20 వేలమందిని మింగేసిన మిస్టరీ ప్లేస్ డెవిల్స్ ట్రయాంగిల్‌లో ఏం జరిగింది?

ఈ భూమ్మీద మోస్ట్ మిస్టీరియస్ ప్లేస్ ఏంది? ఈ ప్రశ్నకు సింపుల్‌గా బెర్ముడా ట్రయాంగిల్ అని చెప్తాం. కానీ, అంతకంటే అంతుచిక్కని ప్రదేశం మరొకటుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 11, 2025 | 02:35 PMLast Updated on: Feb 11, 2025 | 2:35 PM

What Happened In The Mystery Place Devils Triangle That Swallowed 20 Thousand People

ఈ భూమ్మీద మోస్ట్ మిస్టీరియస్ ప్లేస్ ఏంది? ఈ ప్రశ్నకు సింపుల్‌గా బెర్ముడా ట్రయాంగిల్ అని చెప్తాం. కానీ, అంతకంటే అంతుచిక్కని ప్రదేశం మరొకటుంది. దాని పేరు అలస్కా ట్రయాంగిల్..! ఈ ప్లేస్ ఎంత మిస్టీరియస్ అంటే.. అటువైపుగా వెళ్లిన చాలా విమానాలు, నౌకలు తిరిగి రాలేదు. రోజులు, నెలల అన్వేషణ తర్వాత విమాన శకలాలు, మృతదేహాలను గుర్తించడం తప్ప అక్కడ ఏం జరుగుతుందో కూడా ఎవరు గుర్తించలేకపోయారు. తాజాగా మరోసారి అదే సీన్ రిపీట్ అయింది. ఈనెల 6న 10మంది ప్రయాణి కులతో అమెరికాలోని యునలక్లీట్ నుంచి అలస్కా మీదుగా నోమ్ వెళ్తున్న మినీ విమానం రాడార్ నుంచి అదృశ్యం అయింది. తాజాగా ఆ విమానం అలస్కాలోని భారీ మంచుఫలకంపై కూలిపోయి కనిపించింది. అందులో పది మంది ప్రయాణికులూ మరణించినట్టు నిర్ధారించారు. కానీ, ఇప్పుడు కూడా ఆ ప్రమాదానికి సరైన రీజన్ ఏంటో చెప్పలేకపోతున్నారు. ఇంతకూ, 1972 నుంచి అలస్కా ట్రయాంగిల్‌లో అసలేం జరు గుతోంది? ఈ మిస్టరీని సైంటిస్టులు ఎందుకు ఛేదించలేకపోతున్నారు? అలస్కా ట్రయాంగిల్‌లో నిజంగా గ్రహాంతరవాసులున్నారా? ఇవాల్టి టాప్ స్టోరీలో చూద్దాం..

చాలా మంది బెర్ముడా ట్రయాంగిల్‌ పేరు వినే ఉంటారు. దీన్నే డెవిల్స్ ట్రయాంగిల్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ అనేక భారీ నౌకలు, విమానాలు అదృశ్యం అయ్యాయి. వాటికి ఏం జరిగింది? ఎందుకు జరిగింది? వంటి విషయాలపై నేటికీ స్పష్టత లేదు. వివరంగా చెప్పాలంటే బెర్ముడా ట్రయాంగిల్ వద్దకు వెళ్లిన ఏ విమానం గానీ, నౌక గానీ బయటికి వచ్చిన దాఖలాలు లేవు. అంటే బెర్ముడా ట్రయాంగిల్ వద్దకు వెళ్లగానే ఆ విమానాలు గానీ, నౌకలు గానీ కనిపించకుండా పోతాయి. అంతేకాదు, వాటిలో ప్రయాణికులు ఎక్కడికి వెళ్లారు? అనేది ఒక మిస్టరీగానే మిగిలిపోతోంది. వాటి అవశేషాలు గానీ, మృతదేహాలు కూడా అదృశ్యం కావవడం తీవ్ర సంచలనంగా మారింది. అలాస్కా ట్రయాంగిల్ కూడా అలాంటిదే. అలాస్కా ట్రయాంగిల్ అనేది.. ప్రపంచంలోనే ఎక్కువమంది కనిపించకుండా పోయిన అంతుచిక్కని ప్రదేశంగా నిలిచింది. 1972 నుంచి ఇప్పటివరకు 20 వేల మందికిపైగా ఇక్కడ అదృశ్యం అయ్యారంటే పరిస్థితి ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అమెరికాలోని అలాస్కా రాష్ట్రంలోని ఆంకరేజ్, జునౌ, ఉత్కియాగ్విక్ నగరాల ప్రాంతంలో ఈ అలాస్కా ట్రయాంగిల్ ఉంది. 1972 అక్టోబర్‌లో ఇద్దరు అమెరికా రాజకీయ నాయకులు ఆంకరేజ్ సిటీ నుంచి జునై సిటీకి ఓ చిన్న విమానంలో వెళ్తుండగా.. అది కనిపించకుండా పోయింది. అలా తొలిసారి అలస్కా మిస్టరీ తెరపైకి వచ్చింది.

