అంతరిక్షం ఎక్కడి నుంచి స్టార్ట్..? కర్మన్ లైన్ అంటే ఏంటీ..?

సునీత విలియమ్స్ పుణ్యమా అని అంతరిక్షం మరోసారి హాట్ టాపిక్ అయింది. అసలు అంతరిక్షం అంటే ఏంటీ...? భూమికి ఎంత దూరంలో ఉంటుంది అనే ప్రశ్నలు జనాల్లో మొదలయ్యాయి. భూమి గురుత్వాకర్షణ శక్తి.. భూమి నుంచి ఎంత ఎత్తు వరకు ఉంటుంది అనే అంశాలు ఇప్పుడు ఆసక్తిని రేపుతున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 20, 2025 | 10:49 PMLast Updated on: Mar 20, 2025 | 10:49 PM

Where Does Space Start What Is The Karman Line

సునీత విలియమ్స్ పుణ్యమా అని అంతరిక్షం మరోసారి హాట్ టాపిక్ అయింది. అసలు అంతరిక్షం అంటే ఏంటీ…? భూమికి ఎంత దూరంలో ఉంటుంది అనే ప్రశ్నలు జనాల్లో మొదలయ్యాయి. భూమి గురుత్వాకర్షణ శక్తి.. భూమి నుంచి ఎంత ఎత్తు వరకు ఉంటుంది అనే అంశాలు ఇప్పుడు ఆసక్తిని రేపుతున్నాయి.

సముద్ర మట్టం నుంచి 100 కిలోమీటర్ల దూరం తర్వాత.. అంటే కర్మన్ లైన్ ఆవల రోదసి మొదలవుతున్నట్టు.. అంతర్జాతీయంగా చాలా దేశాలు అంగీకరిస్తున్నాయి. అంటే భూమికి 62 మైళ్లు లేదా 3,28,000 అడుగులు దూరంలో. అంత ఎత్తుకి వెళ్లిన తరువాత ‘కర్మన్ లైన్’ మొదలవుతుంది. అక్కడి నుంచి రోదసి మొదలవుతుందని ఆయా దేశాలు చెప్తున్నాయి. కాని ఆ ఎత్తులో కూడా కొన్ని చోట్ల భూవాతావరణం కొంతమేర ఉంటుందట. ఈ ఎత్తుకు వెళ్లిన తరువాత ఆర్బిటల్ వెలాసిటీ అంటే కక్ష్యా వేగం సాధించని పక్షంలో ఏ వస్తువైనా సరే తిరిగి భూమ్మీదకు పడిపోతుంది.

ఇక్కడ అమెరికా వాదన మరోలా ఉంది. భూమి నుంచి 80 కిలోమీటర్ల దూరం దాటి వెళ్ళిన దగ్గరి నుంచి రోదసి కిందకే వస్తుందని అమెరికా చెప్తోంది. అమెరికా సైన్యం, నాసా కూడా కర్మన్ లైన్ కంటే 12 మైళ్లు దిగువ నుంచే అంటే, 50 మైళ్ల దూరం అంటే 80 కి.మీ. నుంచే రోదసి మొదలవుతుందని వాదిస్తున్నాయి. ఈ 80 కిలోమీటర్ల దూరాన్ని ‘ఆస్ట్రోనాట్ లైన్’గా పిలుస్తారు. ఈ లైన్ ధాటి వెళ్ళిన వారు ఎవరైనా వ్యోమగాముల కిందకే లేక్కిస్తోంది. 1960 నుంచి అమెరికా దీన్నే రోదసి సరిహద్దుగా చెప్తుంది. ‘ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్’ ప్రకారం వారు అందరూ ‘ఆస్ట్రోనాట్స్‌’ గానే చెప్తున్నారు.

కాని రోదసి సరిహద్దు విషయంలో ఇప్పటి వరకు అంతర్జాతీయంగా ఏ స్పష్టమైన లెక్కలు లేవు. హై ఆల్టిట్యూడ్ ఫ్లయిట్స్ రికార్డులను ధ్రువీకరించే ‘వరల్డ్ ఎయిర్ స్పోర్ట్స్ ఫెడరేషన్’, ‘ఫెడరేషన్ ఏరోనాటిక్ ఇంటర్నేషనల్’.. వివరాల ప్రకారం… కర్మన్ లైన్‌ను 100 కిలోమీటర్లుగా గుర్తిస్తూ.. ఆ లైన్ దాటితేనే రోదసి అంటున్నాయి. రోదసి సరిహద్దు ఎలాగైనా తేల్చేందుకు 2009లో కాల్గరీ యూనివర్సిటీ పరిశోధకులు.. ‘సుప్రా థర్మల్ అయాన్ ఇమేజర్’ అనే పరికరాన్ని ప్రయోగించారు.

భూవాతావరణంలో వీచే సాధారణ గాలులు, అంతరిక్షంలోని ప్రమాదకర ప్రవాహాల మధ్య మార్పును కొలిచేందుకు దీన్ని వాడారు. ఆ పరికరం అందించిన డాటా ప్రకారం చూస్తే.. రోదసి సరిహద్దు సముద్ర మట్టం నుంచి 73 మైళ్ల నుంచే అంటే 118 కిలోమీటర్ల వద్ద నుంచి స్టార్ట్ అవుతున్నట్టు చెప్పారు.

భూమికి, రోదసికి మధ్య సరిహద్దును ‘కర్మన్ లైన్’ అంటారు. ఇది కేవలం ఓ ఊహా రేఖ మాత్రమే. హంగరీకి చెందిన శాస్త్రవేత్త థియోడర్ వాన్ కర్మన్ ఈ రేఖను ప్రతిపాదించారు. దీనితో ఆయన పేరునే ఈ లైన్ కు పెట్టారు. ఆస్ట్రోఫిజిసిస్ట్ జొనాథన్ మెక్‌డోవల్.. ‘కార్నెల్ యూనివర్సిటీ’కి ‘ది ఎడ్జ్ ఆఫ్ స్పేస్: రీ విజిటింగ్ ద కర్మన్ లైన్’ అనే డాక్యుమెంట్ సమర్పించగా… ఆ డాక్యుమెంట్ లో భూమికి, రోదసికి సరిహద్దుగా చెప్పే కర్మన్ లైన్ 100 కి.మీ.గా పేర్కొన్నారు. కాని… అంతరిక్ష వాహక నౌకల భూకక్ష్య, ఉప కక్ష్యా మార్గాలను పరిగణనలోకి తీసుకుంటూ.. ఆ లైన్ 80కిలోమీటర్లుగా నిర్ధరించాలని అందులో ప్రతిపాదించారు.