Putin: పుతిన్‌కి ముచ్చెమటలు పట్టించిన వంటవాడు.. ఆయన బ్యాక్‌డ్రౌండ్ తెలిస్తే దణ్ణం పెడతారు..!
రష్యా అధ్యక్షుడు పుతిన్‌నే భయపెట్టిన మొనగాడు ఎవరో తెలుసా..? ఆయన బ్యాక్‌గ్రౌండ్ తెలుసా..?
రష్యా ప్రెసిడెంట్ పుతిన్ అంటే ప్రపంచం భయపడుతుంది. ఆయనకు చాలా తిక్క అని.. ఆ తిక్కకు లెక్కుండదని అందరికి తెలుసు. తనకు ఎవరు అడ్డొచ్చిన వాళ్ల అంతు చూసేవరకు నిద్రపోడు పుతిన్. ఆఖరికి తనకు రాజకీయ ప్రత్యర్థులు కూడా ఎవరూ ఉండకూడదనే ముర్ఖత్వం ఆయనది. అందుకే ప్రత్యర్థులను జైలు పాలు చేస్తుంటారు. అందుకే పుతిన్ అంటే ఇష్టపడే వాళ్ల కంటే భయపడేవాళ్లే ఎక్కువంటారు. అయితే ఆ భయనికే మీనింగ్ తెలియని వ్యక్తి ఒకడున్నాడు. అతనే వాగ్నర్ గ్రూప్ హెడ్ ప్రిగోజిన్. పుతిన్ రైట్ హ్యాండ్‌గా ఒకప్పుడు ఆఫ్రికా దేశాల్లో చేయకూడని పనులు చేసిన ప్రిగోజిన్ ఏకంగా అధ్యక్షుడికే ఎదురుతిరిగారు. రెండు నగరాలను ఆక్రమించుకోని ఒక్క రోజులోనే వెనక్కి తగ్గారు. అయినా పుతిన్‌కి వెళ్లాల్సిన మెసేజ్ వెళ్లిపోయింది. తలుచుకుంటే ప్రెసిడెంట్ కుర్చీకే ఎసరు పెట్టగలనని నిరూపించాడు ప్రిగోజిన్. ఇంతకీ ఎవరీ ప్రిగోజిన్.. అతని బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ..?
ఓ దొంగ…
చోరీలు చేసుకునే ప్రిగోజిన్ తొమ్మిదేళ్లు జైలు శిక్ష అనుభవించాడు. బయటకు వచ్చిన తర్వాత రోడ్ సైడ్ మాంసం విక్రయాలు జరిపేవాడు. తర్వాత ఓ రెస్టారెంట్‌లో వంటవాడిగా జాయిన్ అయ్యాడు. ఆ రెస్టారెంట్‌కి వచ్చే పుతిన్‌తో పరిచయం ఏర్పడింది. ప్రిగోజిన్‌కి వంటలపై ఉన్న పట్టుతో పుతిన్ అతనికి చాలా దగ్గరయ్యాడు. ఆ తర్వాత ఏకంగా పుతిన్ వ్యక్తిగత వంట మనిషిగా మారిపోయాడు. అధ్యక్ష భవనంలో పుతిన్ ఏం తినలో.. ఏం తినకూడదో ప్రిగోజిన్‌నే నిర్ణయిస్తాడు. అంతేకాదు.. రాజకీయ, యుద్ధ వ్యూహాల్లోనూ ప్రిగోజిన్ చెప్పిందే పుతిన్ వింటారన్న ప్రచారం కూడా ఉంది. రష్యా వెలుపల పుతిన్ సృష్టించిన విధ్వంసల్లో ప్రిగోజిన్‌దే కీలక పాత్ర. అందుకే ప్రిగోజిన్‌కి సపరేటు ఆర్మీ ఉంది. అదే వాగ్నర్ గ్రూప్. ఇప్పుడు యుక్రెయిన్‌లో యుద్ధం చేస్తున్నవారిలో ఎక్కువ మంది వాగ్నర్ గ్రూప్ సభ్యులే ఉన్నారన్న ప్రచారం కూడా ఉంది. అందుకే రష్యా ఆర్మీని చేతగాని సైన్యంగా గతంలో ప్రిగోజిన్ విమర్శలు గుప్పించారు. అదే రష్యా సైన్యంలోని పెద్దలకు కోపం తెప్పించింది.
ప్రిగోజిన్‌ని పక్కన పెట్టేందుకు పుతిన్‌కి రష్యా సైన్యం అబద్దాలతో లేనిపోనివి చెప్పింది. తూర్పు యుక్రెయిన్‌లో వాగ్నర్ గ్రూప్ వీక్‌గా ఉందంటూ కట్టు కథలు చెప్పింది. ప్రిగోజిన్‌కి ఈ కుళ్లు, కుతంత్రాలు భరించలేకపోయాడు. అసలు విషయం బయటపెట్టేశాడు. రష్యా సైన్యం పెద్ద పిరికిపంద ఆర్మీ అని.. వాగ్నర్ గ్రూప్ లేకపోతే పుతిన్ ఎప్పుడో ఓడిపోయేవారంటూ నిజాన్ని కుండబద్దలు కొట్టాడు. ఇదే పుతిన్‌కి కోపానికి ప్రధాన కారణమైంది.అందుకే ప్రిగోజిన్‌ని ప్రాధాన్యతను ఇవ్వడం తగ్గించాడు. ఈ కుళ్లు రాజకీయాలను ఇన్నాళ్లు చూస్తు భరించిన ప్రిగోజిన్ పుతిన్‌పై సమయం చూసి తిరుగుబాటు ఎగరేశాడు. తమ గ్రూప్ తలచుకుంటే ఏదైనా చెయగలదని నిరూపించాడు.