స్పేస్ లో అనారోగ్యం వస్తే ఎలా..? అక్కడ సర్జరీలకు టీం ఉంటుందా…?

సునీత విలియమ్స్ దెబ్బకు.. మరోసారి “అంతరిక్షం” అనే మాట సంచలనం అయిపొయింది. సునీత విలియమ్స్ సెన్సేషన్ అయిపోయారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 20, 2025 | 02:18 PMLast Updated on: Mar 20, 2025 | 2:18 PM

What If You Get Sick In Space Will There Be A Team There For Surgeries

సునీత విలియమ్స్ దెబ్బకు.. మరోసారి “అంతరిక్షం” అనే మాట సంచలనం అయిపొయింది. సునీత విలియమ్స్ సెన్సేషన్ అయిపోయారు. 9 నెలల పాటు స్పేస్ లో గడిపిన ఏకైక మహిళగా ఆమె రికార్డులు క్రియేట్ చేసారు. మరి ఇన్నాళ్ళ పాటు ఉన్న ఆమెకు అనారోగ్యం వస్తే పరిస్థితి ఏంటీ…? చిన్న చిన్న వాటికే మనం హాస్పిటల్ కు పరుగులు తీస్తాం. డయాగ్నోస్ సెంటర్ల వద్ద బారులు తీరతాం. మరి అంతరిక్షంలో ఉండేవారికి అనారోగ్యం వస్తే…? మెడికల్ ఎమర్జెన్సీ వస్తే అక్కడ వ్యోమగాములకు ఎవరు వైద్యం చేస్తారు…?

అక్కడికి వెళ్ళిన ఆస్ట్రోనాట్స్ విషయంలో నాసా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇందుకోసం టెలిమెడిసిన్‌ విధానం పాటిస్తుంది. దీని ద్వారానే అక్కడున్న వారికి వైద్యం అందిస్తారు. కాని ఆస్ట్రోనాట్స్ కు కూడా దీనిలో అవగాహన అవసరం. వారు కూడా సహకరించాల్సి ఉంటుంది. వారు వెళ్ళే ముందే వారికి అక్కడ వాడే అన్ని మెడికల్ డివైస్‌ల గురించి శిక్షణ ఇచ్చేస్తారు. దానితో పాటుగా సిబ్బందిలోనే ఒకరికి 40 గంటల ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయి. తలనొప్పి, వెన్నునొప్పి, చర్మ సమస్యలు, చర్మం కాలినప్పుడు, డెంటల్ ఎమర్జెన్సీలు ఇలా ఏది వచ్చినా సరే వారికి ఎదుర్కొనే ట్రైనింగ్ ఉంటుంది.

తీవ్ర అనారోగ్యాలు వస్తే… అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో కేవలం బేసిక్ మెడికల్ కిట్ మాత్రమే ఇస్తారు. అందులో ఫస్ట్ ఎయిడ్ కిట్ తో పాటుగా మెడికల్ కండీషన్లపై ఒక పెద్ద బుక్ కూడా ఉంటుంది. అలాగే డెఫిబ్రిలేటర్ అనేగుండె వేగాన్ని సాధారణ స్థాయికి తీసుకొచ్చే ఎలక్ట్రిక్ ఛార్జ్ కూడా ఉంటుంది. అలాగే పోర్టబుల్ ఆల్ట్రాసౌండ్, కళ్లను పరీక్షించే ఒక పరికరం కూడా ఉంటుంది. రెండు లీటర్ల సెలైన్ వంటి కొన్ని ఉపయోగకరమైన వైద్య పరికరాలు ఉంచుతారు.

వ్యోమగాముల శరీరం లోపల ఎలా ఉందో కూడా స్పష్టమైన ఫొటోలను ఈ ఆల్ట్రాసౌండ్ మెషిన్ అందిస్తుంది. ఆల్ట్రాసౌండ్ ద్వారా తీసిన పిక్చర్లను భూమిపై ఉన్న మెడికల్ టీం కు పంపిస్తారు. ఎలా వైద్యం చేయాలో ఆ టీం చెప్తుంది. వారికొక ఫ్లైట్ సర్జన్ కూడా నాసా ఇస్తుంది. ఏరోస్పేస్ మెడిసిన్‌లో ఉండే ఎక్స్పర్ట్ వ్యోమగాములు కింద ఉన్నప్పుడే వారికి అసైన్ చేసేస్తారు. ప్రతి వారం ఫ్లైట్ సర్జన్‌ తో వ్యోమగాములకు ప్రైవేట్‌గా మెడికల్ కాన్ఫరెన్స్ కూడా ఉంటుంది. భూమిపై ఉండే కంట్రోల్ సెంటర్ నుంచి వ్యోమగాములను వారు ఎప్పుడూ అబ్జర్వ్ చేస్తారట.

అంతరిక్షంలో ఎమర్జెన్సీగా సర్జరీ చేయాల్సి వస్తే… అందుకు కూడా నాసా ఒక ప్లాన్ చేసింది. దీనికోసం నాసా రోబోలను స్పేస్ సర్జన్లుగా మార్చేస్తుంది. భూమిపై నుంచి వాటిని కంట్రోల్ చేస్తూ ట్రీట్మెంట్ ఇస్తారు. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో జీరో గ్రావిటీలో తొలి సర్జరీ డెమోను ఒక చిన్న సర్జికల్ రోబో కంప్లీట్ చేసింది కూడా. ఆ రోబో పేరు స్పేస్‌ మిరా.