PM MODI: విదేశాల్లో పెళ్లిళ్లు అవసరమా..? ఫారిన్ డెస్టినేషన్ వెడ్డింగ్స్‌పై ప్రధాని మోదీ వ్యాఖ్యలు..
ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ పెళ్లిళ్లకు సంబంధించి ఒక కొత్త ట్రెండ్ నడుస్తోంది. కొందరు పెద్ద కుటుంబాల వాళ్లు విదేశాలు వెళ్లి అక్కడ వివాహాలు చేసుకుంటున్నారు. అంత అవసరం ఉందా? అదే ఇండియాలోనే పెళ్లి చేసుకుంటే దేశ ప్రజల మధ్య చేసుకున్నట్టు ఉంటుంది.
PM MODI: ఇటీవలి కాలంలో ట్రెండుగా మారిన ఫారిన్ డెస్టినేషన్ వెడ్డింగ్స్‌పై ప్రధాని మోదీ స్పందిచారు. విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకోవడం అవసరమా అని ప్రశ్నించారు. మన్‌కీబాత్‌లో భాగంగా ఆదివారం ప్రధాని మోదీ పలు అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఇటీవల ఎక్కువగా జరుగుతున్న విదేశాల్లో పెళ్లిళ్లపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. “పెళ్లిళ్ల సీజన్‌లో దేశంలో జరిగే పెళ్లిళ్లు, దానికి సంబంధించిన ఖర్చులు.. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి దోహదం చేస్తాయి.
Siddaramaiah: కర్ణాటక రండి.. నిజాలు చూపిస్తాం.. కేటీఆర్‌కు సిద్ధ రామయ్య సవాల్
అయితే, ఇటీవలి కాలంలో భారతీయులు కొందరు విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకునే ట్రెండ్ పెరిగింది. ఇది అవసరమా..? పెళ్లిళ్లకు సంబంధించిన అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు నన్ను ఒక అంశం చాలా కాలంగా ఇబ్బంది పెడుతోంది. నా మనసులోని ఆవేదన నా కుటుంబ సభ్యులకు కాకుండా ఎవరికి చెబుతాను? ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ పెళ్లిళ్లకు సంబంధించి ఒక కొత్త ట్రెండ్ నడుస్తోంది. కొందరు పెద్ద కుటుంబాల వాళ్లు విదేశాలు వెళ్లి అక్కడ వివాహాలు చేసుకుంటున్నారు. అంత అవసరం ఉందా? అదే ఇండియాలోనే పెళ్లి చేసుకుంటే దేశ ప్రజల మధ్య చేసుకున్నట్టు ఉంటుంది. మన దేశంలోని సొమ్ము మన దేశంలోనే ఉంటుంది. పెళ్లి వేడుకలు భారత్‌లోనే చేసుకుంటే ఇక్కడి వ్యాపారానికి ఊతం ఇచ్చినట్టు ఉంటుంది. ఇక్కడి ప్రజలకే సేవల రూపంలో కానీ, మరో రూపంలో కానీ అవకాశాలు ఇచ్చినట్టు కూడా ఉంటుంది. పేద ప్రజలు కూడా మీ వివాహాల గురించి తమ పిల్లలకు గొప్పగా చెబుతారు. వోకల్ ఫర్ లోకల్‌ను మరింత ముందుకు తీసుకువెళ్లినట్టు అవుతుంది.
నా ఆవేదన తప్పనిసరిగా ఉన్నత కుటుంబాల వారు అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నా. పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. ఈ సీజన్‌లో రూ.5 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా. పెళ్లిళ్ల కోసం షాపింగ్‌కు వెళ్లినప్పుడు దేశవాళీ ఉత్పత్తుల కొనుగోలుకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వండి. వాటినే కొనుగోలు చేయండి” అని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు.