Whats app: స్పామ్ కాల్స్ నిరోధించేందుకు వాట్సాప్ సరికొత్త ఫీచర్.!

సాధారణంగా మనం బైక్ మీద డ్రైవింగ్ సమయంలోనో, లేకపోతే కాస్త ఫ్రీ టైం దొరికి కునుకు తీసినప్పుడో, ఆఫీసు పనిలో బిజీగా గడిపేటప్పుడో ఏవో ఒక తెలియని నంబర్ల నుంచి ఫోన్లు తరచూ వస్తూ ఉంటాయి. వాటినే స్కామ్ లేదా స్పామ్ నంబర్స్ అంటారు. ఇవి మనల్ని తరచూ విసిగిస్తూనే ఉంటాయి. వీటిని కొందరు గుర్తించి సాధారణ కాల్స్ ని లిఫ్ట్ చేయరు. అందుకే వీరు సరికొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో వాట్సాప్ నంబర్లకే కాల్స్ చేస్తున్నారు. వీటిని చెక్ పెట్టేందుకు వాట్సాప్ సరికొత్త ఫీచర్ త్వరలో తీసుకురానుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 6, 2023 | 03:53 PMLast Updated on: Mar 06, 2023 | 4:52 PM

Whats App Latest Frature

ఆధునిక యుగంలో ఎటు చూసినా వాట్సప్ చెయ్ అని అంటూ ఉంటారు. చిన్న పిల్లల మొదలు పండు ముసలి వారిదాకా అందరూ ఈ పదాన్ని నిత్యం వాడుతూ ఉంటారు. ఈ విషయాన్ని గమనించిన స్పామ్ కాల్స్ నిర్వాహకులు నేరుగా వారి నంబర్ను సేవ్ చేసుకొని వాట్సాప్ కే కాల్ చేస్తున్నారు. ఇలా చేసినప్పుడు కొన్ని వేరే యాప్ లను ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని ఉంటే అవి అపరిచిత నంబర్లు అని తెలుస్తుంది. అలా చేసుకోలేక పోతే ఎవరి కాల్స్ అయినా లిఫ్ట్ చేస్తాం. స్పామ్ కాల్స్ చేసే వారి తీరును గమనించిన వాట్సాప్ సరికొత్ ఫీచర్ తెచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది.

ఈ విషయాన్ని వాబీటా ఇన్ఫో వెబ్ సైట్ తెలిపింది. సైలెన్స్‌ అన్‌నోన్‌ కాలర్స్‌ అనే పేరుతో ఆప్షన్ ను పొందుపరచనుంది. ఎవరైనా మనకు తెలియని నంబర్ నుంచి కాల్స్ చేస్తే రింగ్ రాకుండా ఈ ఆప్షన్ అడ్డుకుంటుంది. కేవలం నోటిఫికేషన్ బార్ లో మాత్రమే కనిపించేలా సాఫ్ట్ వేర్ ను డెవలప్ చేస్తుంది. ఈ ఆప్షన్ ను ఆన్ చేసుకోవడం ద్వారా ఎవరైనా తెలియని కొత్త వ్యక్తులు కాల్ చేస్తే మనకు రింగ్ వినిపించదు. తద్వారా వారి కాల్స్ ను లిఫ్ట్ చేయకుండా ఉండే సౌకర్యాన్ని కల్పిస్తుంది. ఒకవేళ మనం కాల్ చేసింది ఎవరో తెలుసుకోవాలనుకుంటే నోటిఫికేషన్ వచ్చిన నంబర్ కు మెసేజ్/కాల్ చేయవచ్చు. ఈ ఫీచర్ ప్రస్తుతం డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నట్లు తెలిపారు. ప్రయోగం పూర్తి అయిన తరువాత ఆండ్రాయిడ్ యూజర్లతో పరీక్షిస్తారు. ముఖ్యంగా ఐఓఎస్ ప్రోగ్రాంను ఉపయోగిస్తున్న వారికి మొదటగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

 

T.V.SRIKAR