ఒక చిన్న విమానంలో అమెరికా హౌస్‌ నేత థామస్ హేల్ బోగ్స్.. అలాస్కా కాంగ్రెస్ నేత నిగ్ బెగిచ్‌, అతని సహాయకుడు రసెల్ బ్రౌన్.. విమాన పైలట్ జాన్ జోంజ్ కలిసి ప్రయాణించగా.. అది అలాస్కా ట్రయాంగిల్ వద్దకు వెళ్లగానే మాయమైనట్లు అధికారులు గుర్తించారు. దీంతో వారి ఆచూకీని కనిపెట్టేందుకు భారీగా సెర్చ్ ఆపరేషన్లు చేపట్టారు. ఈ నలుగురు ఎక్కడికి వెళ్లిపోయారు అనేదానిపై ఎంతో గాలింపు చర్యలు కొనసాగించారు. అయినప్పటికీ ఆ నలుగురి మృతదేహాలు గానీ.. కనీసం ఆ విమానం కానీ ఇప్పటికీ దొరకలేదు. అయితే ఈ ఘటన వెనుక ఎన్నో కుట్ర కోణాలు ఉన్నాయని అప్పట్లో రకరకాల కథనాలు వెలువడ్డాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ హత్య ఘటనపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్‌లో సభ్యుడిగా ఉన్న థామస్ హేల్ బోగ్స్ మృతి చెందడంతో ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి కానీ, ఆ విమర్శలకు విమానం కనిపించకుండా పోవడానికి కారణం కాదని తేల్చారు. అదే సమయంలో విమానం మిస్సింగ్ మిస్టరీని ఛేదించలేకపోయారు.

తర్వాత 1975లో మరో ఘటన జరిగింది. న్యూయార్క్‌ నగరానికి చెందిన 25 ఏళ్ల గ్యారీ ఫ్రాంక్ సోదర్డెన్.. అలాస్కాన్ అటవీ ప్రాంతంలో వేటకు వెళ్లాడు. కానీ, తిరిగి రాలేదు. రోజులు, నెలల తరబడి ఆ వ్యక్తి కోసం వెతికినా ఫలితం మాత్రం శూన్యం. సెర్చింగ్ ఆపేసిన సుమారు 2 దశాబ్దాల తర్వాత ఈశాన్య అలాస్కాలోని పోర్కుపైన్ నది వెంబడి ఒక మనిషి పుర్రె లభించింది. దాన్ని డీఎన్ఏకు పంపగా.. 2022లో విశ్లేషించారు. అది గ్యారీ ఫ్రాంక్ సోదర్డెన్‌దేని తేల్చారు. అయితే ఎలుగుబంటి దాడిలో అతడు చనిపోయి ఉంటాడని భావించారు. అలస్కా ట్రయాంగిల్‌లో ఇప్పటివరకూ 20 వేల మందికి పైగా కనిపించకుండా పోయారు. ప్రతిఏటా సగటున 2వేల 250మందిని అలస్కా ట్రయాంగిల్ మాయం చేస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. తాజా విమాన ప్రమాదంలోను 10 మంది అమెరికన్లు మృతి చెందారు. ఈ మిస్టరీపై చాలా మంది చాలా థియరీలు చెబుతారు. అలాస్కా ట్రయాంగిల్ వద్ద అసాధారణ అయస్కాంత చర్య జరుగుతుందని కొందరు చెబుతుండగా.. మరికొందరేమో ఇది ముమ్మాటికీ ఏలియన్స్ పనేఅని వాదిస్తారు.మరికొంత మంది ఇది దెయ్యాలపనిగా నమ్ముతారు. ఇంకొందరు బిగ్‌ఫుట్‌గా పురాతన మానవులే అలస్కా ప్రాంతంలో మనుషులను మాయం చేస్తున్నాయంటారు. కానీ, ఒక్కరి వాదనకూ సరైన ఆధారాలు లేవు.

నిజానికి.. అలస్కా ట్రయాంగిల్ దగ్గర ఆకాశంలో తరచూ మిస్టరీ వస్తువులు ఎగురుతూ కనిపిస్తాయి. వాటిని గ్రహాంతరవాసుల వాహనాలుగా స్థానికులు నమ్ముతారు. డైలీ స్టార్ నివేదిక ప్రకారం డిస్కవరీ ఛానల్‌లోని ఒక డాక్యుమెంటరీలో కొన్ని షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. ఈ డాక్యుమెంటరీ లో కొందరు స్థానికులు UFOలను చూసినట్టు చెబుతారు. ఈ ప్రాంతంలో విమానాలు తక్కువ ఎత్తులో ఎగ రడంతో పాటు వాటి నుంచి అస్సలు శబ్దం రాదని స్థానికులు చెప్పారు. సాధారణంగా విమానం భీకరమైన ధ్వనితోనే ప్రయాణిస్తుంది. కానీ, అలస్కా ట్రయాంగిల్ ప్రాంతానికి వచ్చేసరికి విమానాలు అసలు శబ్దమే చేయవని చెప్పడం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.