అంతరిక్షంలో పీరియడ్స్ వస్తే ఏం చేస్తారు?
నెలసరి అనేది ప్రతి స్త్రీకి జరిగే సహజ ప్రక్రియ. ప్రతి మహిళ జీవితంలో సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అలాంటిది భూమిని వదిలి అంతరిక్షం వరకు వెళ్లే మహిళల పరిస్థితి ఏంటి ?

నెలసరి అనేది ప్రతి స్త్రీకి జరిగే సహజ ప్రక్రియ. ప్రతి మహిళ జీవితంలో సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అలాంటిది భూమిని వదిలి అంతరిక్షం వరకు వెళ్లే మహిళల పరిస్థితి ఏంటి ? మహిళా వ్యోమగాములు అంతరిక్షంలో పీరియడ్స్ వస్తే ఏం చేస్తారు ? అంతరిక్షంలో నెలసరి వస్తే మహిళలు ఎదుర్కొనే సావాళ్లు ఏంటి ? ఇవి చాలా మందిలో ఉండే డౌట్స్. అంతరిక్ష ప్రయాణ సమయంలో మానవ శరీరంలోని చాలా వ్యవస్థలు ప్రభావితమవుతాయని.. కానీ స్త్రీ ఋతుస్రావం అస్సలు ప్రభావితం కాదు. ఇది భూమిపై జరిగినట్లే అంతరిక్షంలో కూడా జరుగుతుంది. అంతరిక్ష కేంద్రంలో మహిళల పీరియడ్స్‌ను నిర్వహించడానికి మార్గం లేదు.. మానవ వ్యర్థాలను నిర్వహించడానికి అంతరిక్షంలో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో కొన్ని సౌకర్యాలు ఉన్నాయి.. కానీ పీరియడ్స్ సమయంలో రక్తస్రావాన్ని నిర్వహించడానికి ఎటువంటి సౌకర్యం లేదు. అంటే అంతరిక్షంలో చెత్తను నిర్వీర్యం చేస వ్యవస్థ ఉన్నప్పటికీ.. మనిషి రక్తాన్ని నిర్వీర్యం చేసే వ్యవస్థ లేదని తెలుస్తోంది. ఈ స్టేషన్ ఇలాంటివి నిర్వహించడానికి రూపొందించబడలేదంటున్నారు.
ఇక్కడ అతిపెద్ద సమస్య ఏమిటంటే.. పీరియడ్స్ సమయంలో ఉపయోగించే శానిటరీ ప్యాడ్ లు, ట్యాంపన్లు వంటి ఉత్పత్తులను తీసుకెళ్లాలంటే.. వాళ్లను మోసుకెళ్లే మెషీన్ పై అదనపు భారం పడుతుంది. మైక్రోగ్రావిటీలో శానిటరీ ఉత్పత్తులను మార్చుకోవడం మరో ఛాలెంజ్. మూత్రాన్నే రీసైకిల్ చేసుకుని తాగే పరిస్థితులు ఉన్న అంతరిక్షంలో శానిటరీ ఉత్పత్తులు మార్చుకున్న ప్రతిసారీ శుభ్రత విషయంలో సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది. అమెరికన్ అంతరిక్ష సంస్థ నాసాలో.. వ్యోమగాముల అవసరాలు, మిషన్ వ్యవధి, శరీర ధర్మ శాస్త్రాన్ని బట్టి అనేక పరీక్షలు చేయించుకోవలసి ఉంటుంది. చాలా మంది మహిళలు మిషన్ సమయంలో వారి పీరియడ్స్ ఆపడానికి చర్యలు తీసుకుంటారు. పీరియడ్స్ ను ఆపేందుకు గర్భనిరోధక మందులు ఎక్కువగా వాడతారు. మహిళా వ్యోమగాములు అంతరిక్ష ప్రయాణానికి సిద్ధమవుతున్నప్పుడు గర్భనిరోధక మాత్రలను తీసుకుంటారు. దీంతో ఆమె ఋతుచక్రం ఆగిపోతుంది. నివేదిక ప్రకారం.. మహిళా వ్యోమగామికి ఈ మిషన్లు 6 నెలల నుంచి 3 సంవత్సరాల వరకు ఉంటాయి.. అటువంటి పరిస్థితిలో ఎక్కువగా గర్భనిరోధక మాత్రలు తీసుకోవడం వల్ల శరీరానికి చాలా హాని కలుగుతుంది.
అంతరిక్షంలో గర్భనిరోధకాల దీర్ఘకాలిక వినియోగంపై ఇప్పటివరకు ఎటువంటి పరిశోధన జరగలేదు. కానీ భూమిపై అధికంగా గర్భనిరోధక మాత్రలను వినియోగించడం వల్ల శరీరానికి చాలా హానికరం. మహిళా వ్యోమగాములు చెప్పేదేంటంటే, మార్స్ లాంటి యాత్రకు సంవత్సరాలు పట్టేందుకే, 1100 గర్భనిరోధక మాత్రలు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అంతరిక్షంలో శానిటరీ ప్యాడ్ లు పారవేసే మార్గం లేదు.. మహిళా వ్యోమగాములు పీరియడ్స్ సమయంలో శానిటరీ ప్యాడ్‌లు లేదా ట్యాంపన్లను ఉపయోగించినా, వాటిని పారవేసేందుకు లేదా అంతరిక్షంలో కుళ్ళిపోయేలా చేయడానికి మార్గం లేదు. భూమిపై లాగా కాకుండా వీటిని అంతరిక్షంలో చెత్తగా విసిరేయలేము. జీరో గ్రావిటీ ఉన్న అంతరిక్షంలో, మానవ శరీరంలో రక్త ప్రవాహం వ్యతిరేక దిశలో ఉంటుందని నమ్ముతారు, కానీ స్త్రీలలో వారి పీరియడ్స్ సమయంలో ఇది జరగదు. భూమిపై పీరియడ్స్ సమయంలో రక్తస్రావం లాగే అంతరిక్షంలో కూడా అలాగే జరుగుతుంది. దీనికి సంబంధించిన అనేక ఆధారాలు కూడా వెలుగులోకి వచ్చాయి. అందువల్ల, మహిళా వ్యోమగాములకు గర్భనిరోధక మాత్రలు తీసుకోవడం తప్ప అక్కడ వేరే మార్గం లేదు.