RAFAH : సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న RAFAH దీని వెనక ఉన్న కథేంటి..
సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆల్ ఐస్ ఆన్ రఫా (All Eyes on Rough) పోస్టే కనిపిస్తోంది. బాలీవుడ్ (Bollywood) నుంచి టాలీవుడ్ (Tollywood) వరకూ.. రాజకీయ నాయకుల నుంచి క్రీడాకారుల వరకూ చాలా మంది ఇవే పోస్టులు పెట్టికి రఫాకు మద్దతు తెలుపుతున్నారు.

What is the story behind RAFAH which is trending on social media..
సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆల్ ఐస్ ఆన్ రఫా (All Eyes on Rough) పోస్టే కనిపిస్తోంది. బాలీవుడ్ (Bollywood) నుంచి టాలీవుడ్ (Tollywood) వరకూ.. రాజకీయ నాయకుల నుంచి క్రీడాకారుల వరకూ చాలా మంది ఇవే పోస్టులు పెట్టికి రఫాకు మద్దతు తెలుపుతున్నారు. దీంతో అసలు ఏంటీ రఫా.. ఎందుకు వీళ్లంతా ఇలా పోస్ట్‌లు పెడుతున్నారు అని కామన్ పీపుల్‌లో కన్ఫ్యూజన్ మొదలైంది. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ రఫా.. పాలస్తీనాలోని గాజా స్ట్రిప్‌లో ఉన్న ఓ నగరం. ఇజ్రాయెల్ (Israel) పాలస్తీనా (Palestine) మధ్య జరుగుతున్న యుద్ధం గురించి కొత్త పరిచయం అవసరంలేదు. రెందు దేశాల మధ్య యుద్ధంతో అక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఎప్పుడు ఏ వైపు నుంచి బాంబుల దాడితో ప్రాణాలు పోతాయోనని వణికిపోతున్నారు.
ఇప్పుడు ట్రెండ్ అవుతున్న రఫా సిటీ గాజా స్ట్రిప్‌లో ఒక గేట్ వే లా ఉంటుంది. ఈ కారణంగానే అక్కడ పాలస్తీన తన సైనికుల శిభిరాన్ని ఏర్పాటు చేసింది. అక్కడే శరణార్థుల కోసం ఏర్పాటు చేసిన శిభిరం కూడా ఉంది. గాయపడ్డ వాళ్లకు చికిత్స అందించే శిభిరాలు కూడా అక్కడే ఏర్పాటు చేశారు. ఇలాంటి సమయంలో ఇజ్రాయెల్ రఫా మీద మిస్సైల్ దాడి చేసింది. ఈ శిభిరాలన్నీ ఉప్ర ప్రాంతంలో బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో దాదాపు 40 మంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో పౌరులు గాయపడ్డారు.
ఈ యుద్ధంలో సామాన్యులకు ఎలాంటి నష్టం లేకుండా చూసుకోవాలి అనుకున్నా కూడా ఈ తప్పు జరిగిందని ఇజ్రాయెల్ ప్రధాని స్వయంగా ఒప్పుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఇది వరల్డ్ వైడ్‌గా పెద్ద ఇష్యూగా మారిపోయింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ రాజకీయ క్రీడా ప్రముఖులంతా రఫాకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇలాంటి తప్పు ఎలా చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. చనిపోయినవాళ్ల ఆత్మలకు శాంతి కలగాలంటే ప్రార్థిస్తున్నారు. ప్రపంచం మొత్తం రఫా వైపు చూడాలంటూ.. ఆల్ ఐస్ ఆన్ రఫా పోస్ట్‌ను ట్రెండ్ చేస్తున్నారు.