What’s App: నెట్ లేకుండా వాట్సప్ చాటింగ్ చేసే కొత్త ఫీచర్.. ఎలాగో తెలుసా..
ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ అనేది అవసరంగా మారిపోయింది. దీనిని ఉపయోగించుకొని తమకు అవసరమైన కార్యకలాపాలను సులభతరం చేసుకుంటున్నారు. ఇలా చేయాలంటే ఆ డివైజ్ కి నెట్ ఉండాలి. నెట్ లేని స్మార్ట్ అంటే ఫోన్ గాలి లేని భూమి లాంటిది. ఎందుకంటే డేటా లేని స్మార్ట్ ఫోన్ వాడలేం. గాలి లేని భూమి మీద బ్రతకలేం. అయితే ఇదే వాట్సప్ కి డేటా లేకుండా చాట్ చేసుకోవచ్చు అంటే ఇక అంతకన్నా గొప్ప విషయం వేరొకటి ఉంటుందా. అందుకే ఆ ఫీచర్ ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.
నేటి ఆధునిక యుగంలో వాట్సప్ ఉపయోగించని నరమానవుడు ఎవరూ ఉండరు. చిన్న పిల్లల మొదలు సీనియర్ సిటిజన్ వరకూ అందరూ వాట్సప్ ను తమ జీవిత భాగస్వామిగా చేసేసుకున్నారు. ఒకానొక సందర్భంలో భార్యను, ప్రేయసిని, మిత్రుడినైనా విడిచి ఉంటారేమోగానీ వాట్సప్ చాట్ చేయకుండా మాత్రం అస్సలు ఉండలేరు. అంతెందుకు అసలు వాట్సప్ అనే గ్రీన్ కలర్ లోగోను చూడకుండా గండ గడవదు అని చెప్పాలి. ఒకప్పుడు వాట్సప్ కేవలం పరస్పరం కుశల ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకునేందుకు మాత్రమే ఉపయోగపడేది. కానీ ఇప్పుడు న్యూస్, మ్యాప్, వీడియో కాల్స్, కాంటాక్ట్స్, స్టేటస్ ఇలా అన్నింటినీ పంపించుకునేందుకు వెసులుబాటుగా మారిపోయింది. ఇలా చేయాలంటే కనీస మొబైల్ డేటా మన ఫోన్ లో ఉండాలి. డేటా లేకుంటే మనం పైన అనుకున్నవి ఏ సేవలను అందిపుచ్చుకోలేము. ఇది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు అలా కాదు పరస్పరం చాటింగ్ చేసుకునేందుకు ఎలాంటి డేటా అవసరం లేకుండా వాట్సప్ చాట్ చేసుకునేలా సరికొత్త ఫీచర్ వాట్సప్ లో అప్డేట్ అయ్యింది.
ఫోన్ డేటా ఉపయోగించకుండా చాట్ చేయడాన్ని ప్రాక్సీ సపోర్ట్ ఫర్ వాట్సప్ అంటారు. ఈ ఫీచర్ ని తాజాగా లాంచ్ చేసినట్లు వాట్సప్ తన బ్లాగ్లో తెలిపింది. ఈ ఫీచర్ ను ప్రతి వినియోగదారుడు ఎలాంటి లిమిటేషన్స్ లేకుండా వినియోగించుకోవచ్చట. కానీ కొన్ని భద్రతల దృష్ట్యా మనం చేసిన చాటింగ్ డేటాను ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్ట్ చేసి ఉంచుతుందని ఈ ప్రకటనలో వెల్లడించారు. డేటా ఉన్నా లేకున్నా వాట్సప్ ఉపయోగించే వారికి ఎలాంటి అసౌకర్యం కలిగించకూడాదనే సంకల్పంతో ఈ సరికొత్త ఫీచర్ ను తీసుకొచ్చినట్లు సంస్థ పేర్కొంది.
డేటా లేకుండా వాట్సప్ ఎలా ఉపయోగించాలో చూద్దాం..
- ముందుగా వాట్సప్ సెట్టింగ్స్ లో వెళ్లాలి.
- స్టోరేజ్ అండ్ డేటా అనే ఆప్షన్ కనబడుతుంది.
- ఈ ఆప్షన్ మీద టచ్ చేసిన తరువాత పైకి స్క్రోల్ చేస్తే ప్రాక్సీ అనే ఆప్షన్ ఉంటుంది.
- ప్రాక్సీ ఆన్ చేసుకొని అడ్రస్ ఎంటర్ చేసిన తరువాత సేవ్ చేసుకోవాలి.
- మీరు చేసిన ప్రాసెస్ కరెక్ట్ అయితే చెక్ మార్క్ పడుతుంది.
- ఇక మీరు వాట్సప్ మెసేజెస్ పంపించుకోవడానికి రిసీవ్ చేసుకోవడానికి సిద్దమైనట్లు లెక్క.
ఒకవేళ ఇలా చేసినప్పుడు చాట్ చేసిన మెసేజ్ సెంట్ అండ్ రిసీవ్ కాకపోతే ప్రాక్సీ అడ్రస్ బ్లాక్ చేసి ఉంచవచ్చు. ఆతరువాత ఇంకో ప్రాక్సీ అడ్రస్ తో తిరిగి ప్రయత్నిస్తే విజయవంతంగా ఈ ఫీచర్ సేవలను ఉపయోగించుకోవచ్చు.
T.V.SRIKAR