పాము విషం ముంగీసై ఎందుకు పని చేయదంటే! ముంగీసకు ఉన్న వరం ఇదే

విషపూరితమైన పాములు ఎంత డేంజరెస్‌ అనేది మనందరికీ తెలుసు. కొన్ని రకాల పాములు కాటేస్తే క్షణాల్లోనే ప్రాణాలు పోతాయి. ఇలా దేశవ్యాప్తంగా పాము కాటు వల్ల ఏటా కొన్ని వేల మంది చనిపోతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 10, 2025 | 05:50 PMLast Updated on: Mar 10, 2025 | 5:50 PM

Why Doesnt Snake Venom Work On Mongooses This Is The Boon That Mongooses Have

విషపూరితమైన పాములు ఎంత డేంజరెస్‌ అనేది మనందరికీ తెలుసు. కొన్ని రకాల పాములు కాటేస్తే క్షణాల్లోనే ప్రాణాలు పోతాయి. ఇలా దేశవ్యాప్తంగా పాము కాటు వల్ల ఏటా కొన్ని వేల మంది చనిపోతున్నారు. అందుకే చాలా మంది పాములు అంటే వణికిపోతారు. పాము కనిపిస్తే చాలు అక్కడి నుంచి పారిపోతారు. మనుషులే కాదు.. చాలా జంతువులు కూడా పాములకు దూరంగా ఉంటాయి. కానీ ఒకే ఒక్క ప్రాణి మాత్రం పాము కనిపిస్తే చాలు పోరాడుతుంది. బద్ధ శతృవును చూసినట్టు ప్రాణం పనంగా పెట్టి పోరాడుతుంది. అదేంటో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. అదే ముంగీస. ఇద్దరు వ్యక్తుల మధ్య శతృత్వాన్ని చెప్పడానికి చాలా మంది పాము ముంగీసలనే ఎగ్జాంపుల్‌గా తీసుకుంటారు. అంటే వాటి మధ్య ఉండే శతృత్వం యుద్ధం ఎంత భయంకరంగా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఇప్పుడే కాదు పుట్టుకతోనే పాము ముంగీసల మధ్య శతృత్వం ఉంటుంది. కానీ.. ప్రతీ ప్రాణిని విషయంతో చంపేసే పాములు ముంగీసను మాత్రం ఏం చేయలేదు. చాలా వరకూ ముంగీసల మీద పాము విషం పని చేయదు.

చాలా మందికి ఈ విషయం అంతు పట్టదు. కానీ దీని వెనక ఓ పెద్ద మిస్టరీనే ఉంది. అదేంటంటే.. ముంగీసల శరీరంలో ఎసిటైల్‌కోలిన్ ఉంటుంది. ఇది వాటి మెదడులో ఉండే న్యూరోట్రాన్స్మిటర్. ఇది ముంగీస రక్తంలో కలిసిన విషం న్యూరోటాక్సిక్ ప్రభావాలను తగ్గిస్తుంది. దీని వల్ల పాము విషం ఎక్కినా ముంగిసలు చనిపోవు. విషానికి రోగనిరోధక శక్తిని ఇవి కలిగి ఉంటాయి. కొన్ని సార్లు పాములు కూడా ముంగిసల కంటే ఎక్కువ విషాన్ని కలిగి ఉంటాయి. ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ వెబ్‌సైట్ నివేదిక ప్రకారం ముంగిస, పాము మధ్య శత్రుత్వం సహజంగా ఉంటుంది. పాములు ముంగిసకు ఆహారం మాత్రమే. ఆహారం కోసం మాత్రమే పాములను వేటాడతాయి. అవి పాములను వేటాడతాయి కాబట్టే పాముల జాతికి ముంగీస జాతి శతృవు అయిపోయింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌ ఏంటి అంటే.. ముంగీసలు పాముల మీద ఎక్కువగా దాడి చేయవు.

అవి తమను, తమ పిల్లలను పాము దాడి నుండి రక్షించుకోవడానికి మాత్రమే దాడి చేస్తాయి. ఇక్కడ పాముల నుంచి ముంగీసలను కాపాడే మరో అంశం వాటి మూమెంట్‌. ముంగీసలు పాముల కంటే చాలా వేగంగా కదులుతాయి. వాటి మూమెంట్స్‌ను పాములు కాప్చర్‌ చేయలేదు. ఎంత స్పీడ్‌గా పట్టుకోవాలని ప్రయత్నించినా పాముల నుంచి అవి తప్పించుకుంటాయి. అందుకే వీటి మధ్య పోరులో ఎక్కువశాతం ముంగీసలే గెలుస్తుంటాయి. ఈ ముంగీసల్లో ఇండియన్ గ్రే ముంగీస అనేది అత్యంత ప్రమాదకరమైన స్నేక్‌ కిల్లర్‌గా పిలుస్తారు. ఇది కింగ్‌ కోబ్రా లాంటి భారీ పామును కూడా చాలా సింపుల్‌గా చంపేయగలదు. సో ఇదీ.. పాముల నుంచి ముంగీసలను కాపాడే ఎసిటైల్‌కోలిన్‌ కథ.