Animals Attack: చిన్నారులపైనే జంతువుల పగ… ఎందుకిలా జరుగుతోంది..? తప్పెవరిది..?
మనం ఉండే చోటికి జంతువులు వచ్చి దాడులు చేస్తున్నాయా లేక అవి ఉండే చోటుని మనుషులు అక్రమించారా? అనేది ఆలోచించాల్సిన విషయం.. ఎందుకంటే తిరుమల క్షేత్రం మొత్తం దట్టమైన అటవీ ప్రాంతం.. అలాంటి చోట అడవి జంతువులు ఉండటం సహజం.. అవి ఉండే చోట మనం సంచరిస్తున్నాం.. పొలాల్లో లేదా ఇళ్ళల్లో కట్టేయాల్సిన ఆవుల్ని రోడ్లమీద ఇష్టారాజ్యంగా వదిలేస్తున్నాం.
మొన్న హైదరాబాద్ లో బాబుని కరిచి చంపిన కుక్క..
నిన్న చెన్నైలో పాపని పొడిచి ఆవు..
ఇవాళ తిరుమల నడక మార్గంలో పాపని చంపిన చిరుత పులి..
మూడు ఘటనలు.. మూడు చావులు.. తల్లిదండ్రులకి తీరని విషాదం.. రెండు ఘటనల్లో స్పష్టంగా నిర్లక్ష్యం.. ఒక ఘటనలో ఊహించని పరిణామం..
తిరుమల నడక మార్గంలో చిరుతల దాడి కొత్తేమీ కాదు.. కొద్దిరోజుల క్రితం కూడా చిరుత బాబుపై దాడి చేసింది.. అదృష్ట వశాత్తూ బాబు బతికాడు.. మళ్లీ అదే మెట్ల మార్గంలో మరోసారి చిరుత దాడిలో చిన్నారి చనిపోయింది.. ఇక్కడ టిటిడిని పూర్తిగా తప్పు బట్టలేం.. ఎందుకంటే ఇరవై నాలుగు గంటలపాటు నడక మార్గంలో వచ్చే భక్తులందరికీ భద్రత కల్పించడం అసాధ్యం.. కానీ రీసెంట్ బాలుడి ఘటన తర్వాత ఒక చిరుతను బోనులో పట్టిన అధికారులు దాన్ని దూరంగా వదిలి పెట్టారు.. నడకమార్గం, దిగువ, ఎగువ ఘాట్ రోడ్డు పరిసరాల్లో ఆరు చిరుతలు ఉన్నట్టు టిటిడి ఫారెస్ట్ శాఖ గతంలో ప్రకటించింది.. ఆ తర్వాత సంతానం పెరిగిందో లేదో సమాచారం లేదు.. అయితే చిరుత మూమెంట్ ఎక్కువగా ఉన్న చోట భక్తులను విడివిడిగా కాకుండా గుంపులుగా పంపితే అవి ఎటాక్ చేయవు.. కేవలం సింగిల్ గా ఉంటేనే చిరుతలు దాడి చేస్తాయి.. ఇప్పుడు జరిగిన రెండు ఘటనల్లో తల్లిదండ్రులు తమ పిల్లలతో గుంపులుగా కాకుండా విడిగా వస్తున్నప్పుడు జరిగాయి..
బేసిక్ గా పెద్దపులి మనిషిపై దాడి చేసి మాంసం తింటాయి.. కానీ చిరుతలు మనిషిని చంపి తినే గుణం తక్కువ.. చిరుతలు సాధారణంగా పిరికివి అని చెబుతుంటారు.. అవి మనుషులు గుంపులుగా ఉంటే ఆ దరిదాపుల్లోకి రావు.. అలాంటిది తాజాగా చనిపోయిన చిన్నారి ఒంటిపై గాయాలు చూస్తుంటే దారుణంగా ఉన్నాయి.. చిరుత గాయ పర్చిన తీరు భయంకరంగా ఉంది..
