కుక్క కాలెత్తడం వెనుక ఇంత స్టోరీ ఉందా

మనం వీధి కుక్కలను ఎప్పుడైనా గమనిస్తే... బండ రాళ్ళు, కరెంట్ స్తంభాలు, చెట్ల మొదళ్ళు, ఏదైనా బండి కనపడితే వాటి టైర్లపై మూత్రం స్ప్రే చేస్తూ వెళ్తూ ఉంటాయి. దీనికి కారణం ఏంటీ అనేది చాలా మందిలో సందేహాలు ఉన్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 30, 2024 | 03:45 PMLast Updated on: Aug 30, 2024 | 3:45 PM

Why Dogs Spray Their Toilet

మనం వీధి కుక్కలను ఎప్పుడైనా గమనిస్తే… బండ రాళ్ళు, కరెంట్ స్తంభాలు, చెట్ల మొదళ్ళు, ఏదైనా బండి కనపడితే వాటి టైర్లపై మూత్రం స్ప్రే చేస్తూ వెళ్తూ ఉంటాయి. దీనికి కారణం ఏంటీ అనేది చాలా మందిలో సందేహాలు ఉన్నాయి. దానికి గల కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం. కుక్కలను మనుషులు మచ్చిక చేసుకున్నారు గాని కుక్క అనేది అడవి జంతువే. వేటాడి మాత్రమే జీవించే జంతువు కుక్క. అంటే తోడేళ్ళ మాదిరి వేటాడి బ్రతికే జంతువు. గుంపులు గుంపులుగా అడవుల్లో ఉండి ఆహార అన్వేషణ చేస్తాయి.

అయితే క్రమంగా కుక్కల సంఖ్య అనేది పెరుగుతూ వచ్చింది. మనుషులకు కుక్కలు బాగా దగ్గరయ్యాయి. కాని వాటి జాతి లక్షణాలను మాత్రం కొన్నింటిని కుక్కలు మరువలేదు. అందులో ఒకటి మూత్రం స్ప్రే చేయడం. ఈ లక్షణం వాటికి తోడేళ్ళ నుంచి వచ్చిందని శాస్త్రవేత్తల నమ్మకం. వీధి కుక్కలకు, తోడేళ్లకు వేటాడటానికి ఒక పరిధి ఉంటుంది. ఇవి సాధారణంగా గుంపులుగా నివసిస్తాయి కాబట్టి ఆహార అన్వేషణ కోసం గుంపులుగానే వెళ్తూ ఉంటాయి. కుక్క ఏదైనా బలమైన జంతువుపై ఒంటరిగా పోరాటం చేయలేదు.

అందుకే అది వేటకు వెళ్ళే సమయంలో కనపడిన చెట్లపై బండ రాళ్ళపై మూత్రం పోస్తూ వెళ్తుంది. ఇతర కుక్కలకు ఆ కుక్క ఎటువైపు వేటకు వెళ్ళింది అనేది ఒక మార్గం చూపడానికి కుక్క అలా చేస్తుంది. ఆ మూత్రం వాసనను కుక్క శ్వాస గ్రంధులు గ్రహిస్తాయి. అలా మూత్రం ఎప్పుడు పోశాయి, ఎంత సమయం అయింది, వేటకు ఒకటే కుక్క వెళ్ళిందా లేదా గుంపు వెళ్ళిందా అనే దానిపై మూత్రం ఆధారంగా ఇతర కుక్కలు గుర్తిస్తాయి. అయితే ఇదే లక్షణం సింహాలు, పులులకు కూడా ఉంది. కాని అవి మాత్రం తమ కారిడార్ ను నిర్దేశించడానికి మూత్రం స్ప్రే చేస్తూ వెళ్తాయి. ఆ కారిడార్ లో వాటి ఆధిపత్యం మాత్రమే ఉండేలా జాగ్రత్త పడతాయి.