సునీతా విలియమ్స్‌ స్పేస్‌లో కాలిపోతారా US ఆర్మీ సంచలన ప్రకటన

8 రోజుల అంతరిక్ష పర్యటనకు వెళ్లి అక్కడే చిక్కుకున్న సునితా విలియమ్స్‌ గురించి ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆందోళన చెందుతోంది. ఎప్పుడు వస్తారో.. అసలు వస్తారో రారో అన్న అనుమానాలతో వేల ప్రశ్నలు ఈ విషయంలో తలెత్తుతున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 21, 2024 | 01:15 PMLast Updated on: Aug 21, 2024 | 1:15 PM

Will Sunita Williams Burn In Space Us Army Sensational Announcement

8 రోజుల అంతరిక్ష పర్యటనకు వెళ్లి అక్కడే చిక్కుకున్న సునితా విలియమ్స్‌ గురించి ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆందోళన చెందుతోంది. ఎప్పుడు వస్తారో.. అసలు వస్తారో రారో అన్న అనుమానాలతో వేల ప్రశ్నలు ఈ విషయంలో తలెత్తుతున్నాయి. ఇదే క్రమంలో US మిలిటరీ నుంచి వచ్చిన ఓ ప్రకటన ఇప్పుడు సంచలనంగా మారింది. అంతరిక్షంలో చిక్కుకున్న సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ మంటల్లో కాలిపోయే ప్రమాదం ఉందని US మిలిటరీ స్పేస్ సిస్టమ్ మాజీ కమాండర్ రుడీ రిడాల్ఫి ఆందోళన వ్యక్తం చేశారు. బోయింగ్ స్టారైనర్ సురక్షితంగా భూమ్మీదకు రావాలంటే సర్వీస్ మాడ్యూల్ సరైన కోణంలో క్యాప్స్యూల్‌కు అతుక్కోవాలి.

ఒకవేళ మాడ్యూల్ కోణం మరీ ఏటవాలుగా ఉండి ఒరిపిడి పెరిగి మంటలు చెలరేగితే ఆస్ట్రోనాట్స్ మాడిమసవుతారని హెచ్చరించారు. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తే తప్ప వాళ్లు ప్రాణాలతో భూమ్మీదకు తీసుకురావడం సాధ్యం కాదని చెప్పారు. దీంతో ఇప్పుడు సునీతా విలియమ్స్‌ టీం అసలు ప్రణాలతో తిరిగి వస్తారార రారా అనే అనుమానాలు మొదలయ్యాయి. భాతర సంతతికి చెందిన నాసా ఆస్ట్రోనాట్‌ సునీతా విలియమ్స్‌, మరో ఆస్ట్రోనాట్‌ విల్ మోర్‌తో కలిసి జూన్‌ 6న ఇంటర్నేషనల్ స్పెస్ సెంటర్‌కు వెళ్లారు. బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్సుల్స్‌లో వెళ్లిన వీళ్లు జూన్ 14 న తిరిగి భూమి మీదకు రావాల్సి ఉంది.

అయితే స్టార్ లైనర్ క్యాప్సుల్‌లో హీలియం లీకేజి కారణంగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏర్పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో భూమి మీదకు రావడం ప్రమాదమని నాసా ప్రకటించింది. దీంతో వాళ్లు అక్కడే చిక్కుకుపోయారు. ఒకవేళ స్టార్ లైనర్ క్యాప్సుల్ భూమి మీద సేఫ్ ల్యాండింగ్ అయ్యే అవకాశం లేకపోతే.. ప్రత్యామ్నాయంగా వారిని కిందకు తెచ్చేందుకు స్పేస్ ఎక్స్‌కు చెందిన క్రూ డ్రాగన్ వ్యోమ నౌకను పంపి తెస్తామని ప్రకటించింది. కానీ ఆ ప్రయోగం 2025లో జరుగుతుంది. దీంతో అప్పటి వరకూ స్పేస్‌ స్టేషన్‌లో ఉన్న ఇద్దరు ఆస్ట్రోనాట్స్‌ అక్కడ ఉండాల్సిందే. దీంతో వీరద్దరు మరో 8 నెలలు అంతరిక్ష కేంద్రంలో గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది.