున్నాడు. ఎస్కార్ట్ ఏజెన్సీ వెబ్ సైట్ వేదికగా బిడ్డింగ్ ప్రక్రియను నిర్వహించింది లారా. షుగర్ వుమెన్‌గా మారి నెలకు 3 కోట్లు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు లారా చెప్తోంది. “ఇది నా శరీరం, అలాగే నేను ఒక స్వతంత్ర మహిళను. నాకు చట్టపరమైన వయస్సు కూడా ఉంది. చాలా మంది అమ్మాయిలు ప్రతిఫలంగా ఏమీ పొందకుండానే తన కన్యత్వాన్ని కోల్పోతున్నారు. కానీ నేను మాత్రం నా లైఫ్ సెటిల్ చేసుకోవడం కోసం నా కన్యత్వాన్ని వేలం పాట వేయాలని భావించాను.
ఇలా వచ్చిన డబ్బుతో ఆర్థికంగా సెటిల్ అవుతానని చెప్తోంది లారా. కన్యత్వాన్ని ఇలా అమ్మకానికి పెట్టడం ఇదేమి తొలిసారి కాదు. గతంలో చాలామంది యువతులు తమ వర్జినిటీని వేలం వేయడం జరిగింది. బ్రిటన్ కు చెందిన 24 ఏళ్ల లియా అనే యువతి తన కన్యత్వాన్ని 10 కోట్లకు వేలం వేసింది. అమెరికాకు చెందిన 19 ఏళ్ల గిసెల్లే అనే యువతి తన వర్జినిటీకి 19 కోట్ల 5 లక్షలకు అమ్మేసింది. ఇలా చాలామంది యువతులు తమ కన్యత్వానికి రేటు దక్కించుకున్నారు. అయితే కన్యత్వాన్ని ఇలా వేలం వేయడాన్ని కొందరు తప్పుపడుతున్నారు. జీవిత భాగస్వామితో పంచుకోవాల్సిన కన్యత్వాన్నిఇలా డబ్బు కోసం వేలం వేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి విపరీత చర్యలకు అడ్డుకట్ట వేయకపోతే సమాజంలో నైతిక విలువలు మంటకలుస్తాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.