WhatsApp Channels: మరో అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చిన వాట్సాప్‌..

ఈ ఫీచర్‌ ద్వారా మీకు నచ్చిన వ్యక్తులు, సంస్థలను ఫాలో అయ్యి వాట్సాప్‌లోనే ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ తెలుసుకోవచ్చు. అచ్చం ట్విటర్‌, ఇన్‌స్టాలో ఎలాగైతే మనకు నచ్చిన వారిని ఫాలో అవుతున్నామో అలా వాట్సాప్‌లో కూడా ఫాలో కావొచ్చు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 19, 2023 | 05:36 PMLast Updated on: Sep 19, 2023 | 5:36 PM

What Are Whatsapp Channels And How To Join Them Here Is The Details

WhatsApp Channels: ఎప్పుడూ కొత్త అప్‌డేట్స్‌తో యూజర్స్‌ను ఆకట్టుకునే వాట్సాప్‌ ఇప్పుడు కొత్తగా మరో అప్‌డేట్‌తో వచ్చింది. ఇప్పటి వరకూ కేవలం చాటింగ్‌, కాల్స్‌కు మాత్రమే పరిమితమైన వాట్సాప్‌ ఇప్పుడు కొత్తగా ఛానల్స్‌ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. భారత్‌ సహా 150 దేశాల్లో ఈ ఫీచర్‌ను ప్రారంభించినట్లు మెటా తెలిపింది. ఇప్పటికే చాలా మందికి ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ప్రధాని మోదీ కూడా వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అయ్యారు.

త్వరలో మిగిలిన వారికీ రానుంది. ఈ ఫీచర్‌ ద్వారా మీకు నచ్చిన వ్యక్తులు, సంస్థలను ఫాలో అయ్యి వాట్సాప్‌లోనే ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ తెలుసుకోవచ్చు. అచ్చం ట్విటర్‌, ఇన్‌స్టాలో ఎలాగైతే మనకు నచ్చిన వారిని ఫాలో అవుతున్నామో అలా వాట్సాప్‌లో కూడా ఫాలో కావొచ్చు. కావాలనుకుంటే ఈ అప్‌డేట్‌ను ఇతరులతో పంచుకోవచ్చు. యూజర్‌ సెక్యూరిటీలో భాగంగా మన నెంబర్‌ ఇతరులకు కనిపించకుండా ఈ ఫీచర్‌ను డిజైన్‌ చేశారు. వాట్సాప్‌లో మీకు ఛానెల్స్‌ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చి ఉంటే.. స్టేటస్‌ ట్యాబ్‌ ప్లేస్‌లో అప్‌డేట్స్‌ అని కనిపిస్తుంది. అక్కడ పై భాగంలో స్టేటస్‌లు కనిపిస్తాయి. కింద ఛానెల్స్‌ కనిపిస్తాయి. కింద ఫైండ్‌ ఛానెల్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. ఇప్పటికే చాలా ఛానల్స్‌ అందుబాటులోకి కూడా వచ్చేశాయి. పక్కనే ఉన్న ప్లస్‌ సింబల్‌ క్లిక్‌ చేయడం ద్వారా ఛానెల్‌ను ఫాలో అవ్వొచ్చు.

ఛానెల్స్‌ ఆప్షన్‌ ద్వారా వ్యక్తులు సైతం తమ సొంత ఛానెల్‌ను క్రియేట్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం ఛానెల్స్‌ పక్కనే ఉన్న ప్లస్‌ సింబల్‌ క్లిక్‌ చేస్తే క్రియేట్‌ ఛానెల్‌ అనే ఆప్షన్‌ వస్తుంది. తర్వాత డీపీ, ఛానెల్‌ పేరు, ఛానెల్‌ డిస్క్రిప్షన్‌ నింపేసి సింపుల్‌గా ఛానెల్‌ క్రియేట్‌ చేసుకోవచ్చు. మీకు నచ్చిన వారికి ఆ లింక్‌ను షేర్‌ చేయొచ్చు. ఇంకెందుకు లేట్‌.. మీరు కూడా ట్రై చేయండి.