ఇక చెన్నైలో నిన్న స్కూల్ కి వెళ్తున్న పాప ఆవు దాడిలో గాయపడింది.. అమ్మతో పాటు రోడ్డుపక్కన నడుస్తున్న పాపపై ఆవు కొమ్ములతో విరుచుకుపడింది.. సహజంగా సాధు జంతువైన ఆవు.. ఇలా మనిషిపై దాడి చేయడం అరుదు.. అప్పుడప్పుడు ఎద్దులు, ఆంబో తులు దాడులు చేస్తాయి .. కానీ అవులు ఎప్పుడూ దాడులు చేయవు .. ఒక్క పుంగనూరు పొట్టి జాతి ఆవులు మాత్రం చాలా ఫెరోషియస్ గా వుంటాయి.. ఇవి మనిషిని చూడగానే విరుచుకు పడతాయి.. అలాంటిది సాధారణ ఆవు ఈ రకంగా దాడి చేయడం కచ్చితంగా ఆందోళన కలిగించే అంశం.. అది చెన్నై అయినా హైదరాబాద్ అయినా సరే వేలాది ఆవులు రోడ్లపై సంచరిస్తూ ఉంటాయి.. వాటి యజమానులు అవుల్ని ఇలా వదిలేసి పాలు ఇచ్చే సమయానికి తీసుకెళ్తున్నారు.. మార్కెట్ ఏరియాల్లో ఆవులు ఎక్కువగా కనిపిస్తాయి.. కూరగాయలు తేవడానికి వెళ్లే మహిళలు ఇకపై ఆవుని చూడగానే భయపడతారు..
ఇక హైదరాబాద్ లో కుక్కల దాడుల ఘటనలు రోజూ చూస్తున్నాం.. ఎక్కడో ఒక చోట పిల్లలపై దాడులు చేస్తూనే ఉన్నాయి.. కొన్ని చోట్ల ప్రాణాలు కోల్పోతున్నారు.. ఏదైనా ఘటన జరిగినప్పుడు అధికారులు కనిపించిన ప్రతి కుక్కని పట్టేస్తూ హడావిడి చేస్తారు.. నిజానికి కుక్కలన్నింటినీ నగరాల నుంచి పంపించడం సాధ్యమయ్యే పని కాదు.. ఎందుకంటే సమాజంలో బతికే హక్కు వాటికి ఉందని బ్లూ క్రాస్ లాంటి సంస్థలు పోరాటం చేస్తుంటాయి..
అక్కడ ఆవు.. ఇక్కడ కుక్క .. మరోచోట చిరుత ఇలా జంతువులు మనుషులపై దాడులు చేస్తున్నాయి.. కొన్నిసార్లు ఆహారం దొరకని సందర్భంలో జంతువులు ఈ మాదిరి దాడులు చేస్తాయి.. కుక్కలు సహజంగా వేసవి కాలంలో ఎక్కువగా దాడి చేస్తాయి ..
అల్టిమేట్ గా మనం ఉండే చోటికి జంతువులు వచ్చి దాడులు చేస్తున్నాయా లేక అవి ఉండే చోటుని మనుషులు అక్రమించారా? అనేది ఆలోచించాల్సిన విషయం.. ఎందుకంటే తిరుమల క్షేత్రం మొత్తం దట్టమైన అటవీ ప్రాంతం.. అలాంటి చోట అడవి జంతువులు ఉండటం సహజం.. అవి ఉండే చోట మనం సంచరిస్తున్నాం.. పొలాల్లో లేదా ఇళ్ళల్లో కట్టేయాల్సిన ఆవుల్ని రోడ్లమీద ఇష్టారాజ్యంగా వదిలేయడం తప్పు.. దీన్ని కచ్చితంగా నియంత్రించాలి.. ఇక వీధి కుక్కల సంఖ్య విచ్చల విడిగా పెరగకుండా నియంత్రించాల్సిన బాధ్యత కచ్చితంగా ప్రభుత్వాలదే..!